Site icon Sanchika

కోయిలా… కొంటె కోణంగివే…

[dropcap]ప[/dropcap]ల్లవి:
కోయిలా నీవెంతో కొంటె కోణంగివే

అనుపల్లవి:
మింటిపై ఎలుగెత్తి అంతగా పిలిచేవు
ఒంటరిగ కొమ్మపై ఓంకార నాదాలు

భాష భావమ్ముల భాష్యాలు మా కొదిలి
పారవశ్యపు పలుకు రాగాల నొలికించి
కాలమొకటుందనీ ఆకృతులు కలవనీ
కంఠ మాధుర్యాన కాలమాగిపోవుననీ

ప్రకృతియె పదిలమని పండు
వెన్నెలలున్నవని
పన్నీటి బాటన కన్నీరు వలదనీ
అమవాస్య నిసిలోన అందాలు గలవనీ
తిమిరాలు ఛేదింప దినకరుడు గలడనీ

Exit mobile version