Site icon Sanchika

లిఫ్ట్

[డా. టి. రాధాకృష్ణమాచార్యులు రచించిన ‘లిఫ్ట్’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]

[dropcap]ఎ[/dropcap]త్తుకొన్న చంకలోకి వచ్చింది ముద్దుల మనుమరాలు
ఆత్మీయ చేతులు తలపైకి పిలిచేటి
మమతానురాగ రక్త బంధాలై
కంటికి రెప్పలా కాపాడుతుంటే
ఆటైన నడక కూడా రాదు దరికి

రవాణా చేసేటి వాహనం మోముగా
గమ్యం చేర్చ ఆనందమేగా
కాళ్ళకు పనియేలనో
ఇక నడకలు ఏలనో మరి

లిఫ్ట్ ఉన్నదా బహుళ అంతస్తుల
చేరు మనిషి ఈజీగా
నడకన్న అడుగొకటి పడదుగా ముందుకు

లిఫ్ట్ చేయు శక్తులు
దాటించు రేవు మౌఖికములందు
‘రక్తం రంగు’ ఏమిటి యను
అలుకటి ప్రశ్న స్నేహించి
ఆ క్షణం దాటిన ఎగురు కాలరులన్నీ
మనిషి నైజమిదే కదా
మనసు పాడేది ఏ భావజాలమైనా

బలం బలహీనతలే మన బతుకు బాట
మనసు ఊపేను
అవసరాలూ అవకాశాల నింగి ఊయల
లిఫ్ట్ ఒక మలుపు రాయి ఇక్కడ
అది కురిసిన పూల వాన
అదో గాలి ఊదిన సన్నాయి పాట జీవితాన

Exit mobile version