‘మా మంచి మాస్టారు’ పి. లక్ష్మీపతి రాజు గారు

1
2

[‘మా మంచి మాస్టారు’ వ్యాసరచన పోటీ కోసం శ్రీమతి నారుమంచి వాణీ ప్రభాకరి రచించిన ‘మా మంచి మాస్టారు’ పి. లక్ష్మీపతి రాజు గారు – అనే వ్యాసాన్ని అందిస్తున్నాము.]

“నేను ‘మా మంచి మాష్టారు’ అన్న వ్యాస రచన పోటీలో పాల్గొన్నాను. సంచిక వెబ్ మాగజైన్‌లో ప్రచురితం అయిన డా. రాయపెద్ది వివేకానంద్ వ్రాసిన ‘స్వాతి చినుకు’ కథ చదివి ప్రేరణ పొంది ఈ వ్యాసం వ్రాశాను. మీరు కూడా ఆ కథ తప్పక చదవండి. ఆ కథ లింక్‌ని ఇక్కడ ఇస్తున్నాను.  https://sanchika.com/swathi-chinuku-dr-vrp-story/

నా జీవిత కీర్తికి స్ఫూర్తిప్రదాత గౌరవనీయులు శ్రీ పి. లక్ష్మీపతి రాజు గారు.

నాకు బాల్యంలో ఇంటి వద్దే విద్య. ఎక్కువ భాగము ZP హైస్కూల్‌లో చదివాను. కో ఎడ్యుకేషన్. అయితే ట్యూషన్ మరియు క్లాస్ మాస్టారుగా పి. లక్ష్మీపతి రాజుగారు ఉండేవారు. ఆయన గాంధేయ వాది. ఖద్దరు పంచె, ఖద్దరు లాల్చీ, జరీ రెండు రంగుల అంచుల కండువా, ఉట్టిపడే దేశ భక్తి, గోల్డ్ ఫ్రేమ్ కళ్ళజోడు, చేతిలో పుస్తకాలు. ఇది అయన ఆహార్యం అని చెప్పాలి.

అయితే నేను ఎనిమిది చదువుతుండగా పెద్ద జ్వరం వచ్చి నలబై రోజులు పైగా స్కూల్‌కి వెళ్ళలేకపోయాను. సిలబస్ అయిపోయింది. మినిమం అటెండెన్స్ కోసం అడిగితే పర్వాలేదు, సరిపోతుందన్నారు. కానీ సబెక్ట్స్ అయిపోయాయే అని బాధపడితే మా ఇంట్లో వాళ్ళు ముఖ్యంగా మా పెద్దమ్మ గారు విషయం చెపితే ఆయన ఇంటికి వచ్చి ట్యూషన్ లెక్కలు ఇంగ్లీష్ చెప్పేవారు.

ఆ తరువాత కొంచెం తగ్గాక ఇంటికి వెళ్ళినప్పుడు సాయంత్రం ఏడు గంటలు దాటిపోయేది. ఆయన దగ్గర ఉండీ ఇంటికి తీసుకు వచ్చి గేట్ దగ్గర దింపి వెళ్ళేవారు. మాకు దారిలో ఒక సినిమా టాకీస్ ఉండేది. అందులో ఆ యజమాని లయన్స్ గవర్నర్ చేసేవారు. అయన అక్కడకు వెళ్లి రిపోర్ట్స్ ఇంటర్నేషనల్‌వి రాసి పంపేవారు. దాని ప్రక్కన లయన్స్ ఆడిటోరియం ఉండేది. అక్కడ వారానికి మీటింగ్స్ ఉండేవి. ఆ మరుసటి రోజు పువ్వుల గుత్తులు, దండలు, పేపర్ ప్లేట్స్, గ్లాసులు అన్నీ బయట పారేసి ఉండేవి. రాత్రి మీటింగ్ విషయాలు చప్పట్లు అన్ని కూడా మా ఇంటికి బాగా వినిపించేవి.

ఉదయాన్నే తొమ్మిది గంటలకి స్కూల్‌కి వెడుతూ ఇవన్నీ చూసేదాన్ని. అయితే నేను లోపలికి వెళ్ళడం కుదరదు కదా, చిన్న పిల్లని కూడా. అక్కడికి అందరూ బాగా డబ్బున్న వాళ్ళు డాక్టర్స్, బిజినెస్ వాళ్ళు, విభిన్న విభాగాల ధనవంతులు అక్కడికి వస్తారు. పెద్దల మీటింగ్స్ అవి, గొప్ప సంస్థలు అని మా మాస్టారు చెప్పారు.

అయితే నాకు ఆ మీటింగ్‌కి వెళ్ళాలి అనిపించేది. కానీ భయం. అంతా పెద్ద సింహాల మీటింగ్ అంటే అమ్మో అనుకునే దాన్ని. అదే మాట మాస్టారితో అంటే నవ్వి పెద్ద అయ్యాక నువ్వు అందులో చేరి సమాజ హితం కోరే పనులు చేద్దూవుగాని. ఆరోగ్య శిబిరాలు నిర్వహించి, మంచి పేరు తెచ్చుకుందువుగాని, ముందు చదువుకో అనేవారు. నాకు పాటల పోటీల్లో బెస్ట్ సింగర్‌గా స్కూల్ స్థాయిలో ప్రత్యేక విలువ వచ్చింది. డీఈఓ, ఎంపి, ఎమ్మేల్యేల నుంచి బహుమతులు వచ్చేయి. అలా కళ విలువ పెరిగింది.

అలా నా మనసులో సేవ సాహిత్యంపై అభిమానం కలిగింది  అక్కడ రకరకాల పోటీలు నిర్వహించేవారు. సంగీతం నాకు చిన్నప్పటి నుంచే ఇంట్లో వాళ్ళే నేర్పేవారు. ఆ తరువాత వీణ శ్రీ చల్ల సుబ్బారావు గారు దగ్గర, ఎగ్జామ్ కోర్స్ శ్రీమతి జయలక్ష్మి శ్యామ్ సుందర్ వద్ద నేర్చుకున్నాను.

మా గురువుకి గురువు ఆవిడ భర్త పద్మశ్రీ డాక్టర్ అయ్యగారి శ్యామ్ సుందర్, మ్యూజిక్ కాలేజ్ ప్రధాన ఆచార్యులుగా చేసి రిటైర్ అయ్యారు.

అలా సంగీతం ప్రావిణ్యం వచ్చింది. డ్రాయింగ్ క్లాస్‍కి రెగ్యులర్‌గా వెళ్లి నేర్చుకోవడం వల్ల నేను పెయింటింగ్స్ బాగా వెయ్యగలను.

టెంత్ అయ్యి, ఇంటర్ అయ్యింది. బైపిసి గ్రూప్‌లో నా డ్రాయింగ్ కళ బాగా ఇంప్రూవ్ అయ్యింది. మహిళా కార్యక్రమం రాష్ట్ర స్థాయి పోటీలు జరిగాయి. ఆ పోటీకి నేను వేసిన బొమ్మ, కుట్టినవి పట్టుకెళ్ళి ఎం.ఎస్.లు ఏలూరులో పెట్టారు. నాకు బహుమతి వచ్చింది. వాళ్ళే పట్టుకు వచ్చి ఇచ్చారు. నాకు కళ పై నమ్మకం వచ్చింది.

బిఎస్ బి జెడ్ సి లో చేరాను. నాకు మొదటి సంవత్సరం పోటీలో ఫస్ట్ వచ్చింది, నా పెయింటింగ్ ఆనంద నామ వసంతోదయం పేరుతో వేశాను.

అలా కాలేజ్‌లో వాణీ ప్రభాకరి అనగానే ఆ అమ్మాయి అయితే వంటలు, ముగ్గులు, కుట్లు, సంగీతం అన్ని కళలలో పెర్ఫెక్ట్ అనేవారు. అలా మూడేళ్ళు కాలేజీ బహుమతులు అన్ని నాకే వచ్చేవి. దానితో అక్కడ ఉన్న సంస్థలవారు నన్ను మంచి బహుముఖ ప్రజ్ఞశాలిగా గుర్తించారు. అలా నా కళలు సమాజ హితంగా మారి, కాలేజీ, మండలస్థాయి, రాష్ట్రస్థాయి, జాతీయ స్థాయి, అంతర్జాతీయ స్థాయి పోటీలకు న్యాయ నిర్ణేతగా ప్రత్యేక  విలువ పెరిగింది. RTS సంస్థ ద్వారా మూడు రోజుల శ్రీ అన్నమయ్య శ్రీ వేంకటేశ్వర స్వామి కీర్తనల న్యాయ నిర్ణేతగా 70 దేశాల నుంచి పాల్గొన్న కళకారులకి బహుమతి నిర్ణయం చేశాను.

భాగవత ప్రచార పరిషత్ వారు సింగపూర్‌లో నిర్వహించిన సప్త సంకీర్తనలు జూమ్‌లో పాల్గొన్నాను.

కాలేజ్‌లో డిగ్రీ పూర్తి కాగానే ఆ కాలేజ్ పోటీలకు నన్నే పిలిచేవారు మా మేడమ్ విజయ లక్ష్మి. ఇప్పుడు యూఎస్‌ఏలో ఉన్నారు. “నువ్వు వస్తే మాకు హ్యాపీ, మేము హాయిగా ఉంటాము. బయటి వాళ్ళు అయితే ఎవరికి మార్కులు ఎలా వేస్తారో తెలియదు” అని మా అధ్యాపకులు అనేవారు. అలాగే రాష్ట్ర స్థాయి అంతర్ కళాశాల పోటీలకు నేను ఓ వి.ఐ.పి మాదిరి అహ్వానించబడేదాన్ని. తానా ద్వారా కూడా. అది నాకు ఎంతో అపురూపంగా ఉండేది.

ఆ లయన్స్ క్లబ్ వారి లేడీస్ వచ్చి “మేము లయనెస్ మహిళ సంస్థ పెడుతున్నాం, మీరు సెక్రెటరీగా ఉండాలి. కళలు నేర్పించే విభాగము మీకు అప్పచెపుతున్నాము” అన్నారు

అలా లయన్స్ క్లబ్ ద్వారా కొన్ని వందల మందికి ఫ్రీ ఫాబ్రిక్ పెయింటింగ్‌లో ఉపాధి శిక్షణ అందించి సర్టిఫికెట్స్ ఇచ్చాను.

ఆ తరువాత స్వర్ణ లేడీ లయన్స్ క్లబ్ చార్టర్ సెక్రటరీ హ్యాట్రిక్ సెక్రటరీగా బెస్ట్ సెక్రెటరీ బెస్ట్ బేబీ క్లబ్ అవార్డ్స్ వచ్చాయి, ప్రెసిడెంట్ చేశాను.

మ్యూజిక్ థెరపీ డిస్ట్రిక్ట్ చైర్మన్‌గా కూడా సేవ చేసి అవార్డ్స్ పొందాను. ఇటువంటి ఉత్తమ స్థాయి గౌరవలకు అవకాశం రావడానికి చిన్నప్పుడు మా మాష్టారు చెప్పిన విలువైన అంశాలు. సమాజ సేవ పట్ల అవగాహన కలిగించిన అయన వల్లనే 126 బిరుదులు 11 వరల్డ్ రికార్డ్స్ పొందడానికి నేను కృషి చేయగలిగాను. అంత గొప్ప అంతర్జాతీయ సంస్థ ద్వారా విలువ రావడం అదృష్టం. అంతే కాకుండా రచయిత్రిగా ఎదగడానికి కూడా తోడ్పడింది.

నేను సంతోషిస్తున్నాను. పత్రికారంగ ప్రముఖులు, నిర్వాహకులు ఇచ్చిన ప్రోత్సాహంతో మరిన్ని విజయాలు నా సొంతం కావాలని అభిలాష.

వీటి అన్నిటికీ స్పూర్తి శ్రీ లక్ష్మీపతి రాజు గారు. ఆ విలువైన మాటలు నా జీవిత కీర్తి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here