Site icon Sanchika

లోకస్థితి

మిద్దెల్ మేడలు గట్టు నాయకులహో! మేల్జేతురే? రే పవల్
సుద్దుల్ జెప్పుచు నుండు వీరలకు దాసోహమ్మనంబాడియే?
ద్దెల్ తీపియటంచు నమ్ముచు సదా క్రౌర్యంబె జూపించు నా
విద్దెల్ నేర్చుచునుంద్రు, నీజగతినిన్ వీరిట్లు బాధించుచున్

నిందాలాపములన్ మునుంగుచును పల్ నేరమ్ములన్ చేయుచున్
కుందంగా జనులన్ నిపీడనములన్ క్రుంగంగ బాధించుచున్
మంల్ మందలుగాగ క్రూరులిట సమ్మానమ్ములన్ పొందు వా
రెందే నాశము పొందగా గలరొ! యేరీ సాధువుల్ ధాత్రిలో?

లోమ్మందున రాజ్యభోగము సదా లుంఠాకుఁ జేరంగ, నా
శోమ్మెల్లెడ నీ యభాగ్యుల కహో చుట్టంబునై, వీడునే?
నామ్మే నరకమ్ముగానయి నిటన్ న్యాయమ్ము లుప్తంబు, దా
ష్టీమ్మేల ప్రజాళి యేడ్వగను నిశ్శేషమ్మె సద్వృత్తులున్?

పారావారము నీ జగత్తునను నిర్వ్యాపారులున్ మౌనులై
యారాటమ్ములు నీగి యుండుటకునే యాశ్వాసముల్ లేవొకో?
కారాగారముగా ధరిత్రి కడు దుష్కర్మంబులన్ మున్గ, ని
స్సామ్మై కనుచూపు మేర, మన నాశాభావముల్ లేవొకో?

నీరాళమ్మగు భావనమ్ముల హృదుల్ నిష్కల్మషమ్మైనచో
హేరాళమ్మగు తోషసంపదలతో హృద్యంబు లోకమ్మగున్.
ధారాళమ్మగు దానసద్గుణములన్ ధారిత్రి వర్ధిల్లుచో
తారాకౌముది యాకసమ్ముల వలెన్ ర్మంబు వెల్గొందదే?

Exit mobile version