[dropcap]ప్ర[/dropcap]కృతి అందాల గురించి, హెల్మెట్ గురించి, ఆరని ఆశల గురించి మూడు మినీ కవితలందిస్తున్నారు కె. మనస్వి.
1. ప్రకృతి అందాలు
ఈ తొలకరి చిరుజల్లులలో
పున్నమి వెన్నెల రేయి తారల తళుకులలో
గుభాళించే పూల సుగంధ పరిమళంలో
ఆస్వాదించు ఆహ్లాదం మనసారా ప్రతిక్షణం
2. ఆరని ఆశలు
ఆరని ఆశలు
ఊరించే ఊహలు
మనసున మమతలు
ఇవి మనిషి జీవితానకి మాయని మచ్చుతునకలు
3. హెల్మెట్
హెల్మెట్ ఇది ఫేస్ మేట్
తల గాయాలకి ఇది హీల్ మేట్
మరిస్తే నరకానికి ఇదే తొలి మెట్టు
బైక్ పై ప్రయాణించే ప్రతి ఒక్కరూ హెల్మెట్ పెట్టుకుని
ఆక్సిడెంట్‌లకి పెట్టాలి చెకమేట్