[box type=’note’ fontsize=’16’] అలనాటి సోవియట్ రిపబ్లిక్‌లో భాగమైన తజికిస్తాన్‌లో తమ పర్యటన అనుభవాలు, అనుభూతులు వివరిస్తున్నారు నర్మద రెడ్డి. [/box]
తజికిస్తాన్ వెళ్ళాలని ఎన్నాళ్ళ నుంచో కోరిక. అయితే మేము కిర్జిజిస్తాన్, ఖజకిస్తాన్ చూచిన తర్వాత తజికిస్తాన్ వెళ్ళాలని అనుకున్నాము.
మాకు వీసా అందలేదు. అయితే అల్మాటీ నుండి 3 రోజులకి టూరిస్ట్ వీసా ఇస్తున్నారు తజికిస్తాన్ వెళ్ళడానికి. అది కూడ Kazakhstan Airlines తో వెళితేనే. మేము ఆ విధంగా ప్రయత్నం చేసి వెళ్ళాము.
అక్కడికి వెళ్ళగానే టూర్ ఆపరేటర్ ఒక కార్ పంపారు. కారులో మేము ఖుజాంద్ (Khujand) అనే స్థలానికి వెళ్ళాలి. మేము ఉదయం 10 గంటలకి దిగితే బ్రేక్‌ఫాస్ట్ లేదని ఒక షాప్‌కి వెళ్ళాము. అక్కడ కొంటూ వుంటే ఇద్దరమ్మాయిలు వచ్చారు. Dushanbe Thanza తజకిస్తాన్ ముఖ్య పట్టణం. అక్కడే ఆ ఇద్దరు అమ్మాయిలు హిందీలో మాట్లాడుతున్నారు. వెంటనే ఆ యిద్దరినీ పలకరించారు. వారు MBBS చదువుతున్నారు తజికిస్తాన్‌లో. అన్ని కుశల ప్రశ్నల తర్వాత ఆ అమ్మాయిలు వారి దగ్గర రూమ్‌కి రమ్మన్నారు. బస కూడ ఇస్తామని అన్నారు. సరే అని మేము వారితో చెప్పాము. కాని వెళ్ళలేకపొయ్యాము. వారి ఆదరణ నాకు ఎంతో సంతోష మన్పించింది. అక్కడ Sweet Bread, Egg puffs కొని దారిలో తింటూ ఖుజాంద్‌కి బయల్దేరాము.
ఈ ఖుజాంద్ వెళ్ళే దారిలో Varzob District, Rudaki disrict, Yaghnob Valley వెళ్ళాము. ఇక్కడ ఎత్తైన కొండలు, లోయలు ఉన్నాయి. వార్జోబ్ నది (Varzob River) పారుతున్నది. ఈ జిల్లా పేరు కూడ (Varzob district) అని వుంది.
ఇక్కడ నుండి ఎత్తైన కొండలు! ఎంతో ఎత్తున వున్న కొండల నుండి జాలువారుతున్న జలపాతాలు… క్రింది నది పారుతూ వున్న దృశ్యం వర్ణించనలని కాని అందాలు. “గలగల పారుతున్న గోదారిలా” అని పాడుతూ, “ఎన్నెన్నో అందాలు” అని అంత్యాక్షరి పాడుకుంటూ నేను మా వారు ప్రయాణం కొనసాగించాం. మార్గమధ్యంలో Toilet గురించి అడిగాము. ఒక చోట, మూడు ఇళ్ళు వున్న ప్రదేశంలో డ్రైవరు కారు ఆపారు. అక్కడ Toilets వున్నయని చెప్పారు. ఆ Toilets పూర్వకాలంలో ఒక రంద్రం చేసినట్లు వున్న (క్రింద పెద్దగుంక) Toilets. చెంబుతో నీళ్ళు తీసుకొని Toilets వాడుకున్నాము. వారు చాలా బీదవారు. దారి పొడుగునా ఇలాంటి Toilets వున్నాయి.
అక్కడ ముగ్గురు పిల్లలు పరిచయం అయ్యారు. 3, 5, 7 తరగతులు చదువుతున్నారు. ఎలా వెళ్తారు స్కూలుకి అని అడిగాను. రోజూ 10 కి.మీ. నడుస్తూ ప్రక్క ఊరికి వెళ్ళి చదువుకుంటారట. వారితో Indian… Hindi పాటలు వచ్చా అంటే వచ్చు అన్నారు. రెండు పాడుమన్నాను, పాడారు. వారితో అరగంట ముచ్చట్లు చెప్పితే నువ్వు హీరోయిన్‌వా అని అడిగారు. ఎందుకు? అన్నాను. అందంగా వున్నారు అని అన్నారు. 3, 5, 7 తరగతుల పిల్లలందరు చూడ చక్కగా వున్నారు.
నవ్వుతూ ఆ రోజు బడలిక అంతా తీర్చుకొని బయల్దేరాము. ఖుజాంద్ (Kuzand) వెళ్ళేసరికి రాత్రి 6 అయ్యింది. అక్కడ అలెగ్జాండర్ మ్యూజియం వెళ్ళాము. ఇది Sughd region లో వుంది. 1936 నుండి 1991 వరకు Leninabad అనేవారు. ఖుజాంద్ 2500 సంవత్సరాల నుండి చాలా ప్రసిద్ధికెక్కిన పట్టణము. సిర్ దరియా నది (Syr Darya River) eastern Fergana Valley నుండి పారుతున్నది. ఫర్‌గానా నది ఇక్కడే పుట్టి Kazakhstan, Kyrgyzstan నుండి పారుతున్నది. మేము వచ్చిన దారి పొడవునా ఈ నది అందాలు చూస్తూ ఆనందిస్తూ వచ్చాము.
అక్కడికి రాగానే అలెగ్జాండర్ మ్యూజియంకి వెళ్ళాము. అలెగ్జాండర్ Roxana అనే అమ్మాయిని రెండో పెళ్ళి చేసుకున్నాడు. రొక్సానా చాలా అందమైన అమ్మాయి. పర్షియన్ అమ్మాయి. Paraetacene లో వుండేది. ఇప్పుడు ఈ ప్రాంతం తజికిస్తాన్‍లో వుంది. ఇక్కడ పెద్ద మ్యూజియం వుంది. అలెగ్జాండర్ చనిపోయినప్పుడు ఎలా వున్నాడో ఆ ఫొటో వుంది.
ఈ దారి వెంట రాజు గారు ద గ్రేట్ అలెగ్జాండర్ ఈ తజికిస్తాన్‌కి వచ్చి ఒక చెరువుని చూశారు. దీనికి Iskander lake అని అలెగ్జాండర్ సరస్సు అని పేరు పెట్టారు. ఈ Iskander lake చూడాలంటే (Penjikent) పెంజికెంట్ నుండి ప్రొద్దున 8 గంటలకి బయల్దేరి కొండలు గుట్టలు దాటి ఎంతో ఎత్తైన లోయలోకి ప్రయాణం చేయాలి. ఎంతో అందమైన ఇస్కందర్ లేక్‌ని చూస్తే నల్లటి తెల్లటి కొండల మద్య ఒక నీలంరంగు వజ్రం లాగ మెరుస్తుంది. అది చూచి మైమరచిపోయాము. 20 ఫొటోలు దిగాను. అసలు ఆ లేక్ వదలి రావాలని అన్పించలేదు. ఆ సరస్సు దగ్గరగా ఒక జలపాతం వుంది. పూర్వకాలంలో వారి ప్రవక్త ఇక్కడ నడిచి ఈ నీటితో దాహం తీర్చకున్నాడట. ఈ నీరు తాగితే పిల్లలు లేనివారికి పిల్లలు, ఆరోగ్యం బాగాలేని వారికి ఆరోగ్యం చేకూరుతుందని వారి ప్రగాఢ నమ్మకం. ఆ నీరు స్వచ్ఛంగా స్పటికలా వున్నాయి. మేము కూడా ఆ నీరు త్రాగాము. ఇస్కందర్ కుల్ (లేక్) సముద్ర మట్టానికి 2195 మీటర్లకి పైన వుంది. ఇది కుహిస్తాన్, హిస్కార్ మరియు జరాఫ్‌షాన్ (Zarafshan) కొండల అంచులలో వుంది.
ఇక్కడ పారుతున్న ఒక నదిని చూడడానికి 5 కి.మీ. ట్రెక్కింగ్ చేశాము. ఆ పై నుండి క్రిందికి లోయలోకి తొంగి చూస్తే ఆ జలపాతములో ఉరవడిగా వర్షం నీటితో ఇంద్ర ధనస్సు ఏర్పడి ఆ అందాలు మమ్మల్ని కదలనీయకుండా చేశాయి.
Penjikent లో 5000 సంవత్సరాల నాటి తవ్వకాలలో కనుగొన్న ప్రాంతానికి వెళ్ళాము. మట్టిలో కట్టిన గోడలు వారి ఇల్లు అన్నీ చూశాము. ఇక్కడ ఒక మ్యూజియంకి వెళ్ళాము. ఇక్కడ Rudaki అనే పర్షియన్ కవి వాడిన వస్తువులు, రాసిన పుస్తకాలు వున్నాయి. 5000 సంవత్సరాల క్రితం కనిష్కుడు వాడిన కూజాలు, కుండలు వున్నాయి. ఎన్నో కార్పెట్లు అప్పుడు నేసినవి వున్నాయి.
పూర్వము సర్సమ్ (Sarasam) అనే తెగ వారు ఇక్కడ జీవించారు. 1976 లో ఈ తవ్వకాలలో బయల్పడినవి సమర్‌ఖండ్ కి దగ్గరలో 45 కి.మీ. Penjikent నుండి వెళ్తే ఈ ప్రదేశము వుంది. బ్రాంజ్ ఏజ్ కి సంబంధించిన అన్ని కుండలు దొరికాయి. అవి అన్నీ చూచి దిగి వచ్చాము.
రాత్రి ఒక హోటల్లో వున్నాము. అక్కడ ఒక 16 ఏళ్ళ అమ్మాయి పరిచయం అయింది. ఆ అమ్మాయి తాతది ఈ హోటల్. అన్నీ తనే చూసుకుంటుంది. మాకు చాలా ఆకలి వేస్తుంది. ఎక్కడ తినొచ్చు అంటే ఆ అమ్మాయి మాతో పాటే హోటల్‌కి వచ్చి మాతో పాటు 2 గంటలు వుంది. ఆ రోజు రాత్రి చికెన్, చాలా లావుగా వున్న రోటీ తిన్నాము.
ఆ అమ్మాయే మాకు ఇస్కందర్ కుల్ (లేక్) గురించి చెప్పింది, మిస్ అవ్వద్దు అని. అది వారి జాతీయ దినమట. ఎక్కడ చూచినా జండాలు, మేము కూడా జెండా ఎగురవేస్తూ అక్కడ ఫొటోలు దిగాము.
“పంజ్” నది ఇవతల తజకిస్తాన్ ఇళ్ళు, అటు ప్రక్క అఫ్ఘనిస్తాన్ ఇండ్లు కన్పిస్తున్నాయి. అఫ్ఘనిస్తాన్ వెళ్దామని అడిగాను. అక్కడ తజకిస్తాన్ వారంటే పడదట. ఎంతో మందిని చంపేశారట. మీరు వెళ్ళవద్దు అని సలహా ఇచ్చాడు. 500 అడుగుల దూరంలో వున్న ఆఫ్ఘనిస్తాన్ కి వెళ్ళలేకపోయాము
మేము దారిలో ఒక పెళ్ళి అవుతుంటే మా కారు ఆపి ఆ పెళ్ళి కూతురు దగ్గరికి వెళ్ళి ఫొటో దిగాము. ఆ అమ్మాయి చాలా సంతోషపడిపోయి నాతో వీడియో, ఫొటోలు తీసుకుంది. మేము ఆ అమ్మాయిని ఆశీర్వదించి, మళ్ళీ ప్రయాణం కొనసాగించామ. 3200 మీటర్ల ఎత్తు పైనే ప్రతి రోజు ప్రయాణం. ఆ కొండల అందాలు, లోయల సౌంద్యరం చెప్పలనవి కాదు. “ఫాన్” కొండల మద్య, “పామీర్” కొండలను చూస్తూ మైమరచిపోయాము.
అలెగ్జాండర్ ది గ్రేట్ కి కూడ ఈ ప్రదేశం చాలా ఇష్టము. పైనా తన భార్య రుక్సానా ఇక్కడే వుంది. ఆ అమ్మాయికి ఒక కొడుకు పుట్టాడట. కాని రుక్సానా ఇక్కడే జీవించింది. అలెగ్జాండర్ ఆసియా ఖండాన్ని జయించి ఈ మార్గము గుండా ప్రయాణం చేశారు.
Yagnob నది ఒక లోయలో పారుతుంది. 105 కి.మీ. దుష్కా వారి ముఖ్య పట్టణం నుండి. “రీవ్” (Rev) అనే నది మరియు “బెర్‌జంగా” (Berzenge) అనే నది ఇక్కడే పుట్టాయి. Yagnob నది Zarafshan నదిని వేరు చేస్తుంది. ఈ నది ఎత్తున పారుతుంది.
ఇక్కడ 7 చెరువులు వున్నాయి. “Seven beauties of Shing” అంటారు. ఫాన్ (Fann) అనే కొండపై నుండి మంచు నీరు కరిగి ఆ నీరు ఈ చెరువులుగా మారుతున్నాయి. ఇవి అన్ని కూడ ఎంతో అందమైన స్థలాలు. 1) Mijgon 1640 m, 2) Saya 1740 m, 3) Norfin 1820 m, 4) Hurdak 1870 m, 5) Marguzor 2140m, 6) Guslor, 7) Hazorchasma (హజోర్ చష్మా). ఈ ఏడు చెరువులు Tajikistan కి మట్టిలో మాణిక్యాలు.
దుషాన్ బే (Dushanbe) అనే పట్టణం నుండి Penjikent, హిస్సార్, జరాఫ్‌షాన్ కొండల మధ్య వున్న ప్రదేశాన్ని కూడ “Land of Lakes” (లాండ్ ఆఫ్ లేక్స్) అంటారు. ఈ పర్వత ప్రాంతంలో 30 చెరువులు వున్నాయి. 11 కొండలు ఎత్తు 5000 మీటర్లకి పైనే వున్నాయి. ఈ ఫాన్ పర్వతం తప్పకుండా చూడవలసిన ప్రదేశం (5489). చిదత్ నరా అనే కొండ ఎత్తైనది. ఈ ప్రకృతి అందాలు చూడాలంటే నిజంగా తప్పనిసరిగ Penjikent వెళ్ళాలి. అల్లావుద్దీన్ చెరువు 4237మీ ఎత్తున వుంది.
దుషాన్ బే లో Rudaki అనే కవి/రచయిత పేరు మీద మ్యూజియం చూశాము. అక్కడే Shomansher Bazar అని వస్తువులు దొరుకుతాయి.
Ismail Samoni అనే అతను వీరి National Hero. అతని పేరు మీద ఒక మెమోరియల్ కట్టారు. ఇది అద్భుతంగా వుంది. బంగారు వర్ణంలో బంగారు రవి కిరణాలతో మెరిసిపోయే ఆ మెమోరియల్ దగ్గర, దాని చుట్టూ పార్కు 2 గంటలు నడిచి అన్ని ఫొటోలు తీసుకున్నాను. అక్కడి నుండి ప్రక్కనే వున్న గార్డెన్‌కి వెళ్ళి చుట్టూ చిన్న కారులో అంత తిరిగి చూచి అక్కడ వున్న చెరువు దగ్గర కూర్చుని ఊసులాడుకొని, రాత్రి భోజనం వారి సాంప్రదాయ నాట్యము, భోజనము చేశాము.
తర్వాత రోజు మేము ఒక Aznetuppe అజినేటప్పే అనే పురాతన తవ్వకాలలో బయటపడిన 14 మీటర్ల పొడవున్న బుద్ధుని పడుకున్న విగ్రహం చూచి అతి ఆశ్చర్యానికి లోనయ్యాను. 14 మీటర్లలో వున్న విగ్రహం చుట్టూ తిరిగి ఫొటో తీసుకున్నాము. పడుకున్న బుద్ధుడి విగ్రహాలలో అతి పొడవైనది విగ్రహం ఇదేనేమో. యునెస్కో వరల్డ్ వారి సౌజన్యంతో ఇక్కడి ఈ విగ్రహానికి ప్రత్యేకమైన స్థానం వుంది. 19వ శతాబ్దంలో ఒక రాజ సౌధంలో ఈ బుద్ధుడి విగ్రహం దొరికింది. వేల మంది యాత్రికులు వచ్చి వెళ్తున్నారు.
అక్కడే పనిచేస్తున్న అమ్మాయి, నేను మీతో ఫొటో దిగుతాను, మీరు చాలా అందంగా వున్నారు అని నాతో ఫొటో దిగింది. అక్కడ వున్న అమ్మాయిలు ఎంతో అందంగా శిల్పి చెక్కిన బొమ్మల్లా వున్నారు. వారు నన్ను మెచ్చుకుంటే ఉబ్బితబ్బిబ్బు అయిపోయాను.
తర్వాత 10వ శతాబ్దపు Mir Syeed Hamadone కి వెళ్ళాము. ఇక్కడ ఒక రాజు గారి భవనము చూశాము.
అందమైన అనుభూతులతో ఈ సిల్క్ రూట్‌లో మా ప్రయాణం ఎంతో సంతోషంగా ముగిసింది.