లేనితనం..!!

5
2

[డా. కె. ఎల్. వి. ప్రసాద్ రచించిన ‘లేనితనం..!!’ అనే కవితని పాఠకులకి అందిస్తున్నాము.]

[dropcap]దీ[/dropcap]పావళి అంటేనే
గుర్తుకొచ్చేది బాల్యం!
అందరి ఇళ్లముందు
దీపాల వెలుతురు..
మా ఇంటి ముంగిట
ఎక్కడిదో..
మినుకు.. మినుకు
వెలుతురు నీడ..!
పిల్లలందరి ముఖాల్లో
వెలుతురు వెన్నెల..
నన్నుబంధించిన..
నా ముఖాన —
అమావాస్య ముసుగు!
కారణం అంతుబట్టని
లేలేత వయసు..
సర్దుకుపోయిన నాటి
పేదమనసు..!
ఇప్పుడు అన్నీ ఉన్నా
ఏదో లేనితనం..
నా బాల్యాన్ని గుర్తుచేస్తుంటే ,
ఇప్పుడూ సర్దుకుపోతున్నా
నన్ను నేనే కట్టడిచేసుకుంటూ,
బయటి వెలుతురును
ఆస్వాదిస్తూ…
జ్ఞాపకాల మూట విప్పుకుంటూ!!

***

[ఈ కవితకి డా. టి.రాధాకృష్ణమాచార్యులు గారి ఆంగ్ల అనువాదం.]

Haven’tness..!!
***
The row of lights, Diwali
Memoirs the childhood!
Before gates of all houses
The sparkling lights are
In front of my house
Where else..
Blinking.. blinking shadow light..!
In the faces of all the children
gittered twilight..
On my face
Encaptured me
The bloomy moon Cover!
Reason is endless
The tenderly tender age
The then adjusted poor Soul..!
All are there in present day
Yet Haven’tness whatsoever is..
On reminding my childhood,
Now adjusting
And me Controlling myself
The outer shades
By inhaling
Unwrapping the treasure of memoirs!!

Translation:
Dr.T.Radhakrishnamacharyulu
Source: A Telugu poem ‘Lenitanam’ by Dr.K.L.V Prasad

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here