మా జాంబియా పర్యటన

1
2

[box type=’note’ fontsize=’16’] ఇది నర్మద రెడ్డి గారి జింబాబ్వే పర్యటనకి కొనసాగింపు. జింబాబ్వే యాత్రానుభవాలను ఈ లింక్‌లో చదవవచ్చు. [/box]

[dropcap]జిం[/dropcap]బాబ్వే నుండి జాంబియా బయలుదేరాము. జాంబియా రాజధాని లుసాకా. ఇది మొట్ట మొదట 300 ఎడిలో “కొయిసాన్” అనే ట్రైబల్ వారిలో ఉన్న జాంబియా 13వ శతాబ్దిలో బంటు (Bantu) అనే జాతితో వున్నది. తర్వాత యూరోపియన్స్ ఆధీనంలో 19వ శతాబ్ది వరకు వున్నది. 1964 అక్టోబర్ 24న స్వాతంత్ర్యం వచ్చింది. ఈ జాంబియాని 1911 వరకు ఉత్తర రొడీషియా అనేవారు. 1964 నుంచి ‘జాంబెజీ’ నది కారణంగా (జాంబెజీ అంటే పొడవైన నది అని అర్థం) దీనికి జాంబియా అనే పేరు వచ్చింది.

ఇక్కడ మనిషి పుర్రె దొరికింది. ఇది 300000 మరియు 125000 బిసి నాటిదని చెప్తున్నారు. మొదటి మానవుని పుర్రె అని అంటారు. జాంబియాలో 752,614 చదరపు కిలోమీటర్ల మేర wildlife వ్యాపించివుంది. ఈ wildlife అంతా జాంబెజీ నది ప్రక్కగా ఉంటుంది. అన్ని అడవి జంతువులు వున్నాయి. ఇది చూడడానికి మనము పడవలో ప్రయాణం చేస్తే అటు నీటి జంతువులు, పక్షులు అన్నిటినీ చూడవచ్చు. మేము జింబాబ్వే లోని విక్టోరియా వాటర్ ఫాల్స్ నుంచి ఒక పడవ తీసుకొని జాంబియాకి నదిలో ప్రయాణం చేశాము. ఈ ప్రయాణం ఒక package లాగ తీసుకున్నాము. ఇది sunset చూడడానికి. ఆ పడవలో మధ్యాహ్నం 3 గంటలకి బయలదేరి రాత్రి 8 గంటల వరకు ఈ పడవ ప్రయాణం.

ఈ package వాళ్ళు మనల్ని మా హోటల్ వరకు వచ్చి వదిలి వెళ్ళారు. అక్కడి వరకు 8 మంది వరకు బస్సులో వెళ్ళాము. బస్టాప్ వరకు మా హోటల్ రూమ్ నుండి నడవడానికి ఒక పర్లాంగ్ వుంది. ఆ పర్లాంగ్ దూరం నేను నడుద్దామని బయల్దేరాను. అది అంతా నేషనల్ పార్క్. ఆ నేషనల్ పార్క్ అంతా దట్టమైన చెట్లు. ఆ చెట్ల మధ్యన రోడ్డు వేశారు. ఆ రోడ్డు మీద నడుస్తూ వెళ్తున్నాము. మా అడుగుల చప్పుడు విని ఆ నిశ్శబ్ద వాతావరణంలో ఒక్కసారిగా ముంగిసలు ఒక 100, అంత కంటే ఎక్కువ నా ముందునుండి పరుగెడుతున్నాయి. ఒక్కసారి ఉలిక్కిపడ్డాను. O my God ఎన్ని ముంగిసలు అని వెంటనే నా ఫోన్ తీసి వీడియో తీసాను. 30 ముంగిసలు చివరగా పరుగెత్తేవి మాత్రమే తీయగలిగాను.

‘అమ్మ బాబోయి ఎన్ని ముంగిసలు’ వెంటనే అక్కడ వున్న ఒక సెక్యూరిటి అమ్మాయి దగ్గరికి వెళ్ళి చేయి పట్టుకొని “నన్ను బస్ స్టాప్ వరకు దింపుతారా” అని అడిగాను. ఆ అమ్మాయి “ఇవి ఏమీ అనవు. మీరు గాబరా పడకండి” అని నాకు ధైర్యం చెప్పి బస్టాప్‌లో వదిలేసింది.

మావారు తన క్యాప్ మరిచిపోయానని మా resort room వరకు వెళ్ళారు. అందకే నేను ఒంటరి నయ్యాను. అక్కడ బస్ స్టాప్‍లో ఎక్కించి జాంబేజి నది వరకు తీసుకొని వచ్చి వదిలేశారు. మేము దిగగానే ఆ నేషనల్ పార్క్‌లో జాంబియాకి చెందిన (Tribal) ఆదిమజాతివారు మమ్మల్ని ఆహ్వానించారు.

వారు 10 మంది దాకా వున్నారు. వారి వేషధారణ పులి చర్మంతో నడుముకి కట్టుకొని కాలికి తెల్లటి గుర్రం తోకకు వున్న వెంట్రుకలను కట్టుకొని, తలకి అదే చర్మం బొచ్చుతో చిన్ని కుచ్చులాంటిది కిరీటంలా పెట్టుకొని ఉన్నారు. వారి తబలా, తప్పెట్ల తాళంతో, పాట పాడుతూ వారి నృత్యంతో మమ్మల్ని ఆహ్వానించారు.

వారితో ఒక ఫొటో దిగుదామని నేను దగ్గరికి వెళ్ళగానే నా తలపై వారి కుచ్చు టోపీ పెట్టి వారితో డ్యాన్స్ చేయమని అడిగారు. నేను వారితో చిన్నగా నడుము వూపుతూ వారి పాటకి అనుగుణంగా అడుగులు వేశాను. వారెంతో సంతోషంతో రెట్టింపు ఉత్సాహంతో ఆ నాలుగు నిమిషాలు నృత్యం చేసారు. నేను మావారు పడవలోకి ఎక్కాము.

దక్షిణ అమెరికా నుండి వచ్చిన ఒక యాత్రికుడు మా దగ్గరికి వచ్చి “మీరు చాలా బాగా డ్యాన్స్ చేసారు” అని మెచ్చుకున్నారు. అమెరికా నుండి ఇద్దరు, జపాన్ నుండి ఇద్దరు అలా చాలా మంది వివిధ దేశాల నుండి వచ్చినవారు ఈ పడవలో వున్నారు.

మా పడవలో జాంబెజీ నది గురించి అక్కడ నివసించే జంతువులు గురించి వివరణ ఇచ్చారు. ఆ పడవలో వెళ్తూ అక్కడి సూర్యాస్తమయము ఎంత అందంగా వుందో, తళతళ మెరుస్తున్న జాంబేజి నది. ఒక్కసారిగా బంగారు వర్ణంలో మారిపోయి సూర్యుడి కిరణాలతో ఆ నది బంగారు వర్ణపు చీర కట్టుకొని సింగారించుకొని మెరిసిపోతున్న ఆ నదిని అలా కళ్ళార్పకుండా నిశ్చేష్టులమై ఆ దృశ్యకావ్యాన్ని మా ఎదలో ముద్ర పరుచుకొన్నాము. అక్కడ బెస్తవారు చిన్న పడవలలో ఇంటికి చేరుతున్న సంతోషంలో ఈల వేస్తూ పాటలు పాడుతూ వున్నారు. నాకు “హైలో హైలెస్సా హంస కదా నా పడవ వయ్యాలలూగినది ఊగిసలాడినది హైలో హైలెస్సా హంసకదా నా పడవ” అనే పాట గుర్తుకు వచ్చింది. అ నీరెండలో ఒక దృశ్యాన్ని చిత్రకారుడు చిత్రీకరించినంత అందంగా వుంది ఆ సాయంత్రం.

ఇవి చూస్తూ ఆ నేషనల్ పార్క్‌లో మేము స్వేచ్చగా తిరిగే జిరాఫీలను, ఏనుగులను చూశాము. నీటిలో నీటి ఏనుగు తన నాలుగు పిల్లలతో ఆడుకుంటూ అన్నీ ఒక దగ్గరగా వున్నాయి, అది ఎంతో ముచ్చటవేసింది. ఆ నాలుగు హిప్పొపొటమాస్‌లను చూచి మా పడవవాడు ఇంజన్ ఆఫ్ చేసి గప్‌చు‌ప్‌గా వాటిని తిలకించడానికి అనువుగా దగరిగా తీసుకొని వెళ్ళాడు.

కొద్ది దూరం వెళ్ళిన తర్వాత జింబాబ్వే దేశానికి సింబల్‌గా వాడే పక్షి కన్పించింది. అది అడవిలో పొడవైన కాళ్ళతో తెల్లటి కిరీటంలాంటి జుత్తుతో ఎంతో అందంగా నన్ను మించినవారు లేరు అని ఠీవిగా… ఆ అడవి అంతా నాదే అనే ధీమాగా తిరుగుతూ కన్పించింది.

కొన్ని పాములు, ముంగిసలు చూశాము. ఏ క్రొత్త జంతువు, పిట్టలు, పక్షులు అన్ని రకాల పక్షులను విపులంగా విశదీకరిస్తున్నాడు మా గైడ్. మొసళ్ళని కూడ చూశాము. అక్కడ అన్నీ ఫొటోలు దిగి మాకు భోజనములో అక్కడి వంటలు కెబాబ్స్ వడ్డించారు. వారి ఆహారము అక్కడ స్వీకరించి 4 గంటల తిరిగి మా పడవ మళ్ళీ ఒడ్డుకి చేరింది. మళ్ళీ మమ్మల్ని తప్పెట్లు వారి సాంప్రదాయ గీతాలతో మళ్ళీ నాట్యం చేస్తూ వారు మాకు వీడ్కోలు చెప్పారు. ఇప్పుడు చాలా మంది అమ్మాయిలు అబ్బాయిలు వారితో నాట్యం చేశారు.

ఈ పడవలో అమెరికా నుండి ఇద్దరు దంపతులు వచ్చారు. వారు ఖరీదైన కెమెరాలో మొత్తం షూట్ చేశారు. వాటి టివిలో చూపిస్తారట. మరొక అతను దక్షిణ అమెరికా నుండి వచ్చారు. అతను ‘50 దేశాలు చూసినందుకే ఎంతో అబ్బురపడి ఉబ్బితబ్బిబ్బు అయిపోతుంటాను. 164 దేశాలు చూచిన మమ్మల్ని చూస్తే చాలా సంతోషంగా వుంద’ని పొగడ్తలతో మమ్మల్ని ముంచెత్తాడు. అక్కడి నుండి మేము మళ్ళీ బస్ ఎక్కి మా హోటల్ కి వచ్చేశాము.

 

జాంబెజీ నది నమీబియా జాంబియా, బోట్సవానా జింబాబ్వే మద్యలో పారుతున్న అతి పొడవైన నది. నైల్ నది, కాంగో నది మరియు నిగర్ నదుల తర్వాత అతి పొడవైన నది. ఈ ఆఫ్రికాలో జాంబియాలో మొదలై 2700 కీ.మీ. ప్రయాణించి హిందూ మహా సముద్రంలో కలుస్తుంది.

ఈ జాంబెజీ నదిలో అతి ప్రమాదకరమైన రాళ్ళు వున్నాయి. ప్రతి సంవత్సరం 50,000 మంది యాత్రికులు Rafting చేయడానికి వస్తారట ప్రపంచ నలుమూలల నుండి.

జాంబేజీ నది జాంబియాలో ఉద్భవించి తూర్పు అంగోలా గుండా నమీబియా ఈశాన్య సరిహద్దు మరియు బోట్సవానా యొక్క ఉత్తర సరిహద్దు మరియు జాంబియా జింబాబ్వే మధ్య మొజాంబిక్ వరకు సరిహద్దు దాటి హిందు మహా సముద్రంలో కలుస్తుంది.

ఈ జాంబేజి నది విక్టోరియా జలపాతంగా మారింది. ఇదే నది జాంబియా అంగోలా మధ్య సరిహద్దులో చావుమా జలపాతం, పశ్చిమ జాంబియాలో న్గోనీ జలపాతంగా వున్న ఈ జలపాతాలు.

ఈ నది ప్రపంచంలోని అత్యంత అద్భుతమైన వైట్ వాటర్ యాత్రలలో ఒకటిగా పేర్కొనబడింది.

ఇక్కడ రాఫ్టింగ్ చేసేవారిని చూచి అబ్బురపడి మా మదుర స్మృతులతో ఉగాండాకి బయలుదేరాము.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here