[dropcap]డి[/dropcap]జిటల్ బాల్యమిది
చిన్నారుల భవిష్యత్తు
టెక్నో వృక్షానికి వేలాడుతూ ఉంటుంది..
నేరపూరిత క్రిములు
ఆకర్షించకపోతే
ఫలాలను ఆరగించగలుగుతుంది.
సాలె”గూడు”
స్మార్ట్ఫోన్ వైరస్
బాల్యంలోకి సులువుగా జొరబడుతుంది
బుద్ధిని తొలుస్తుంది.
ఆన్లైన్ విద్య సాకు
అశ్లీల వీడియోల కోసం వెతుకుతుంది
లాక్‌డౌన్ లాకప్‌లో
బాల్యాన్ని సెల్ ఫోన్లు దోచుకుంటున్నాయి.
మొగ్గ తొడగాల్సిన బాల్యం
పెడదారిన గిడస బారి
తొడిమై రాలిపోతుంది.
నిరక్షరాస్యత
పేదరికాన్ని, నేరాల కంటే..
సాంకేతిక వ్యసనం
వక్ర బుద్ధిని మరింత వంకర చేస్తోంది
సాంకేతికాన్ని
సంతోషానికి, సంక్షేమానికి
కరవాలం చేసుకోవాలి..
కాదంటే
భవిష్యత్తు
కారుమబ్బుల సైబర్ ఆకాశం
జనంపై వాలి
కమ్ముకొని
వెలుతురుని తెగ్గోస్తుంది.