‘కులం కథ’ పుస్తకం – ‘మంచితనానికి కులమేమిటి?’ – కథా విశ్లేషణ-2

0
1

[dropcap]కా[/dropcap]వలిలోని శ్రీ చైతన్య జూనియర్ కళాశాల విద్యార్థులు ‘కులం కథ’ పుస్తకం చదివి తమకి నచ్చిన కథను విశ్లేషించి, ఆ కథ తమకెందుకు నచ్చిందో పేర్కొన్నారు. సీనియర్ ఇంటర్ చదువుతున్న ఎస్. భావన ఈ పుస్తకంలోని ‘మంచితనానికి కులమేమిటి?’ కథను విశ్లేషిస్తోంది.

***

సంచిక తెలుగు సాహితీ వేదిక ప్రచురించిన ‘కులం కథ’ పుస్తకంలో నాకు నచ్చిన కథ ”మంచితనానికి కులమేమిటి?’. ఈ కథలోని పాత్రలను కుల, మతాలను చాలా చక్కగా వర్ణించారు ఎస్.పార్వతిదేవి గారు.

  1. నిజమే, ప్రపంచంలో మంచితనానికి కులమేమిటి, అందరు సమానమే. అందరు మనుషులే, అందరిలో ఒకే నెత్తురు ప్రవహిస్తుంది.
  2. మనుషులలో కులం, మతం అనే భేధం ఒక పెద్ద వ్యాధిలా వ్యాపించింది. మనసులు వేరైనా మనుషులు ఒక్కరే.
  3. ఈ రోజుల్లో మంచికి మంచి రోజులు లేకపోయాయి. చెడుకు మంచి రోజులు వచ్చాయి.
  4. డబ్బు వచ్చిన గర్వం మత్తుతో ఆదరించిన అమ్మ కష్టాలలో తన బిడ్డ దగ్గరకు వచ్చి చేయి చాచి నోరారా సహాయం అడిగితే కుదరదు, లేదు అంటూ పొమన్న వాడు ఒక మూర్ఖుడు.
  5. ఆదరించిన చెయ్యి అడ్డం అయ్యింది. అవసరం తీర్చిన చెయ్యి ఇష్టమైంది. కాని అదే అవసరానికి చాచిన చెయ్యి కష్టంగా మారింది.
  6. కొడుకు గొప్పవాడైయ్యాడు అన్నప్పుడు ఆ పిచ్చి తల్లి పడే వెర్రి సంతోషం అవధులు లేనిది. అలాంటి సమయంలో తనను (తల్లిని) మర్చిపోయేల ప్రవర్తించినప్పుడు, ఆ తల్లి పడే మానసిక క్షోభ మాటలతో, రాతలతో చెప్పలేనటువంటిది.
  7. కొంత మంది మనషులు పిడికిడు మెతుకులు పెట్టిన కృతజ్ఞతతో, ఆ తల్లికి అండగా నిలుస్తారు. అలాంటి వారి ఎదుగుదల ఎప్పుడు పై స్థాయిలోనే ఉంటుంది.
  8. చేసిన పుణ్యము, పెట్టిన చెయ్యి, ఆశ్రయం మిచ్చిన మనిషి ఎప్పుడు గొప్పవాడే. తను కులం తక్కువ వాడైనా గొప్పవాడే.
  9. నవమాసాలు మోసి, కని, పెంచి పెద్ద చేసి చివరికి అవసరానికి ఆట బొమ్మలా తయార్యయేది ఒక అమ్మ మాత్రమే. అలాంటి అమ్మని చీదరించి, బాధపెట్టే మనుషులున్న రోజులు ఇవి.
  10. మనిషికి కులం, మతం మరియు ఎక్కువ, తక్కువ అనే భేదం కాదు కావాల్సింది. ఒక మనిషి తోడు, మంచి మనసు కావాలి. మనుషుల మధ్య ఉండాల్సింది bonding కాని variation కాదు.
  11. రంగు, రూపము కులం, మతం అవి అన్ని మనం బ్రతుకున్నంత కాలమే. చివరికి అందరం కలవాల్సింది మట్టిలోనే. ఈ భూమికి అందరు సమానులే.
  12. కులాలలో SC, ST, BC, OC అనే వివిధ రకాలుగా విభజించుకున్నది మనుషులు మాత్రమే. ఒకొక్క కులానికి ఒకొక్క దేవుడిని ఏర్పరుచుకున్నారు. కాని దేవుడి దృష్టిలో అందరు ఒక్కటే.
  13. ఈ కులాల వల్ల ఎన్ని ప్రేమలు, మనుషుల ప్రాణాలు మట్టిలో కొట్టుకు పోయాయి. కష్టాలలో వున్నప్పుడు ఆదుకుని గుప్పెడు మెతుకులు పెట్టేవాడు దేవుడితో సమానం, వారిని ఎన్నటికి మరవకూడదు. వీలైతే తిరిగి సమాయం చేయలే కాని ద్రోహం చేయకూడదు.
  14. బెల్లం వుంటే ఈగలు వాలుతాయి అనే సామెత ప్రకారం డబ్బు వుంటేనే మనుషులు వస్తారు.
  15. ఆలస్యం చేస్తే అమృతం కూడ విషంగా మారుతుంది. ఇంటి దొంగని ఈశ్వరుడు కూడ పట్టలేడు అన్నది ఎంత వాస్తవమో, కడుపున పుట్టిన బిడ్డని నమ్మలేకపోవడము అంతే వాస్తవము.
  16. తన చేతితో తనకంటినే పొడిపించుకునేటటువంటి సున్నితమైనది తల్లి మనసు(ప్రేమ) అటువంటి తల్లిని కాదనుకోవడం మహాపాపము.
  17. దెబ్బ తగిలితే కొన్ని రోజులకు మానిపోతుంది కాని, మాట మాత్రం మనసులో మచ్చలా ఏర్పడి చితి వరకు గర్తుచేస్తుంటుంది.
  18. నోరారా అమ్మా అన్నప్పుడు ఆ తల్లి పడే సంతోషం అలాగే నువ్వు ఎవరు అన్నప్పుడు ఆ తల్లి ప్రాణం పోయినటువంటి పరిస్థితిని ఏర్పరుస్తుంది.
  19. ఈ కథలోని రాజగోపాలంగారు మరియు రాజమ్మగారు శివపార్వతులు వంటి వారు. ఎంత మందికి ఆకలి తీర్చి కొడుకు ఆ తల్లి వంటరి పక్షిలా మారినప్పుడు వారి యొక్క పుణ్య ఫలితాలు ఆమెకు ఎంత భరోసాని ఇచ్చాయి.
  20. మనిషిని, మనిషిలా గుర్తిస్తే చాలు, అదే గొప్పవాడి లక్షణం. కాబట్టి ఈ కథ ద్వారా నాకు తెలిసిన నీతి ఒక్కటే కులం మతం కాదు కావలసినది, మంచి మనసుతో చేసే గొప్ప సహాయం.

ఎస్. భావన

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here