[dropcap]మే[/dropcap]ము హైదరాబాద్ నుండి పోర్టోరికో అక్కడ నుండి కొలంబియా వెళ్ళాము.
పోర్టోరికోలో 5 గంటలకి విమానము ఎక్కితే 3 గంటలలో కొలంబియా క్యాపిటల్ సిటీ బొగొట్టా చేరాము. బొగాట్టాలో లోకల్ బస్‍లో మా హోటల్‌కి వెళ్ళాము. హోటల్‌కి చేరగానే స్నానం చేసి అన్నం వండుకొని తిని పడుకున్నాము.
లోపలికి వెళ్తున్నప్పుడు చేతి ఆకారంలో వున్న బొమ్మ వుంది. దాని ముందు ఫొటో దిగి లోపలికి వెళ్ళాము. అక్కడ ఒక గుహ, ఈ గుహలోపలికి వెళ్ళగానే ఉప్పుతో తయారు చేసిన జీసస్ క్రాస్ ఉన్నాయి. అలాగ 14 క్రాసెస్ ఉన్నాయి. అవి అన్నీ ఉప్పుతో తయారయినవి అంటే చాలా ఆశ్చర్యమేసింది. ఎన్నో వందల మంది యాత్రికులు వచ్చారు. ఇది most beaten path center ఆట. అంటే ఎన్నో వేల మంది ఈ గుహలు చూడడానికి వస్తారట.
ఇది కొలంబియాలో వారు ఏడు వింతలు అని ఆ దేశానికి పెట్టుకున్నారు. అందులో మొదటి స్థానంలో ఈ ఉప్పు గుహ వుంది. ఈ దేశం వారు ప్రపంచ వింతలలో ఏడో వింత క్రింద ఈ స్థావరానికి రావడానికి అప్లై చేసుకున్నారట.
కొలంబియా:
ఇది 1730 లో 13 కాలనీలు వుండేవి. ఇటాలియన్ సాహసవంతమైన ప్రయాణీకుడు కొలంబస్ క్రిస్టోఫర్ పేరుతో పెట్టారు. అదే కాకుండా “New World” అని “స్పిరిట్ ఆఫ్ స్పాంటియర్” అని కూడా అనేవారు.
1738 లో “ఏడ్వార్డ్ కీవ్” అనే అతను The great leman magazine ని ప్రచురించేవాడు. అతను వ్రాసిన ప్రకారం ఇక్కడ అందరూ ఊహాలోకంలో “లిల్లిపుట్స్” అంటే మరుగుజ్జులు. వారికి సంబంధించిన పేర్లు ఎక్కువగా పెట్టేవారు. “గలివర్స్ ట్రావెల్” కి సంబంధించి చాలా వరకు neo classical “నియో క్లాసికల్” స్టైల్ వుండేవారు.
కొలంబస్ వీరికి “అమెరిగో వెసపూచి” అనే పేరు పెట్టారు. కాలక్రమేణ లిల్లీపుట్స్ పేర్ల నుండి బయటికి వచ్చి కొలంబియా అని పేరు పెట్టుకొన్నారు.
కొలంబియాలో 1773 లో ‘కొలంబియా రెడ్ వివా’ అనే నౌను తయారుచేశారు. దీని పేరు కొలంబియాస్. ఇది ఆ రోజులలో చాలా ప్రసిద్ధికెక్కింది. అందుకని ఆ షిప్ పేరుమీద నుండి కొలంబియా అనే పేరు సార్థకమైంది.
ఇక్కడ చూడదగిన స్థలాలలో 1) Salt Cathedral 2) Mompox 3) Barichara 4) Cabo de la vela, La Guajira 5) Villa de Leyva 6) Coffee region 7) Cartagena
సాల్ట్ కథడ్రల్ చూచి బయటికి వచ్చి అక్కడి నుండి ఒక ఎత్తైన కొండ మీద ఒక చర్చి వుంది ఈ చర్చి చూడడానికి కేబుల్ కార్లో వెళ్ళాము. ఇక్కడ పై నుండి చూస్తే మొత్తం సిటీ కన్పిస్తుంది. ఇక్కడ ఈ పరిసరాలలో మాకు ఒక జపాన్ నుండి వచ్చిన ఇద్దరు అబ్బాయిలు పరిచయమయ్యారు. వారు మొత్తం సిటీని కాలినడకన చూస్తున్నారట. చాలా ముచ్చటేసింది వారి ప్రయాణ అనుభవాన్ని విని.
అక్కడి నుండి క్రిందికి దిగి సిటీ సెంటర్‌కి వెళ్ళాము. ఇక్కడ సిటీ సెంటర్లో ఒక పెద్ద చేతి ఆకారంలో ఒక కాలేజీలో వారి హాల్లో పెట్టారు. ఇది ఆ దేశపు ఎంబ్లమ్ అనుకుంటా.
అక్కడి నుండి కొలంబియన్ కాఫీ మొత్తం ప్రపంచంలోనే చాలా ప్రసిద్దమట. అవి రుచి చూద్దామని ఒక రెస్టారెంట్లో తాగి బయల్దేరాము. చాలా రుచిగా వుంది.
అక్కడ బరీచె అని ఒక కజ్జికాయని అమ్ముతున్నారు. ఒక దానిలోనేమో తియ్యటి పిండి పదార్థాన్ని కూరి అమ్ముతున్నారు. కొన్నిటిలో కీమాపెట్టి వేడి వేడిగా వేయించి అమ్ముతున్నారు. అది ఒకటి కొని సాస్‍తో తిన్నాము. చాలా బాగుంది. ఆ రాత్రి త్వరగా పడుకున్నాము. అలసిపోయి 14 కి.మీ. వరకు నడిచాము ఆ రోజు.
అది తాగిన తర్వాత మేము 14 కి.మీ. నడిచి గొటావిటా 3152 మీటర్ల ఎత్తులో ఈ చెరువును చూడడానికి బయల్దేరాము. 14 నుండి 20 మందికి ఒక గ్రూపుగా చేసి ఈ ట్రెక్కింగ్ పంపుతున్నారు. ఆ పార్కులో కొన్ని క్రూర జంతువులు కూడా వున్నాయట. అందుకని విడివిడిగా పంపటం లేదు. మాతోపాటు ఒక గన్‍మ్యాన్. 20 మందికి కల్పి ఆ కొండ ఎక్కాము.
ఈ కొండని ఎక్కినప్పుడు మధ్యలో ఒక చిన్న గుడిసె. ఆ గుడిసెలో ఆదిమవాసుల వారి చిత్రాలు, వారు వాడిన ఆయుధాలు ఇక్కడ మ్యూజియంలో పెట్టారు.
ఒక అర్దగంట అందరికీ అక్కడ గిరిజనుల గురించి వివరంగా చెప్పారు. అక్కడి నుండి 10 కి.మీ. నడిచి నేషనల్ పార్క్ అది మొత్తం అంతా అడవి. అడవిలో కొన్ని వృక్షాల గురించి వివరించారు. అక్కడ నుండి 20 మందిమి నడిచి కొండపైన వున్న చెరువు దగ్గరకి వెళ్ళాము. అక్కడ లావా ఉప్పొంగి ఏర్పడిన క్రేటర్ (Crater). ఇందులో పూర్వకాలంలో దేవుడిని కొలిచి వారి బంగారంతో చేసిన వస్తువులు ఆ దేవుడికి అని హుండీలో వేసినట్లుగా ఈ చెరువులో వేసేవారు.
సంవత్సరానికొకసారి రాజుగారు ఇక్కడ పండుగ జరిపేవారు. తర్వాత అక్కడ బంగారం బాగా దొరుకుతుందని అందరూ బాగా తవ్వి 700 అండుగుల లోతుకి వెళ్ళిపోయింది ఈ చెరువు. ఇందులో దొరికిన అన్ని వస్తువులు వీరికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత gold museum city center లో 4 అంతస్థుల భవనంలో వుంచారు. ఈ క్రేటర్ గుటావిటా చెరువు నీరు ఆకుపచ్చ నీలం కలిపిన రంగువున్న నీళ్ళతో చుట్టూ పచ్చటి గడ్డితో ఎంతో అందంగా వుంది. నేను మావారు అక్కడ ఫొటో దిగి క్రిందికి వచ్చేశాము.
పురావస్తు శాఖవారు ఇక్కడ వీటిని భద్రపరిచారు. ఇవన్నీ ఆనాటి హస్త కళానైపుణ్యాన్ని చాటుతున్నాయి. ఇవన్నీ తిలకించి క్రిందికి వచ్చి సిటీ స్క్వేర్‌కి వెళ్ళాము. ఇక్కడ కొలంబియాలో వెస్ట్రన్ మ్యూజిక్ వాద్యకారులు వాయిస్తున్నారు. కొందరు యాత్రికులు రోడ్లమీద ఆ సంగీతానికి అనుగుణంగా నాట్యము చేస్తూ ఆనందిస్తున్నారు.
ఈ ప్రదేశాన్ని Antioquia అనే ఊరికి వెళ్ళామ. ఇక్కడ తాళ్ళతో కట్టిన బ్రిడ్జి వుంది. క్రింద చెక్కలలో తీసివున్న బ్రిడ్జి అన్నీ బలమైన వైర్లతో కట్టిన బ్రిడ్జి. జార్జి గోల్చోనా అనే స్థలంలో వుంది. ఇది ఎంతో అందంగా వున్న చాలా పురాతనమైన బ్రిడ్జి. దాని మీద రివ్వున గాలి వీస్తూ వుంది. ఆ గాలికి ఈ బ్రిడ్జి కదులుతూ వుంది. అవన్నీ చూచి ఆనందిస్తూ రూమ్‌కి తిరిగి వచ్చాము.
ఇక్కడ ఓసియానారో అనే స్థలంలోకి వెళ్ళాము. ఇక్కడ స్కూబా డైవింగ్ చేసి అన్ని చేపల్ని చూడడానికి ఇంద్రారెడ్డిగారు వెళ్ళారు.
నేను డాల్ఫిన్స్ వున్న సముద్రతీరానికి వెళ్ళాను. అక్కడ డాల్ఫిన్స్‌తో ఒక అమ్మాయి నాకు ముద్దు పెట్టించింది. చాలా ఉద్వేగానికి లోనయ్యాను. డాల్ఫిన్ ముద్దు పెట్టినపుడు భయం కొద్దిగా. అది వెల్లకిలా పడుకొని ఒక ముద్దు, బోర్లా పడుకొని ఒక ముద్దు పెట్టింది. ఆ క్షణాన్ని నా జీవితంలో మరిచిపోలేని అనుభూతి.
అక్కడి నుండి మరో ద్వీపానికి వెళ్ళి అక్కడ ఒక పైనాపిల్ జ్యూస్ త్రాగాము. ఒక అబ్బాయి చిలీ నుండి వచ్చి ఇక్కడ ఈ జ్యూస్లు అమ్మి వచ్చిన డబ్బుతో ఆ ప్రదేశాలన్నీ చూచి వేరే దేశానికి వెళ్తాడట. 3 నెలల నుండి ఇక్కడే ఈ ఉద్యోగం చేస్తున్నాడు. ఆ అబ్బాయితో ఒక ఫైనాపిల్ జ్యూస్ చేయించుకొని త్రాగి అక్కడి నుండి వచ్చేశాము.
ఈ కార్టజీనా, కొలంబియా మెడెలిన్‍లలో ఒక ఫేమస్ స్మగ్లర్ నివసించిన, ప్రయాణించిన ప్రాంతాలను చూశాము. ఈ స్మగ్లర్ మొత్తం ప్రపంచాన్నే గడగడలాడించాడట, ముఖ్యంగా అమెరికాని. డ్రగ్స్ సప్లయి చేసి ఎంతో ధనవంతుడయ్యాడట. కాని తర్వాత అమెరికా ఇతర దేశాలతో కలిసి అతన్ని మట్టుపెట్టిందట. కార్టజీనాలో వాళ్ళు నివసించిన ప్రాంతం, అవన్నీ చూస్తే చాలా ఆశ్చర్యమనిపిస్తుంది. అతని భార్యని, తల్లిని కూడా ఎక్కడికో పంపించేశారట. ఎన్నో వేల కోట్ల సంపాదన ఉన్నా కూడా ఆ ఫ్యామిలీ మొత్తం బికారుల్లా ప్రయాణించవలసి వచ్చిందట. అందుకే అంటారు, ఏదైనా సరే నిజాయితీగా సంపాదించినప్పుడు దానికి పర్యవసానం స్వర్గంలా ఉంటుంది. అదే డొంక తిరుగుడు పద్ధతుల్లో సంపాదిస్తే వాళ్ళ జీవితాలలో ఇక్కడే నరకం అనుభవిస్తారనే సామెత వుంది.
ఇవీ మా కొలంబియా పర్యటన అనుభవాలు!