Site icon Sanchika

కులం

[dropcap]కా[/dropcap]సే ఎండకు లేదు కులం
వీచే గాలికి లేదు కులం
కురిసే వానకు లేదు కులం
మనుషులకే ఎందుకు ఈ కులం!!

జంతువులకు లేదు కులం
పక్షులకు లేదు కులం
ఏ ప్రాణికి లేదు కులం
మానవులకు ఎందుకు ఈ కులం!!

ఉయ్యాలకు తెలియదు కులం
మోసే పాడేకు లేదు కులం
చేరే మట్టికి లేదు కులం
మనిషికి ఎందుకు కులం!!

అగ్రవర్ణం మా కులం
మధ్యతరగతి మా కులం
అధమ వర్గము మా కులం
సమానత్వం లు లేని కులం!!

తినే కాడ లేని కులం
త్రాగే కాడ లేని కులం
తిరిగే కాడ లేని కులం
వివాహానికి కావాలి కులం!!

ఓట్ల కోసం కులం
పదవుల కోసం కులం
ఘర్షణల కోసం కులం
అభివృద్ధిలో లేదు కులం!!

ఇతర దేశాలలో కొన్ని తెగలు
మన కేమోఎన్నో కులాలు
రాజ్యాంగాన్ని మార్చే కులాలు
భావితరాలను చీల్చే కులాలు!!

ఇకనైనా మరవండి కులాల్ని
చెయ్యండి అభివృద్ధి అందరిని
కులాలు లేని దేశాన్ని నిర్మించండి
భారతీయులంతా ఒక్కటే అని చెప్పండి

Exit mobile version