Site icon Sanchika

కొవ్వలి ‘జగజ్జాణ’ గుర్తుందా?

[dropcap]1[/dropcap]960లో ఎమ్.వి.ఎస్. పబ్లికేషన్స్ (ఎం.వి.ఎస్. ప్రెస్) మద్రాసు వారిచే “భయంకర్’ అన్న కలం పేరుతో  శ్రీ కొవ్వలి లక్ష్మీనరసింహారావు వ్రాసిన “జగజ్జాణ” అనే ఇరవై ఐదు భాగాల మిస్టరీ సీరియల్ గుర్తు ఉన్నదా!!

అంతకుముందు “చాటు మనిషి”, “విషకన్య” వంటి మిస్టరీ సీరియల్స్ రాసి పాఠకలోకంలో అత్యధిక సంచలనాన్ని కలిగించారాయన. మనుషులు పక్షులు జంతువులుగా మారిపోవడం…! పరకాయప్రవేశాలు….!దేవగణాలు…! నెలకు రెండు పుస్తకాలు విడుదలయ్యేవి.

సంవత్సరకాలం పాటు పాఠకుల్ని ఉత్కంఠతో ఉర్రూతలూగించిన ఈ సీరియల్ ఒక్కో పుస్తకం వెల అక్షరాల 60 పైసలు. ప్రతి భాగం చివరలో ఏదో ఒక సమస్యతో కూడిన సస్పెన్స్‌తో ముగుస్తుంది. ఆ కథా కమామీషు వచ్చే ఆదివారం మీకోసం… “సంచిక” పాఠకులకోసం!

Exit mobile version