[dropcap]‘కొ[/dropcap]త్త పదసంచిక’కి స్వాగతం.
సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు ఎమ్మెస్వీ గంగరాజు గారు ‘కొత్త పదసంచిక’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.
ఆధారాలు:
అడ్డం:
01. మాజీ అవ్వాలంటే ఇది చెయ్యాలి.(4). |
04. ఆకాశ రాశిలో పున్నమి చంద్రుడు.(4). |
07. ‘సరిచేసి నాడు. రాయుమా’ అందామంటే ఈ నిర్మాత ఇప్పుడు లేరే!(5). |
08. కోర్టు లో వేసేది బాలు కాదు!(2). |
10. మన ముసలితనం హిందిలో కొంచెం.(2). |
11. ఈ విసనకఱ్ఱ దేవతలు విసురుకునేదా?(3). |
13. నెట్టము అంటూ నీళ్లు నముల్తే ఎలా?(3). |
14. ఎటునుంచి చూసినా వస్త్రము మాత్రమే కనిపిస్తుంది.(3). |
15. ప్రమాద ఘంటిక! (3). |
16. ఆయుర్వేదం లో ప్రధాన ముడిసరుకా?(3). |
18. బహువచనం లో భార్య. (2). |
21. ఈ వెంకటేశ్వర భక్తురాలిలో కొండ పోయింది. (2). |
22. శ్రీరాముడు దర్శించిన అనామకుడు.(5). |
24. ఇక్కడ ఈశ్వరుడుంటాడు.(4). |
25. తాపము కలిగించేవాడు తడబడ్డాడు.(4). |
నిలువు:
01. “ఎవడబ్బ సొమ్ము?” అని ప్రశ్నించిన వాడు. (4). |
02. నా రాగాలు సగమే గుర్తున్నాయి.(2). |
03. ముమ్మారు కాదు! ముమ్మాలు!!(3). |
04. మోహన్ బాబు, వెంకటేష్ సినిమాలు రెంటిలో కామన్ ఫాక్టర్!(3). |
05. వల్ల కాదు అన్నారంటే వచ్చేది అడవి!(2). |
06. గాడిద దాగిన కొండ కొన.(4). |
09. ఏడు రోజులకోసారి ఫలించేవి.(5). |
10. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వడానికి ‘సిగ్గేస్తోందా?’ అన్నారెవరో.(5). |
12. ఒక పక్షి! ముందు కొండ పెట్టేరంటే మింగేస్తుంది జాగ్రత్త!(3). |
15. మొదటి అచ్చులు!(4). |
17. వేప కలసినా చేదు అంటదు.(4). |
19. మూడడుగులు సరిచేసుకుని ప్రపంచం దర్శించండి.(3). |
20. సోదరులు. చెదిరిపోయారు పాపం!(3). |
22. పరాయి విశేషణము! (2). |
23. సర్వనామం! శరీరానికి సంబంధించినది. (2). |
ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2021 ఆగస్టు 16 వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘కొత్త పదసంచిక 2 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2021 ఆగస్టు 22 తేదీన వెలువడతాయి.
పదసంచిక-116 జవాబులు:
అడ్డం:
1.శ్రీకృష్ణజన్మస్థానము 5.సొంపు 8.తిసకోచా 9.వైశంపాయన 11.పందిరి 13.పచ్చసిరా 15.బుల్లిరాజు 16.ధనంజయుడు 17.మాచకమ్మ 19.గురజాడ 21.అముక 23.వృథాప్రయాస 24.తరతమ 26.ముక్తి 27.అన్యథాశరణంనాస్తి
నిలువు:
1.శ్రీజ 2. ష్ణవసన్యాసి 3. న్మథచాపం 4. నగవైరి 6. పుట్టినరోజు పండగ 7. జపానెల్లి 10. చంపకమాలావృత్తము 12. దిగ్విజయము 14) రాధమ్మ 15. బుడుగు 18. కడప్రతి 20. రక్తతర్పణం 21. అసామాన్య 22. కతమంశ 25. స్వస్తి
పదసంచిక-116 కి సరైన సమాధానాలు పంపిన వారు:
- అభినేత్రి వంగల
- అనూరాధ సాయి జొన్నలగడ్డ
- అన్నపూర్ణ భవాని
- బయన కన్యాకుమారి
- భాగవతుల కృష్ణారావు
- ఇంకొల్లు బ్రహ్మేంద్రస్వామి
- సిహెచ్.వి.బృందావనరావు
- ద్రోణంరాజు మోహన్ రావు
- ద్రోణంరాజు వెంకట నరసింహా రావు
- ఎర్రోల్ల వెంకట రెడ్డి
- జానకీ సుభద్ర పెయ్యేటి
- కిరణ్మయి గోళ్ళమూడి
- కోట శ్రీనివాసరావు
- మత్స్యరాజ విజయలక్ష్మి
- మధుసూదనరావు తల్లాప్రగడ
- నీరజ కరణం
- పడమట సుబ్బలక్ష్మి
- పద్మశ్రీ చుండూరి
- పద్మావతి కస్తల
- పొన్నాడ సరస్వతి
- రంగావఝల శారద
- రామలింగయ్య టి
- శంబర వెంకట రామ జోగారావు
- శిష్ట్లా అనిత
- శ్రీధర్ ముప్పిరాల
- శ్రీనివాసరావు సొంసాళె
- శ్రీవాణి హరిణ్మయి సోమయాజుల
- శ్రీవిద్య మనస్విని సోమయాజుల
- తాతిరాజు జగం
- వెంకట్ శాస్త్రి సోమయాజుల
- వర్ధని మాదిరాజు
- వైదేహి అక్కపెద్ది
వీరికి అభినందనలు.
గమనిక:
ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరిగింది.