[శ్రీ చందలూరి నారాయణరావు రచించిన ‘కొత్త పరిమళం’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
ఏమిటీ ఈ వింత రాత్రులు?
నిద్రను బయటకి నెట్టాయాలని
కంటితో యుద్ధమా?
రక్తపు మడుగులో
మానని గాయాలతో
విరిగిన మాటలు మధ్య ఒరిగిన కలకు
విలువ గల ఒక్క పదంతో
కట్టుకట్టినా చాలు
ఓడిన ఊహకు ప్రాణం పోసి
నలిగిన మనసులో
మొన్నటి ప్రేమను వెతికి అప్పచెబితే
కొత్త పరిమళం ఉదయించినట్లే