Site icon Sanchika

లోకాస్సమస్తా

[dropcap]భ[/dropcap]యం భయం భయం భయం
మనిషి మనిషికో భయం భయం
మనసు మనసుకో భయం భయం
అనుక్షణం భయం భయం
ప్రతి క్షణం బ్రతుకు భయం
తల్లి కడుపును తన్నుకురావాలంటే ఆడపిల్లకు స్కానింగ్ భయం
కన్ను విప్పి లోకాన్ని చూడాలంటే పిల్లల మార్పిడి భయం
భయం భయం బ్రతుకు భయం
పిల్లల్ని బడికి పంపాలంటే కిడ్నాపుల భయం
కుర్రవాడిని కాలేజీకి పంపాలంటే రాగింగ్ భయం
టీనేజి ఆడపిల్లలకు టీజింగ్ భయం
పరీక్షకెళ్ళే విద్యార్థికి పేపర్ లీకేజీ భయం
భయం భయం బ్రతుకు భయం
ప్రయాణమే ప్రమాదమైన ఈ రోజుల్లో
బస్సులో బయలుదేరాలంటే ఉన్మాదుల భయం
రైలులో ప్రయాణమంటే పొగల సెగల భయం
విమానంలో ఎగురుదామంటే హైజాకింగ్ భయం
భయం భయం బ్రతుకు భయం
పంచన ఉన్న దేశాన్ని చూస్తే వంచన భయం
అగ్రరాజ్యం వంక చూస్తే ఉగ్రవాద భయం
ప్రశాంతంగా కునుకు తీద్దామంటే
ప్రపంచానికే యుద్ధభయం
భయం భయం బ్రతుకు భయం
మనిషి మనిషి నిర్మల హృదయంతో
ఆలింగనం చేసుకోవాలి
ప్రతి మతం జనహితం కోరుతూ
సమ్మతిని తెలపాలి!
ఈ భయాలు తొలగాలంటే –
దేశం దేశం సుహృద్భావంతో
కరచాలనం చెయ్యాలి!
అప్పుడు విశ్వశాంతితో అంతా
నభయం, నిర్భయం.
(దేహానికి గాయమైనప్పటి బాధకంటే, మనసుకి గాయమైనప్పుడు కలిగే బాధే ఎక్కువ.)

Exit mobile version