కుశుని సూర్యవంశం

0
4

[box type=’note’ fontsize=’16’] బాలల కోసం సరళమైన రీతిలో కుశుని సూర్యవంశం గురించి వివరిస్తున్నారు బెల్లంకొండ నాగేశ్వరరావు. [/box]

[dropcap]సూ[/dropcap]ర్యుడు, వైవస్వతుడు, మనువు, ఇక్ష్వాకుడు, కుక్షి, వికుక్షి, పురంజయుడు, యోవనాశ్వుడు, మాంధాత, పురుకుత్సుడు, త్రనదస్యుడు, అరణ్యుడు, త్రిశంకుడు, హరిశ్చంద్రుడు, బాహుకుడు, అసమంజసుడు, అంశుమంతుడు, దిలీపుడు, భాగీరధుడు, నాభాగుడు, అంబరీషుడు, సింధుద్వీపుడు, నయుతాయువు, ఋతుపర్ణుడు, సర్వకాముడు, సుదాముడు, కల్మషపాదుడు, అశ్మకుడు, మూలకుడు, ఖట్వాంగదిలీపుడు, రఘునృపాలుడు, అజమహారాజు, దశరధమహారాజు, శ్రీరాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, ఇలాసాగిన సూర్యవంశంలో……. శ్రీరాముని సంతతి కుశ-లవుడు.

తన ఆదేశం మేరకు లక్ష్మణుడు అవతార పరిసమాప్తి అయోధ్యా నగరంలోని సరయూనదిలో కావించడంతో, లవునికి ‘శ్రవస్తి’, కుశునకు ‘కుశపురం’ లక్ష్మణ సంతతి అంగదునికి ‘అంగదీయరాజ్యం’ చంద్రకేతునకు ‘చంద్రకేతు రాజ్యం’, భరతుని సంతతి తక్షకునకు ‘తక్షశిల’, పుష్కళునకు ‘పుష్కలావతి’ రాజ్యాలు, శత్రుఘ్నడి సంతతి సుబాహుకు ‘మధుర’, శత్రుఘతికి ‘విదీష’ రాజ్యాలను నిర్మించి అప్పగించిన శ్రీరాముడు భరత, శత్రుఘ్నల సమేతంగా అగ్నిని చేతపట్టి, అయోధ్య వదలి ఉత్తరదిశగా ప్రవహిస్తున్న ‘సరయు’ (సర్జునాటి నది పేరు) నదిలో అవతారసమాప్తి కావించారు.

దశరధుని మనుమ సంతతి చక్కగా రాజ్యపాలన చేయసాగారు. ఒకరోజు అయోధ్య నగర దేవత కుశునకు కలలో కనిపించి, ‘నీ పూర్వికులు పాలించిన అయోధ్యను జనరంజకంగా పాలన చేయి’ అని కోరడంతో, కుశావతి పట్టణాన్ని బ్రాహ్మణులకు ధారబోసి, అయోధ్యను పాలించసాగాడు. ఒకరోజు కుశుడు పరివార సమేతంగావచ్చి, సరయూనదిలో జలక్రీడలు ఆడుతుండగా కుశుని చేతినుండి ‘చైత్రాభరణం’ జారి నీటిలో పడిపోయింది. అది అగస్త్యమహర్షి నుండి తన తండ్రి స్వికరించి తనకు ఇచ్చిన దివ్య ఆభరణం.  దాని కొరకు ఎంత వెదికించినా ప్రయోజనం లేకపోవడంతో కోపగించిన కుశుడు తన ధనస్సులో గరుడాస్త్రాన్ని సంధించి నదికి ఎక్కుపెట్టాడు.

‘రక్షించండి మహావీరా. ఇదిగో మీ ఆభరణం, నేను కుముదుడు అనే నాగరాజును. పాతాశలోక నివాసిని, ఈమె నా చెల్లెలు ‘కుముద్వవతి’. తమరు ఈమెను వివాహం చేసుకోవాలని నా మనవి’ అని చేతులు జోడించాడు. వారి వివాహనంతరం కొంతకాలానికి వారికి ‘అతిథి’ అనే కుమారుడు జన్మించాడు. అన్ని విద్యలు నేర్చిన అతిథికి నిషద రాజకుమార్తెతో వివాహం జరిపించారు. వీరికి’నిషాదుడు’ జన్మించాడు.

‘దుర్జయుడు’ అనే రాక్షసుడు ఇంద్రునితో యుధ్ధనికి రాగా ఇంద్రుడు కుశుని సహాయం కోరాడు. తమ వంశ ఆచార ప్రకారం శరణాగతులను రక్షించడం ఆచారం కనుక కుశుడు దుర్జయునితో పోరాడుతూ అతన్ని సంహారించి  తనూ ప్రాణాలు కోల్పోయాడు. అతని భార్య కుముద్వతి నాటి ఆచార ప్రకారం సతీసహగమనం చేసింది. నిషాదునికి ‘నలినాక్షుడు’, అతనికి ‘నభుడు’ అతనికి ‘పుండరీకుడు’, అతనికి ‘క్షామధన్వుడు’ అతనికి ‘దేహనీకుడు’, అతనికి ‘అహీనగుడు’, అతనికి ‘పారియాత్రుడు’, అతనికి ‘శీలుడు’, అతనికి ‘ఉన్నభుడు’, అతనికి ‘వజ్రనాభుడు’,  అతనికి ‘శంఖణుడు’, అతనికి ‘వ్యుషితాశ్వుడు’, అతనికి ‘విశ్వసహుడు’, అతనికి ‘హిరణ్యనాభుడు’, అతనికి ‘కౌసల్యుడు’,  అతనికి బ్రహ్మిష్ఠుడు, ‘అతనికి ‘పుత్రుడు’, అతనికి ‘పుష్యుడు’,  అతనికి ‘ధ్రువసంధి’, అతనికి ‘సుదర్మనుడు’, అతనికి ‘అగ్నివర్ణుడు.

వ్యాధిగ్రస్తుడు అయిన అగ్నివర్ణుడు మరణించేనాటికి అతని భార్య గర్భవతి, ఆమె రాజ్యపాలన స్వీకరించింది. మంత్రులు, రాజోద్యోగుల అండదండలతో రాజ్యపాలన కొనసాగించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here