[శ్రీ గొర్రెపాటి శ్రీను రచించిన ‘లక్ష్య సాధనలో..’ అనే కవితని పాఠకులకి అందిస్తున్నాము.]
[dropcap]అ[/dropcap]డుగులైతే ముందుకేస్తున్నాను కానీ..
మార్గం స్పష్టంగా అగుపించడంలేదు!
సాధించాల్సిన లక్ష్యం మాత్రం
కళ్ళముందు కదులుతూనే ఉంది!
నా లక్ష్యం మాత్రమే
నా ఉచ్ఛ్వాస నిశ్వాసాలుగా మారగా
బ్రతుకుపై ఆశతో సాగుతున్నాను!
లక్ష్య సాధనలో
ముళ్లున్నా, పూలున్నా,
విమర్శలున్నా, ప్రశంస లున్నా..
అన్నింటినీ సమంగా స్వీకరిస్తూ..
పట్టుదలగా జీవన పోరాటం చేస్తున్నాను!
మనస్సులో జనించిన లక్ష్యసాధనే..
నన్ను నడిపించే సన్మార్గదర్శి!