ల్యాండ్‌స్లైడ్స్

0
2

[box type=’note’ fontsize=’16’] ‘ల్యాండ్‌స్లైడ్స్’ అనే ఈ కథలో కొండ చరియలు ఎందుకు విరిగిపడతాయో, అవి కారణమయ్యే వరదలను ఎలా ఎదుర్కోవచ్చో వివరిస్తున్నారు డి. చాముండేశ్వరి. [/box]

[dropcap]చ[/dropcap]రణ్, వరుణ్ పండక్కి తాత దగ్గరకు వచ్చారు. సిటీలో చదువుకుంటున్నారు. చాలా చురుకైన పిల్లలు. 6వ తరగతి. సహజసిద్ధమైన ప్రశ్నలతో తాత, బాబాయ్, నాన్నలను ఉక్కిరిబిక్కిరి చేస్తుంటారు.

బ్రేక్‌ఫాస్ట్ తరువాత న్యూస్ పేపర్ చదవటం అయిపోయి తీరిగ్గా ఉన్న తాత దగ్గరకు చేరారు. వాళ్లకి తెలుసు న్యూస్ పేపర్ చదువుతున్నప్పుడు విసిగిస్తే కోపం వస్తుందని. అంతే కాదు, చరణ్, వరుణ్ కూడా పేపర్ చదివేలా

అలవాటు చేసారు. వాళ్ళు ఇంగ్లీష్, తెలుగు పేపర్స్‌లో మెయిన్ హెడింగ్స్, స్పోర్ట్స్, పజిల్స్ చదువుతారు.

తాత నవీన్‌కి అర్థం అయింది పిల్లలకు ఎదో పెద్ద ప్రశ్నకు సమాధానం కావాలని.

“తాతా! తాతా! ఆర్ యు ఫ్రీ?”

“ఎస్! ఏంటి విషయం? “

“తాతా మీకు గుర్తుందా? వేసవి సెలవుల్లో మనం అందరం ఊటీ, వాయనాడ్ వెళ్ళాము” అన్నాడు వరుణ్.

“అవును. అయితే?” అన్నారు తాత.

“తాతా! రీసెంట్‌గా కురిసిన హెవీ రైన్స్ కారణంగా వాళ్లకి వరదలు వచ్చాయి. వాయనాడ్‌లో వరదలు, ల్యాండ్‌స్లైడ్స్‌తో ఒక గ్రామం, టీ ఎస్టేట్ మనుషులు మట్టి కింద ఇరుక్కుని చనిపోయారు. పాపం!” అన్నాడు చరణ్.

“అవును. చాలా సాడ్ థింగ్” అన్నారు నవీన్.

“తాతా ఒక్క ఊటీ, వాయనాడే కాదు ముంబై, చెన్నై, గుజరాత్, మనాలి, రాజస్థాన్… లిస్ట్ పెద్దది. అన్ని చోట్ల వరదలు, ల్యాండ్‌స్లైడ్స్. Why nature is so furious? ప్రకృతికి ఎందుకు అంత కోపం?” అన్నాడు వరుణ్.

“తాతా ఎందుకు అలా జరిగింది? మనం ఆపలేమా?” అన్నారు పిల్లలు.

వాళ్ళ ప్రశ్నలకు తాత ఆనందపడ్డారు. Future citizens కి valid డౌట్స్ అని.

“పిల్లలూ మీ ఊటీ వాయనాడ్ ఫ్రెండ్స్ రవి, నారాయణ్‌కి ఫోన్ చేసి ఎలా ఉన్నారో కనుక్కున్నారా? ఎలా ఉన్నారో?”

“మాట్లాడాము తాతా. పాపం చాలామంది flood relief camps లో ఉన్నారట. స్కూల్స్‌కి సెలవులు ఇచ్చారట. భయంకరమైన వరదలు అన్నారు. పాపం” అన్నారు వరుణ్, చరణ్.

“తాతా వరదలు ఎందుకు వస్తాయి?”

“ఎందుకంటే అనేక కారణాలు ఉన్నాయి. ఆగకుండా గంటలు రోజుల తరబడి non-stop పెద్ద వానలు కురిస్తే, అక్కడున్న చెరువులు, నదుల్లో నీరు పొంగి పొర్లితే. నీటి ప్రవాహం వరదలు తెస్తున్నది. పిల్లలూ, కేరళ, ఊటీలో పెద్ద వానల వల్ల కొండ చరియలు విరిగి పడ్డాయి. గత రెండు సంవత్సరాల్లో కేవలం కేరళ రాష్ట్రములో పెద్ద వానలు వరదలు, కొండ అంచులు విరిగి పడటంతో 200 మందికి పైగా చనిపోయారని రిపోర్ట్” అన్నారు తాత నవీన్ విచారంగా.

“Oh! My GOD. Very Sad. గవర్నమెంట్ ఏమీ చెయ్యదా?” అన్నాడు వరుణ్.

“ఎందుకు చెయ్యదు, చేస్తుంది. కానీ అన్ని ప్రభుత్వాలే చెయ్యాలని మనం కూర్చుంటే వీలవదు. డెమోక్రసీలో ప్రజలే ప్రభువులు కదా?”

“అవును. అయితే?”

“పీపుల్స్ గవర్నమెంట్‌లో ప్రజలు ప్రభుత్వం కలిసి పనిచేయాలి. ముఖ్యంగా ప్రజలు ఎలెర్ట్‌గా, నిజాయితితో చట్టాలు అమలు జరిగేలా చెయ్యాలి. ఉదాహరణకి హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ నేరం. ఆఫెన్సు. మనకోసం పెట్టిన రూల్స్‌ని మనమే బ్రేక్ చేసి తరువాత ప్రభుత్వాన్ని తిడితే ఓకేనా? ప్రజలు ప్రభుత్వం కలసికట్టుగా పనిచేస్తేనే మంచి రిజల్ట్స్ వస్తాయి. ఎనీవే విషయానికి వద్దాము. పెద్ద వానలు, తుఫానులు వచ్చేముందు ప్రభుత్వం వారు ముందుగానే హెచ్చరికలు చేస్తారు. సహాయక పనులు చేస్తారు. మీరు టీవీలో చూసుంటారు. పోలీసులు, సైన్యం, అధికారులు, ప్రజలు హెల్ప్ చేస్తారు. ఇంక కారణానికి వస్తే పెద్ద వానలు… హెవీ డౌన్‌పోర్ ఉన్నప్పుడు హిల్ స్టేషన్స్‌లో మట్టి వదులు అయ్యి రాళ్లు, కొండ అంచులు విరిగిపడటం సహజం. హిల్ స్టేషన్స్‌లో వ్యవసాయం, టూరిజం కోసం కొండలను తవ్వటం ఒక కారణం. కొండల మీద లేక్స్ లాంటివి ఉంటే హాని ఎక్కువ. 2013 సెప్టెంబర్‌లో అనుకుంటా – కేదార్‌నాథ్ ప్రాంతంలో వానలు వరదల్లో ఒక లేక్ గట్టు తెగటం మరింత వరదకు కారణం అయ్యింది” అన్నారు తాత.

“తాతా కొండప్రాంతాల్లో కొండల అంచులు విరగడం… అదే ల్యాండ్‌స్లైడ్ అవటానికి ముందు మనకు తెలుస్తుందా?” అన్నాడు వరుణ్

“గమనిస్తే తప్పకుండా కొన్ని వార్నింగ్ సైన్స్ / ప్రమాద సూచనలు తెలుస్తాయి” అన్నారు నవీన్.

“అవేమిటి?”

కొండల్లో, లోయల్లోని సాయిల్, భూమిలో సడెన్‌గా పగుళ్లు కనిపిస్తాయి. కొన్ని సార్లు నేల నుండి నీళ్లు పారుతున్న శబ్దం… వాటర్ ఫ్లో సౌండ్స్ వినిపిస్తాయిట కేర్‌ఫుల్ గా వింటే. స్థానికులకు… లోకల్‌గా ఉండే వాళ్లకి మాత్రమే.  కొన్ని సార్లు సొరంగం అంటే టన్నెల్ లాంటి వాటిలో సడెన్‌గా వాటర్, బురద కారడం కనిపిస్తుందిట. కొన్నిసార్లు నీటితో ఉన్న బావి సడన్‌గా ఎండిపోతుంది. డ్రై అవటం. లేదా నీరు లేని బావిలోకి సడన్‌గా వాటర్ రావటం; కొన్ని సార్లు కొండ మీద నుండి వింత శబ్దాలు… సౌండ్స్… వినిపించటం లాంటివి కనిపిస్తే ప్రమాదం రావచ్చని సంకేతం. సిగ్నల్. విపరీతమైన వానలు, వరదలు కూడా ఒక కారణం.”

“తాతా కారణాలు చెప్పారు, కాని సాయిల్ ఇరోజన్… నేల కోతని ఆపే మార్గాలు లేవా?”

“ఎందుకు లేవు. ఉన్నాయి. కొన్ని చెబుతా విను. వరద వాన నీటిని ఊర్లో ఉండే చెరువుల్లోకి వెళ్లేలా చూడాలి. Unfortunately మన అవసరాల కోసం చెరువుల్ని పూడ్చేసి ఇల్లు కడుతున్నాము. పెద్ద వానలు పడితే నీరు ఎక్కడికి వెళ్లాలో తెలియక పూర్వం చెరువు ఉన్న చోట కట్టిన ఇళ్ల లోకి వచ్చేస్తుంది. వరదలా.”

“అవును తాతా, టీవీ వార్తల్లో చూపించారు” అన్నాడు చరణ్.

“Landslides జరిగే అవకాశం ఉన్నదని గుర్తించిన places లో మైనింగ్ లాంటి పనులు ఆపాలి. కొండల్లో ఉండే అడవులు కాపాడాలి. లేదంటే ప్రమాదం. కొండ అంచులని గట్టి పరచాలి. చెట్లు నాటాలి. చెట్లు,గడ్డి మట్టి వానకి కొట్టుకుపోకుండా ఆపగలవు. కొండ ప్రాంతాల్లో రోడ్స్, బిల్డింగ్స్ మధ్యలో, వ్యవసాయ భూముల్లో వాన నీరు ఈజీగా డౌన్ లోకి వెళ్లేలా దారి వదలాలి. వ్యవసాయం, టూరిజం పేరుతో అడవులు నరికి, కొండలు చదును చేసి పర్యావరణాన్ని పాడు చెయ్యకూడదు.

కెన్యాలో వరదలు, ల్యాండ్ స్లైడ్స్ నుండి పంటలు, నేలను కాపాడటానికి రైతులు slops లో వెదురు చెట్లు నాటారు. అవి 100 years బతుకుతాయిట. అవి సాయిల్‌ని సేవ్ చేస్తాయి, వాటిని రెగ్యులర్‌గా కట్ చేసి అమ్మితే వాళ్లకి అదనపు ఆదాయం…. అడిషనల్ ఇన్‌కమ్. మనం we people.. Selfishness తగ్గించుకుని పరిసరాలు, వనరులు, నేచర్‌ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. లేదంటే ప్రకృతి వైపరీత్యాలు/natural disasters ఎక్కువ అవుతాయి. Human greed, actions are causing climate change. మీ తరం పిల్లలే ప్రకృతి సమతౌల్యాన్ని… Ecological balance ని అర్థం చేసుకుని కాపాడాలి” అన్నారు తాత.

నేటి పిల్లలే రేపటి పౌరులు కదా.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here