[dropcap]క[/dropcap]స్తూరి మురళీకృష్ణ, కోడీహళ్ళి మురళీమోహన్ సంపాదకత్వం వహించగా సంచిక వెబ్ పత్రిక-సాహితీ ప్రచురణలు సంయుక్తంగా ప్రచురించిన ‘క్రీడాకథ’ పుస్తక ఆవిష్కరణ సభ తెలంగాణా భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని రవీంద్రభారతి మినీహాలులో సోమవారం, 06 మే 2019 సాయంత్రం 6 గంటలకు జరుగుతుంది.
శ్రీ వాసిరెడ్డి నవీన్ సభకి అధ్యక్షత వహిస్తారు. శ్రీ నందిని సిధారెడ్డి ఆత్మీయ అతిథిగా విచ్చేసి పుస్తకాన్ని ఆవిష్కరిస్తారు. శ్రీ మామిడి హరికృష్ణ విశిష్ట అతిథిగా వేదికని అలంకరిస్తారు. శ్రీ కె.పి.అశోక్ కుమార్ పుస్తకాన్ని పరిచయం చేస్తారు.
సాహితీ ప్రియులందరికీ ఇదే ఆహ్వానం. తప్పక హాజరు కాగలరు.