Site icon Sanchika

‘కులం కథ’ పుస్తకం – ‘మంచితనానికి కులమేమిటి?’ – కథా విశ్లేషణ-4

[dropcap]కా[/dropcap]వలిలోని శ్రీ చైతన్య జూనియర్ కళాశాల విద్యార్థులు ‘కులం కథ’ పుస్తకం చదివి తమకి నచ్చిన కథను విశ్లేషించి, ఆ కథ తమకెందుకు నచ్చిందో పేర్కొన్నారు. సీనియర్ ఇంటర్ చదువుతున్న డి. నాగమల్లేశ్వరి ఈ పుస్తకంలోని ‘మంచితనానికి కులమేమిటి?’ కథను విశ్లేషిస్తోంది.

***

సంచిక తెలుగు సాహితీ వేదిక ప్రచురించిన ‘కులం కథ’ పుస్తకంలో నాకు బాగా నచ్చిన కథ ”మంచితనానికి కులమేమిటి?’. ఈ కథ రాసిన రచయిత్రి ఎస్.పార్వతిదేవి గారు.

నా అభిప్రాయం:

ఈ కథలో రాజగోపాలం దంపతులు చేసిన మంచి పనులే రాజమ్మని కష్ట సమయంలో ఆదుకున్నాయి. ఈ కథలో శేఖర్ చాలా అవకాశవాది. తన స్వార్థం తను చూసుకున్నాడు. చేసిన మేలు మర్చిపోవడమే కాక తన వృత్తి కలిగిన గర్వాన్ని అతను చూపించాడు. మనం ఎక్కువగా ఎవర్నీ నమ్మకూడదు. ఎందుకంటే వాళ్ళు మనకు నమ్మక ద్రోహం చేస్తే అది తట్టుకోవడం చాలా కష్టం. అందరికీ అంత ధైర్యం సరిపోదు అని నాకు ఈ కథ ద్వారా అర్థమైంది.

మనుషులు చేసే వృత్తులును బట్టే ఒక్కోక్క కులం అనేది ఏర్పడింది. అది మనం తెలుసుకోకుండా సమాజంలో మనమే పెద్ద స్థాయివాళ్ళం అని చాలా గర్వంగా ఉంటాము. ఈ కథ ద్వారా నాకు అర్థమైంది ఏమిటంటే మనం చేసిన మేలును మర్చిపోకూడదు. సహాయం చేయడానికి మంచి మనస్సు ఉంటే చాలు గొప్ప కులం అవసరం లేదు. మదర్ తెరిసా గారు చెప్పారు – ‘ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న’ అని. అవి అక్షర సత్యాలుగా ఈ కథలో కనిపిస్తున్నాయి. ఈ కథ రాసిన రచయిత్రి గారికి నా ధన్యవాదములు. మన సమాజానికి కావాల్సిన పాఠం ఇదే.

డి. నాగమల్లేశ్వరి

Exit mobile version