Site icon Sanchika

‘కులం కథ’ పుస్తకం – ‘హరిజన లక్ష్మి’ – కథా విశ్లేషణ

[dropcap]కా[/dropcap]వలిలోని శ్రీ చైతన్య జూనియర్ కళాశాల విద్యార్థులు ‘కులం కథ’ పుస్తకం చదివి తమకి నచ్చిన కథను విశ్లేషించి, ఆ కథ తమకెందుకు నచ్చించో పేర్కొన్నారు. సీనియర్ ఇంటర్ ఎంపిసి చదువుతున్న ఎన్. చందన ఈ పుస్తకంలోని ‘హరిజన లక్ష్మి’ కథను విశ్లేషిస్తోంది.

***

“కులం కథ పుస్తకంలో నాకు నచ్చిన కథ ఆర్.జనాబాయి నాయుడు రచించిన ‘హరిజన లక్ష్మి’.

మన భారతదేశంలో కులాల, మతాల విచక్షణ ఎక్కువగా ఉంది. అంబేద్కర్ లాంటి వాళ్ళు ఎన్ని చట్టాలు తెచ్చినా దానిని నిర్మూలించలేకున్నాము. ఎప్పుడూ ఒక మనిషిని తక్కువ చేసి మాట్లాడకూడదు. ఎలాగంటే మనం వంటలో కరివేపాకు వేస్తాము, కాని తినేటప్పుడు అది పనికిరాదు అని విసిరివేస్తాము. కాని దాని వల్ల ఎంత లాభం ఉంటుందో మనకు తెలీదు. అదే విదంగా ఒక మనిషిని ఎప్పుడూ తక్కువ చేయ్యకూడదు. మన దగ్గర ధనం ఉంటే మనం గొప్పవాళ్ళం. ఎదుటి వారు దగ్గర ధనం లేదని వారు తక్కువ కాదు. ఎందుకంటే ధనం అనేది శాశ్వతం కాదు. దానికి ఉదాహరణ నేను చదివిన కథ ‘హరిజన లక్ష్మి’.

ఆమె చిన్నతనంలో తన తల్లిదండ్రులను కోల్పోయింది. దానితో తనకు ఆహారం లభించలేదు. ఒక రోజు లక్ష్మీ ఆహారం కోసం యాచించేటప్పుడు భగీరధీ అనే యిల్లాలును ముట్టుకుంది. దానితో ఆమెకు కోపం వచ్చి తన శిరస్సు పగల కొట్టింది. కాని లక్ష్మికి తన అదృష్టం వల్ల ఒక మహా యిల్లాలు సుశీల వద్దకు చేరింది. తను బాగా చదివి డాక్టర్ అయ్యింది. అలా తనకు జరిగిన ఆన్యాయం ఎవరికి రాకూడదు అని తన గ్రామంలో ప్రజలకు సాయం చేస్తూ వచ్చింది. ఇలా ఉండగా ఒక రోజు తన శిరస్సు పగలకొట్టిన భగీరధీ అనే ఆమెకు అనారోగ్యం వచ్చింది. అప్పుడు లక్ష్మి తనకు వైద్యం చేసి రక్షించింది.

ఈ కథ ద్వారా నేను తెలుసుకున్న విషయాలు.

  1. ఇతరులు మనకు అపకారం చేసినా మనం ఎప్పుడు వాళ్ళకి ఉపకారం చేయ్యాలి.
  2. మనం ఎంత గొప్పస్థానంలో ఉన్న ఇతరుల పట్ల గౌరవభావంతో ఉండాలి.
  3. నేడు తక్కువ కులం వాళ్ళు అని అవమానిస్తే భవిష్యత్తులో మన జీవితం వాళ్ళ చేతిలో ఆదారపడుతుంది.
  4. కులాలు, మతాలు అనే అడ్డుగోడలను తొలగించి మనుషులు అంతా సమానమే అని తెలుసుకోవాలి.
  5. కులాలు అనేవి బ్రతకడానికి దోహదపడాలి కాని అవే కులాలు మరణానికి దారి చూపకూడదు.”

ఎన్. చందన, సీనియర్ ఎంపిసి,

 

Exit mobile version