Site icon Sanchika

కృషి!!

[dropcap]ఆ[/dropcap]నతి లేనిదే ఆకు కదలున, గాలి వీచున?!
శివునానతి లేనిదె ఊపిరాడున, జీవి నిల్చున?!

చేసిన దంతయు నీదను, నీవను భ్రమ లేలర?
వీసములో దిశ మార్చి వివశు చేయునది, శివమేర!

సాగినంత కాలము సాగుట, వాని నిశ్చయముర!
ఆగి రథమిక సాగక యున్న, శైవ హాస లీలర!

ప్రయత్న బుధ్ధియె సంపద, పయన మనుభవముర!
జయాజయముల నెన్నక సాగర, కృషీవలుడవై!!

ఫలముతో పని యేమిర, సల్పు ముద్యోగముర
ఫలమందిన మోదమే, లేకున్న మరల యత్నమే!!

అనుకున్న దయిన సరియే, కాకున్నను సరియె
వినర జీవనమున కిదియె, సాఫల్య మంత్రముర!!

Exit mobile version