Site icon Sanchika

‘కులం కథ’ పుస్తకం – ‘కులం’ – కథా విశ్లేషణ

[dropcap]కా[/dropcap]వలిలోని శ్రీ చైతన్య జూనియర్ కళాశాల విద్యార్థులు ‘కులం కథ’ పుస్తకం చదివి తమకి నచ్చిన కథను విశ్లేషించి, ఆ కథ తమకెందుకు నచ్చిందో పేర్కొన్నారు. సీనియర్ ఇంటర్ బైపిసి చదువుతున్న డి. ప్రవల్లిక ఈ పుస్తకంలోని ‘కులం’ కథను విశ్లేషిస్తోంది.

***

నేను వ్రాసేది కథ ‘కులం కథ’ పుస్తకంలోని ‘కులం’ అనే కథ గురించి. ఈ కథ తోలేటి జగన్మోహనరావు రచించారు.

ఈ కథ నాకు బాగా నచ్చింది. ఎందుకనగా ఈ కథలో రచయిత నేటి సమాజంలో మనుష్యుల మధ్య ఉన్న కుల విబేధాలు, వాటి భేదాలను గూర్చి అద్భుతంగా వివరించారు. కులం పిచ్చిలో మనుష్యులు వారి మధ్యనున్న బంధాలను, వాటి విలువలను మరిచిపోతున్నారు. కన్న బంధాలను మరియు తోడబుట్టిన బంధాలను విడదీయగలిగే ధీటైన అగ్రగామిగా కులం నేడు నిలుస్తున్నది.

ఎలాగనగా మన కథలో కొడుకు హరిజనుడైనా అతని భార్య అగ్రకులపు వ్యక్తి కావటం వలన కులం పిచ్చిలో ఆ కొడుకు తండ్రికి మర్యాద ఇవ్వడం, తండ్రిని చూసుకోవడం కూడా మర్చిపోయాడు. నిజంగా చెప్పాలంటే నేటి సమాజంలో కులాలు అనేవి ఎన్నో ఇబ్బందులకు గురైతున్నాయని మనం ఈ కథలో గమనించాం. నేటి రోజుల్లో మన ఇంట్లో మనతో కలసి బ్రతికే వ్యక్తితో మన ఇబ్బందులు పంచుకోవడానికి అసౌకర్యంగా భావిస్తాం. అటువంటిది ఎవరో తెలియని వ్యక్తితో తన విషయాలన్నీ ఆ ముసలివాడు తెలుపుట నాకు బాగా నచ్చినది.

ఈ కథలో మొదట్లో ‘సొంత బిడ్డల్లనే ఏరు ఏరు కులాలుంటాయని నాడు తెలియదు. తర్వాతే కులమోదో తెలుసుకున్నాను’ అను మాట నన్నెంతో కదిలించింది. అలాగే మనకు సహాయము చేసిన వాడిని మనం ఎన్నటికీ మరువరాదు అన్న విషయం మనకు తెల్సిందే. దానికి ప్రతిరూపంగా అతని పంతులు అతనిని చదివించిన దానికి అతడు అతని మనువని తల్లి అనగా అచ్చమ్మ దహన సంస్కారంకు సహాయము చేసి కులం కులం అని ఏడ్చే వాళ్లు ఆ రోజు ఆ తల్లి కార్యానికి ఎందుకు రాలేదు. అయినా దీనిలో ఆ ముసలివాడు డబ్బున్నవాడు అధికకులం వాడు; డబ్బు లేని వాడు దిగువ కులం వాడు అని మరిచాడు. దానికి కారణం అతని చదువేనా.

చదువు నలుగురికి మంచి చేయడానికి ఉపయోగపడాలే గాని ఇంకొక నాలుగు కులాలను ఏర్పరుచుటకు కాదు. అసలు కులాలను, వర్గాలను కనిపెట్టింది మనమే కదా కాని మనుష్యులంతా పుట్టేటప్పుడు ఏమియు తీసుకురారు. వెళ్ళేటప్పుడు ఏమియు తీసుకుపోరు, దానికి మధ్యలో ఈ కులాల గోలెందుకు అన్న భావన ఆ ముసలాయన మాటల్లో బాగా తెలుస్తున్నది.

కానీ చదువుతున్నంత సేపు ఏం జరిగి ఉంటుంది అనే ఆత్రుత కలుగ జేసే విధంగా రచయిత రాశారు. నాకు ఈ మద్యలో అన్నింటికంటే బాగా నచ్చిన విషయం ఏంటంటే చివరిలో అసలు కులమంటే ఏమిటి అనే ప్రశ్నను ఒక చదువుకున్న వాడి చేత అడిగింపబడుతున్న ఒక కులం అనే విషయాన్ని గూర్చి ఒక చదువుకున్న వాడినే అడగడం అత్యంత సంతోషకరం.

డి. ప్రవల్లిక,

సీనియర్ బైపిసి.

Exit mobile version