[dropcap]కా[/dropcap]వలిలోని శ్రీ చైతన్య జూనియర్ కళాశాల విద్యార్థులు ‘కులం కథ’ పుస్తకం చదివి తమకి నచ్చిన కథను విశ్లేషించి, ఆ కథ తమకెందుకు నచ్చించో పేర్కొన్నారు. సీనియర్ ఇంటర్ ఎంపిసి చదువుతున్న యం. వినూత్న ఈ పుస్తకంలోని ‘పాలేరు తమ్ముడు’ కథను విశ్లేషిస్తోంది.
***
నేను వ్రాసేది కథ ‘కులం కథ’ పుస్తకంలోని పాలేరు తమ్ముడు అనే కథ గురించి. ఈ కథ మానేపల్లి తాతాచార్య రచించారు. ఈ కథలో పాలేరు, బుల్లయ్య, వెంకడు, తల్లి ముఖ్యపాత్రలు. ఈ కథ నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే ఈ కథ నాకు చాలా విషయాలను తెలియజేసింది. ఏమిటంటే ఈ కథలో కన్న బిడ్డ కన్నతల్లిని మార్చడం జరిగింది. ఆమె ఒక తల్లి అయి ఉండి కూడా తన బిడ్డ వయసున్న కొడుకు లాంటి పిల్లవాడ్ని తన దగ్గర పాలేరు పనికి పెట్టుకుంది. పాలేరు కొడుకు తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్టలు చదువుకోవడానికి చదువు లేక బ్రతుకు తెరువు కోసం వాళ్ళ దగ్గర పనివాడిలా చేరాడు. కానీ ఆ తల్లి ఒక బిడ్డ తల్లి అయి ఉండి కూడా తన బిడ్డ వయస్సు ఉన్న పిల్లవాడిని పనిలో పెట్టుకోవడం తప్పు కాదా అంటే కాకుండా అతనిని కులం పేరుతో చిన్న చూపు చూసేవారు. మరీ ఆ పిల్లవాడిని తాకడానికి కూడా లేదని ఆ తల్లి తన బిడ్డకు చెప్పింది. మొదట్లో అతని కొడుకు వెంకీని చిన్న చూపు చూసిన తరువాత తనను అర్థం చేసుకొని తను కూడా మనలాంటి పిల్లవాడే కదా అనే ఉద్దేశంతో తనతో ఇంక సొంత అన్న వలె ఉండడం మొదలు పెట్టడం జరిగింది. కానీ అది వాళ్ళ అమ్మకు నచ్చలేదు. అది గమనించి తన కొడుకుని వేసుకోవడానికి బట్టలు కూడా లేని వాడితో నీకు ఆటలు ఏమిట్రా అంటూ వెంకీని తన కొడుకుకి దూరం చేసింది. కానీ తన కొడుకు నా బట్టలలో ఒక జత వెంకీకి ఇవ్వమని మారం చేసి అలిగి పనుకోవడంతో ఆ తల్లి ఒక జత బట్టలు తీసి వెంకీ మొఖాన విసిరికొట్టింది.
ఒక కొడుకు తల్లిని మార్చాడు ఈ కథలో…. ఈ వరస నాకు నచ్చింది. అందుకే ఈ కథ కూడా నాకు చాలా బాగా నచ్చింది.
ఇదే నేను చదివిన కులం కథ పుస్తకంలో నేను చదివిన పాలేరు కథ పట్ల నా అభిప్రాయం.
నీతి – ఈ కథలో నాకు కనిపించిన నీతి ఏంటంటే కులాలు, మతాలు దేనికి పనికిరావు. అలాగే పెద్దలు పిల్లలకు మంచిని నేర్పించాలే కానీ పిల్లలు చెబితే మారే అంత దాకా తెచ్చుకోకూడదు. తల్లిదండ్రులు మనకు మంచి నేర్పితే మంచిగా పెరుగుతాం, చెడు నేర్పితే చెడ్డగా పెరుగుతాం. ఏదైన తల్లిదండ్రుల పెంపకంలోనే ఉంటుదని పెద్దలు అంటుంటే విన్నాం. కానీ నాకు ఈ చదివిన తరువాత తెలిసింది.
ఆ పిల్లవాడు చెడుమార్గంలో నడవకుండా మంచి మార్గంలో నడిచి తల్లికి అందరికి బుద్ధి చెప్పాడు. ఈ కథ చదివిన తరువాత ఈ కథ ద్వారా నాకు ఈ విషయం అర్థమైంది. అందుకని నాకు ఈ కథ చాలా బాగా నచ్చింది.
యం. వినూత్న, సీనియర్ ఎంపిసి.