[box type=’note’ fontsize=’16’] ‘లోకల్ క్లాసిక్స్’ సిరీస్‌లో భాగంగా వెట్రిమారన్ దర్శకత్వం వహించిన తమిళ సినిమా ‘విసారనై’ని విశ్లేషిస్తున్నారు సికిందర్. [/box]
‘విసారనై’ (తమిళం)
2015లో స్వయంగా నిర్మించి దర్శకత్వం వహించిన ఈ వాస్తవిక కథా చిత్రం మానవ హక్కుల దుస్థితిని దృశ్యీకరిస్తుంది. మానవ హక్కుల మీద అనేక సినిమాలు వివిధ భాషల్లో వచ్చి వుంటాయి. కానీ ఇంత పచ్చిగా రావడం ఇదే. దీనికి స్ఫూర్తి నిచ్చినవాడు ఒక ఆటోడ్రైవర్. పత్రికలు కూడా రాయని ఈ మానవ హక్కుల ఉల్లంఘనని సినిమా విడుదలాయ్యాక పట్టించుకున్నాయి. తమిళనాటే కాదు, జాతీయ మీడియాలు సైతం దీనికి బ్రహ్మరథం పడుతూ ప్రపంచ దృష్టికి తెచ్చాయి. ఇంతకీ ఏమిటీ దీని కథ? ఎందుకు ఇది గమనంలోకి తీసుకోవాల్సిన తమిళ సినిమా? ఒకసారి చూద్దాం…
కథ
గుంటూరులో పాండి, మురుగన్, అఫ్జల్, కుమార్ అనే తమిళనాడు నుంచి వలస వచ్చిన నల్గురు కూలీలు పనులు చేసుకు బతుకుతూంటారు. పార్కులో మకాం వుంటారు. ఓ రాత్రి పోలీసులు దోపిడీ కేసులో నల్గుర్నీ నిర్బంధించి కొడతారు. తాము దొంగలం కాదని ఎంత చెప్పినా పోలీసులు నమ్మరు. ఇన్‌స్పెక్టర్ విశ్వేశ్వరరావు (అజయ్ ఘోష్)కి పై అధికారుల వొత్తిడి వుంటుంది. ఓ ప్రముఖుడి ఇంట్లో కోటి రూపాయల మేరకు ఆభరణాలు, నగదు దోపిడీ అయిన కేసులో దొంగల్ని పట్టుకోలేక పోవడం ఇబ్బందిగా వుంటుంది. ఈ నల్గరు కూలీల్ని కేసులో ఇరికించి కోర్టుకి అప్పగించేసి చేతులు దులుపుకుందామనుకుంటాడు.
ఇంటరాగేషన్‌లో ఎన్నిదారుణ చిత్ర హింసలకి గురిచేసినా చెయ్యని నేరాన్నిఒప్పుకోరు నల్గురూ. ఇన్‌స్పెక్టర్ ఒక పన్నాగంతో ఒప్పుకునేలా చేసి కోర్టుకి తీసుకు పోతాడు. అక్కడ జడ్జి ముందు ఆ నల్గురూ అడ్డం తిరిగి, తమని హింసించి బలవంతంగా ఒప్పించారని చెప్పేస్తారు. వాళ్ళ తమిళం అర్థం గాక తమిళం తెలిసిన వారిని పిలవమంటాడు జడ్జి. ఆ సమయంలో చెన్నై నుంచి సీక్రెట్ ఆపరేషన్ మీద వచ్చిన ఇన్‌స్పెక్టర్ ముత్తు వేలు (సముద్రకని) కోర్టు దగ్గరే వుంటాడు. అతను వచ్చి వాళ్ళు చెప్పింది జడ్జికి ఇంగ్లీషులో చెప్తాడు. వీళ్ళు తనకి తెలిసిన వాళ్లేనని, అమాయకులనీ కూడా చెప్పేసరికి, జడ్జి వాళ్ళని విడిచిపెట్టేసి, ఎదురు మాట్లాడిన ఇన్‌స్పెక్టర్ విశ్వేశ్వర రావుని కోర్టు ముగిసేవరకూ తన పక్కన నించోవాలని శిక్ష వేస్తాడు.
కోర్టు బయట కూలీలు ఇన్‌స్పెక్టర్ ముత్తువేలుకి దండాలు పెట్టుకుంటారు. ఒక పనుంది చేస్తారాని అడుగుతాడు. చేస్తామంటారు. వాళ్ళ చేత ఒక ఛార్టెడ్ ఎక్కౌంటెంట్ కేకే (కిషోర్)ని కిడ్నాప్ చేయించి వాళ్ళతో చెన్నై బయల్దేరతాడు ముత్తువేలు.
ఛార్టెర్డ్ ఎక్కౌంటెంట్ కేకేని ఎందుకు కిడ్నాప్ చేశాడు ముత్తువేలు? చెన్నైలో జరుగుతున్న రాజకీయ కుట్రేమిటి? ఆ ప్రతిపక్ష కుట్రని చెన్నై పోలీసు ఉన్నతాధికారులు భగ్నం చేయాలని పాల్పడిన నేరాలేమిటి? ఇందులో ఛార్టెడ్ ఎక్కౌంటెంట్ కేకే పాత్రేమిటి? నల్గురు కూలీల్లో ఒకడు గుంటూరులోనే దిగిపోయాక మిగతా ముగ్గురూ ఏమయ్యారు? ముత్తువేలు ఏమయ్యాడు? చేసిన నేరాన్ని కప్పిపుచ్చడానికి పోలీసులు ఇంకెన్ని నేరాలు చేశారు- లాకప్ డెత్, ఎన్‌కౌంటర్లు సహా? …ఇదీ మిగతా కథ
ఎలావుంది కథ
‘లాకప్’ తర్వాత ‘లాకప్ 2’ రాశాడు. భూగోళాన్ని అమెరికా నరకంలా మార్చేసిందని ఓ పుస్తకం రాశాడు. సామ్రాజ్యవాదమూ – టెర్రరిజం చరిత్రల మీద ఇంకోటి రాశాడు. స్త్రీల సమస్యల మీద మరోటి రాశాడు. ఇలా ఆరు పుస్తకాలు రాశాడు. మొదటి రచన ‘లాకప్’కి ‘మానవ హక్కుల ఉత్తమ డాక్యుమెంట్’ అవార్డుని మాజీ సుప్రీం కోర్టు న్యాయమూర్తి వీఆర్ కృష్ణ అయ్యర్ చేతుల మీదుగా అందుకున్నాడు.
వెట్రిమారన్ దీన్ని తెరకెక్కించినప్పుడు గుంటూరులో జరిగిన వాస్తవ కథని చెన్నైలో కాల్పనిక కథతో జత చేశాడు. గుంటూరులో జరిగిన వాస్తవ కథని కూడా సినిమా కనుకూలంగా మార్చాడు. చంద్రకుమార్‌తో బాటు మరో ముగ్గురు ఆరునెలలు జైలు శిక్ష అనుభవించడం వాస్తవం. సినిమాకి కోర్టు రిమాండ్ అప్పుడే నల్గుర్నీ విడుదల చేసి చెన్నై ఇన్‌స్పెక్టర్‌తో ఛార్టర్డ్ ఎక్కౌంటెంట్ కిడ్నాప్ కథ సృష్టించాడు. ఇక్కడ్నించీ అంతా కల్పనే. ఈ మొత్తం కథని దేశంలో ఇంకే సినిమా చూపించనంత హింసతో పోలీసు అకృత్యాల్ని చూపించాడు. ఇందుకే ఆస్కార్ నామినేషన్‌కి నోచుకోకుండా ఎంపిక దగ్గరే ఆగిపోయింది. అయితే వాస్తవంగా జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనని ప్రజలకి తెలియని దాని మౌలిక స్థాయిలో చూపించక పోతే, ప్రత్యక్ష బాధితుడు చంద్రకుమార్‌కి అన్యాయం చేసినట్టే. ఈ కథలో జరిగినట్టు ఎవరికైనా జరగవచ్చన్న హెచ్చరిక ఇందులో ప్రధానంగా వుంది.
నటులు కాదు పాత్రలు
చెన్నై వెళ్ళే ముందు వరకూ సగభాగం సినిమా అమాయకులు నల్గురూ పోలీస్ స్టేషన్లో పదే పదే చిత్రహింసలకి గురయ్యే దృశ్యాలతో భీకరంగా వుంటుంది. ఈ పాత్రలు నటించిన దినేష్ రవి, మురుగ దాస్, రత్న సామి, ప్రధీష్ రాజ్‌లు ప్రేక్షకుల గొంతులు తడారిపోయేలా నటిస్తారు. దీనికి పరాకాష్టగా తాటిమట్ట పట్టుకుని క్రూర స్వభావమున్న ఇన్‌స్పెక్టర్ పాత్రలో అజయ్ ఘోష్ దిగుతాడు.
స్థూలంగా పోలీసు మరో ముఖం మరో సారి విప్పి చూపించే వాస్తవికం ఇది. అయితే దేశంలో ఎవరూ ప్రయత్నించని పచ్చి వాస్తవికం. దీనికి మొత్తం మూడు జాతీయ అవార్డులు లభించాయి. ఆలస్యంగా 2019 ఫిబ్రవరిలో ఇది తెలుగులో డబ్ అయింది.