కిర్గిజిస్తాన్ పర్యటన

1
1

[box type=’note’ fontsize=’16’] అలనాటి సోవియట్ రిపబ్లిక్‌లో భాగమైన కిర్గిజిస్థాన్‌‌లో తమ పర్యటన అనుభవాలు, అనుభూతులు వివరిస్తున్నారు నర్మద రెడ్డి. [/box]

ఈ దేశాన్ని సూర్యుడి పాదాల దగ్గర నగరు (The land of the foot of the sun) అంటారు. ఇంది రెండు సముద్రాలు గట్టిగా గడ్డకట్టి అవి రాళ్ళలాగా మారి అది స్వర్గానికి భూమికి మధ్యలో వున్న స్వర్గము అని అంటారు. ఈ పర్వతాల పేరే Tieu-Shan & Pamir (పామిర్) పర్వతాల పంక్తి. ఉత్తర ఈశాన్య ప్రాంతంలో Osh valley వుంది. దేవుడు పై నుండి క్రిందికి దిగివస్తాడని, అలాగే సూర్యుడు ఇక్కడ దిగుతాడని అనుకుంటారు ఇక్కడి ప్రజలు. సూర్యుడు జపాన్‍లో ఉదయిస్తే, కిర్గిజిస్తాన్‌లో అస్తమించుతాడని వీరి ఊహ.

     

కిర్గిజిస్తాన్‌లో మేము దిగగానే పండ్ల కూరగాయల మార్కెట్‌కి వెళ్ళాము. అక్కడ ఎంతో మంది మన కారంపొడులు చాలా రకాలుగా పెట్టారు. అవన్నీ చూచి ఒక Memorial దగ్గరికి వెళ్ళాము. ఇక్కడ Memorial ఒక పెద్ద స్తంభాన్ని 3 సైనికులు తోస్తున్నట్లుగా వుంది. నేను మావారు ఇద్దరం కూడ దానిని తోస్తున్నట్లుగా పోజు పెట్టి ఫొటో తీసుకున్నాము.

అక్కడి నుండి మేము సెంట్రల్‌లో వున్న రాజు విగ్రహం దగ్గర ఫొటో దిగి ఒక మసీదుకి వెళ్ళాము. ఆ మసీదు దగ్గర అన్ని రకాల చేతితో తయారు చేసిన లేసులు, బొమ్మలు, gloves అముమతున్నారు. అవన్నీ చూస్తూ ఒక బొమ్మని కొన్నాము. అందులో ఒక 50 ఏళ్ళ యువతి మీరు చాలా అందంగా వున్నారు. ఇండియా నుండి వచ్చారా? అని అడిగారు. ఎలా కనుక్కున్నారు? అని అడిగితే మీ బొట్టు అని అన్నారు.

     

అక్కడి నుండి మేము ఈ Alai పర్వత పంక్తిని చూడడానికి వెళ్తామని అడిగాను. అది లిస్టులో ఇప్పుడు లేదు, మీరు వెళ్ళాలంటే ఒక్కొక్కరు 3000 రూపాయలు కడితే తీసుకొని వెళ్తా అన్నాడు మా టూర్ గైడ్. మిగతావారు మాతో వచ్చిన ప్రయాణికులను అడిగితే వద్దు అన్నారు.

అక్కడి నుండి Memorial building, ఇంకా స్థూపము వున్న స్థలానికి వెళ్ళాము. అక్కడ స్థూపం దగ్గర ఒక చిన్న మండపంలో 360 రోజులు వెలిగే అగ్ని వెలుగుతూ వుంది. ఆ అగ్ని చుట్టూ ఒకాయన కిర్గిజ్‌లో పాటలు పాడుతూ, ఈ అగ్ని చుట్టూ తిరుగుతూ డాన్స్ చేస్తున్నాడు. నేను మావారు వెళ్ళి అక్కడ ఒక ఫొటో దిగి ఇద్దరం కాసేపు dance steps వేసి వెనక్కి వచ్చాము. అక్కడ రోడ్డుమీద నడుస్తూ వెళ్తున్నాము. ఒక చోట ముగ్గురు అమ్మాయిలు ఒక ఖాళీ స్థలంలో ఒక నాలా ప్రక్కన కూర్చుని guitar అమ్మాయి వాయిస్తూ వుంటే 2వ అమ్మాయి సిగరేట్ కాలుస్తూ ఆనందంగా వింటుంటుంది. నేను వారి దగ్గరకి వెళ్ళి పరిచయం చేసుకున్నాను. మీరు చాలా బాగా వాయిస్తున్నారు అని అన్నారు. ముగ్గురూ మెడిసిన్ చదువుతున్నారట. ఎంత అందంగా వున్నారో? చిదిమితే పాలుగారే బుగ్గలతో ఎర్రటి పెదాలు తెల్లగా పొడవుగా నాజూకుగా వున్నారు.

 

వారు ఒకప్పుడు Russian కదా ఇప్పుడు విడిపొయ్యారు. వారిలో కూర్చుని పాటలు విని ఒక ఫొటో తీసుకొని బయలుదేరాము. రూముకి రెండు ఉల్లిగడ్డలు, 6 లెగ్ చికెన్ ముక్కలు వేయించినవి తీసుకొన్నాము. ఆలూ, టమాట కొని నెయ్యిలో వాటిని వేయించి vegetable బిర్యానీ చేసి మాలో వచ్చిన తోటి ప్రయాణికులు ఇద్దరు ఆడవారు కెనడా నుండి ఒకరు, అమెరికా నుండి వచ్చినవారిని మా రూముకి భోజనానికి రమ్మని పిలిచాము.

వారికి మావారు బీరు ఇస్తే నేను వంట వండి వారికి పప్పు, పచ్చడి, చికెన్, కారంపొడి, పెరుగుతో వారికి భోజనం వడ్డించాను. తృప్తిగా తిని చాలా సంతోషంగా మా ఆతిథ్యాన్ని స్వీకరించారు. తిన్న వెంటనే కెనెడా అమ్మాయి walk కి వెళ్తున్నా అంది. సరే అని అందరం కల్సి garden కి వెళ్ళాము. ఇక్కడ ఒక్కరికి ఇంగ్లీషు రాదు. అన్నీ రష్యన్ భాషలో రాసి వున్నాయి. ఇక్క గమనించింది ఏమిటంటే అందరూ పిల్లలు పెద్దలూ ఒక్కొక్కచోట నలుగు, ఐదుగురు కలిసి ఆ గార్డెన్లో కూర్చుంటున్నారు. కాని వారు కూర్చుండే విధానము ఎలావుంది అంటే మనం చలి కాచుకుంటే ముని కాళ్ళమీద కూర్చుంటాము కదా, అలా అందరూ క్రింది కూర్చొనకుండా మునికాళ్ళమీద కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నారు. ఎన్ని గంటలైనా అలాగే కూర్చుని మాట్లాడుకుంటున్నారు. ఆశ్చర్యంగా అన్పించింది. మేము అలా 20 కి.మీ. నడిచాము ఆ రోజు.

మాలో వున్న ఆవిడ మారథాన్ వాకర్. అలా అక్కడ వున్నన్ని రోజులు చాలా నడిపించింది అమ్మాయి. సాయంత్రం మళ్ళీ నేను మా వారు ఒక restaurant కి వెళ్ళి “tacos” అంటే చపాతి మద్యలో కూర పెట్టి ఇస్తారన్నమాట, తిన్నాము. బాగుంది. అది తిని గదికి వచ్చి పడుకున్నాము.

     

Osh valley ఎంత అందమైన స్థలం అంటే అంత అందంగా వుంది. Fagune valley కి మమ్మల్ని ఉదయాన్నే తీసుకొని వెళ్ళారు. అక్కడ ఆ valley లో చాలా చలిగా వుంది. మేము ఆ రోజు trekking చేశాము. ఈ ట్రెకింగ్‍లో అతి ఎత్తైన కొండల అందాన్ని మొత్తం ఇక్కడే కుప్పగా పోశారా అని అన్పించేంత అందంగా వున్నాయి. ఈ పర్వత శ్రేణులు కొన్ని రంపపు అంచులా ఎవరో చెక్కినట్లుగా కొన్ని జంతు, మానవ ఆకారాలతో కొన్ని ఎంతో అద్భుతంగా ఉన్నాయి.  తలంతా పైకి ఎత్తినా కనుచూపు మేరలో కన్పించనంత ఎత్తైన కొండలు. “యురేకా” అని గట్టిగా అరిచాను. ఏమైంది? నీకు అని మాశ్రీవారు అడిగారు. ఆ ఆనందాన్ని పట్టలేక పోయాను. వీరు ఇక్కడ దీనిని “emerald of the mountains” అని అంటారు. ఒక వైపు Pamir ఎత్తైన కొండలు Alai range. ఇది Pamir కొండలకి మొదట ప్రారంభమయ్యే భాగం. ఇది చాన్ అలాయ్ జలైస్కి Chou-Alai (Zalaiski) range (7134 m). Zenin tower Kurumdy (6610 m) మరియు Dzerjinski (6173 m). ఈ Osh ప్రాంతంలో 150 నదులు ప్రవహిస్తున్నాయి.

మేము నడిచే ప్రాంతంలో “Kyzyl-Suu River” ప్రవహిస్తుంది. ఇది Amu-Daria నదిలో కలుస్తుంది. దీని చుట్టూ 100 చెరువులు, జలపాతాలు గుహలు, ఈ Alai అడవిలో వున్నాయి. 20 దాక thermal & mineral springs వేడిగా ఉప్పొగే నీటి బుడగలు! అందుకే ఈ valley ని భూమిపై సూర్యుడు అస్తమించే స్థలం అంటారు.

ఇది ఎన్నో సంవత్సరాల క్రితం Dawan, Kushan, Kharhanid అనే రాజులు పరిపాలించారు. 500, 000 సంవత్సరాల నుండి ఇక్కడ ఆదిమవాసులు నివసించారని ప్రతీతి. Sol-Unkur అనే గుహ లో Paleolithic period లో వున్నట్లుగా రికార్డు అయ్యింది. ఇది Khai-Darkan అనే గ్రామంలో వుంది.

సుల్తాన్ బాబర్. బాబరు (1483-1530 AD) తన 12వ ఏట ఈ ప్రాంతాన్ని జయించాడు. Osh 1000 family tales లో Shahirzad. మనం ఇప్పుడు చెప్పుకొనే Shahirs అక్కడే పుట్టామేమో. ఇది “Silk road” గా మార్కోపోలో తను ప్రయాణం చేసిన రోడ్డు.

ఈ Osh ప్రాంతం, ఈ సిటిని “Alexander the great” కనుకున్నాడట. ఇంకో చరిత్ర ఏంటంటే ప్రొసెట్ సాలొమన్ బైబిల్‌లో తన సైన్యంతో వెలుతూ “Khosh” అన్నాడట. కోష్ అంటే ఇంక చాలు (That’s enough) అని అన్నాడట. అందుకని ఇది Origin of Osh. Khorh అనే పదం నుండి ఈ వచ్చిందంటారు.

3000 సంవత్సరాల క్రితం అని వ్రాశారు. Osh Oasis ని కూడ కనుక్కున్నారు. అలా రచయితలు IBN Hankel, Ali Istarhi Abdul Kusyam, హువాత్సాంగ్ ఈ ప్రాంతం వెంట నడిచానని తన వ్రాతలలో రాసుకున్నారు. ఎందరో చరిత్రకారులు నడిచిన నేల ఎంతో అందంగా వుంది. ఇప్పుడు కిర్గిజిస్థాన్ రాజధాని బిష్కెక్.

ఈ బిష్కెక్ నుండి 3వ రోజు Issyk Kul lake వెళ్ళాము. ఈ Issykul lake కి “హువాత్సాంగ్” 600 వందల సంవత్సరాల క్రితం వచ్చి ఈ చెరువుని దాటాడు. ఇది ఆయన దాటినప్పుడు ఇక్కడ ఎన్నో క్రూర జంతువులు వున్నాయి. అందరూ ఇది దాటుతూ నేను బ్రతకాలి అని మ్రొక్కి ఆ చెరువుని దాటేవారట. మేము Issykul lake ప్రక్కనే room తీసుకొని 48 గంటలు వున్నాము.

అందరూ ఆ lake లో మునిగి తేలుతున్నారు. చుట్టూ గోడలాగ ప్రర్వత శ్రేణులు. ఆ lake చాలా పెద్దగా వుంది. ఇక్కడ స్థానిక దిబ్బరొట్టెలు, స్వీట్స్, మటన్, చికెన్ అన్నీ పెట్టారు. మేము చికెన్, రోటీ తిన్నాము.

మర్నాడు UNESCO Heritage Burana అనే స్థలానికి వెళ్ళాము. ఇక్కడ పెద్ద tower వుంది. ఇది Balasagun అనే నగరంలో వుంది. అక్కడ పురాతనమైన వస్తువులు రాతితో చేసినవి విసురు రాళ్ళు, గానుగలు, రోళ్ళు ఒక 20 ఎకరాల స్థలంలో అన్నీ పరిచిపెట్టి వున్నాయి. ఆ Burana Tower అతి ప్రాచీనమైన tower. ఇది 11వ శతాబ్దం నాటిది. ఇటుకతో కట్టి వుంది.

“Bal Bal with wine cup”. ఇది ఒక తను wine cup పట్టుకొని వున్నట్లుగా వున్న రాతి బొమ్మ. అప్పటి కాలంలో రాజుని చెక్కినట్లు భావన. అలా అంత తిరిగి మేము ఒక “nomadic” ఇంట్లో మద్యాహం భోజనం. అక్కడ గుడారంలో కాసేపు సేదతీరి వారి ఆతిథ్యం స్వీకరించి మళ్ళీ ఒక గ్రామానికి వెళ్ళాము. Song kul lake. ఇది వెళ్ళే ముందు మేము ఒక Seven Bulls అనే ప్రాంతం వెళ్ళాము. ఇక్కడ ఒక గ్రద్దని తీసుకొని వచ్చి అది తన ఆహారాన్ని ఎలా పై నుండి వచ్చి తన్నుకుని పోతుందో చూపించాడు. అక్కడ ఒక ఫొటో దిగాం. ఆ అబ్బాయి తాతలు ముత్తాతలు ఈ ప్రదర్శనని చూపిస్తూ వారి జీవన వృత్తిగా మలుచుకున్నారు. ఆ డేగ కూడ ఎంతో ఖరీదట… దాని తిండికి ఎంతో ఖర్చు పెడ్తారట.

ఈ ప్రదర్శన తర్వాత మేము Song kul lake గ్రామానికి వెళ్ళాము. ఇక్కడ ఒక యూర్తలో గుడారంలో వున్నాము. అక్కడ మా యిద్దరికి ఒక మంచి యూర్త ఇచ్చారు. అక్కడ రాత్రి భోజనం. 2వ రోజు మేము నడుస్తూ ఆ ప్రాంతమంతా తిరిగాము. ఒక కిర్గిజిస్థాన్ అమ్మాయి 5 సంవత్సరాలు వుంటుందేమో పిల్లలలో ఆడుకుంటూ వుంది. ఆ అమ్మాయి ఆశ్చర్యంగా కొన్ని గడ్డిపూలు కోసుకొని నా దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చింది. ఆ గడ్డిపూలు నాకు ఇచ్చి you are looking beautiful అన్నది.

అనుకోని సంఘటన నేను ఆ తెలియని ప్రపంచంలో మేము ఐదుగురము వుండగా నాకే ఆ పువ్వులు ఇస్తే ఉబ్బుతబ్బిబ్బు అయిపొయ్యాను. ఆ అమ్మాయి ఆపిల్ పండ్ల లాంటి పొట్ట బుగ్గలతో నాకు ఆ పువ్వులు ఇచ్చింది. ఇక్కడ అందరూ ఎంతో అందంగా వున్నారు. 20 కి.మీ. నడిచి ఆ ప్రాంత అందాన్ని చూస్తూ గుర్రాలు మా కారు వెంట పరుగెత్తుతూ ఉంటే చప్పట్లు చరుస్తూ ఆనందంగా వాటి జూలు గాలిలో ఎరుగుతూ ఎంతో అందంగా ఆ గిట్టల చప్పుడు ఒక వాయిద్యంలా విన్పిస్తూ వుంటే ఆ కొండల అందాన్ని ఆ పచ్చనాన్ని చూస్తూ మేము ఆ లోయలోని అందాలు చూస్తూ మా యూర్త (Tent) లోకి వచ్చాము. అక్కడ Apple పళ్ళు క్రింది వంగుకుని వున్నాయి. నా నోటితో ఆ పండుని కొరికాను. అంత దగ్గరగా వున్నాయి. అక్కడ ఫొటో తీసుకొని అన్నిదార్లలో ఉన్న Apple చెట్లు చూస్తూ ఆనందిస్తూ మా టెంట్లో పడుకున్నాము.

Kyayl-Su-నది మా వెంటనే అన్ని ప్రాంతాలలో కొండలలో, గుట్టలలో ప్రవహిస్తుంది. ఈ నది Chon Kyzyl Suu George 40 KM నుండి 60 KM వరకు ప్రవహిస్తుంది. ఈ 40 కి.మీ. 40 దీనిని “big red water” అని పిలుస్తారు. ఎందుకంటే ఈ నీరు ఎరుపురంగులో వుంటుంది. ఈ నది కిర్గిజిస్థాన్, కజకిస్థాన్ మరియు తజికిస్తాన్‌లో ప్రవహిస్తుంది. ఈ నది వెంట మా ప్రయాణం silk road లో సాగుతూ పోతూ వుంది.

కిర్గిజిస్థాన్‌లో వున్న ప్రజలు చాలా నిరాడంబరంగా అందంగా వున్నారు. ఇక్కడి అన్ని పండ్లు నాలుగింతలు పెద్దవిగా వున్నాయి. ఎంతో అందమైన దేశం. ఆ నది వెంబడి మేము తజికిస్తాన్‌‌కి ప్రయాణమయ్యాము.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here