‘కులం కథ’ పుస్తకం – ‘నేరేడుపండ్ల కంటు’ – కథా విశ్లేషణ

0
1

[dropcap]కా[/dropcap]వలిలోని శ్రీ చైతన్య జూనియర్ కళాశాల విద్యార్థులు ‘కులం కథ’ పుస్తకం చదివి తమకి నచ్చిన కథను విశ్లేషించి, ఆ కథ తమకెందుకు నచ్చిందో పేర్కొన్నారు. సీనియర్ ఇంటర్ ఎంపిసి చదువుతున్న జె. శివప్రియ ఈ పుస్తకంలోని ‘నేరేడు పండ్ల కంటురి’ కథను విశ్లేషిస్తోంది.

***

శ్రీనివాసులు గారు వ్రాసిన ‘నేరేడు పండ్ల కంటు’ అనేడి ఈ కథ నా మనసుకు ఎంతో నచ్చింది. ఇందులో కులభేదాలను ఎలా తగ్గించాలో, మనం పక్క వారితో ఎలా మెలగాలో క్లుప్తంగా చూపించారు.

కులాలు, మతాలు, అనేవి మనకు మనముగా నిర్మించుకున్నవి. మాల, మాదిగ అంటూ బడుగు జీవితాలు అంటూ ఎవ్వరిని కించపచకూడదు.

ఇప్పుడు మనం తినే అన్నం, బ్రహ్మణులు, పెద్ద కులం వారు మాత్రమే పండించరు కదా! తక్కువ కులం వారు పండించారని మనం అన్నం తినకుండా వున్నమా.

మనుషులందరూ సమానులే. ఈ కుల భేదాల వల్ల మనకు ఆదాయం ఉండదు. మనం చనిపోయినా, తక్కువ కులం వారు చనిపోయినా, లేక బ్రాహ్మణులు లేదా పెద్ద కులం వారు చనిపోయినా కలిసేది మట్టిలోనే.

ఇందులో బ్రాహ్మణి పాత్ర నన్ను ఎంతో ఆకర్షించింది. ఆమెలా మనం కూడా ఆలోచిస్తే ఈ సమస్యకు పరిష్కారం కచ్చితంగా దొరుకుతుంది.

అందరూ సమానులే, కులభేదాలు లేకుండా బ్రతకాలి అనెడి ఈ కథ ఎంతో ఉత్తమమైనది.

జె. శివప్రియ

సీనియర్ ఎంపిసి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here