మారిన కాలం-మారని మనిషి

1
2

[శ్రీ సాగర్ రెడ్డి రచించిన ‘మారిన కాలం-మారని మనిషి’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]

[dropcap]అ[/dropcap]వును! కాలమెంతో మారిపోయింది-
మనిషి దాష్టీకాలకు సాక్ష్యమయ్యిందీ,
సాంప్రదాయాల ఉనికిని ప్రశ్నిస్తోందీ-
నిత్యం వినే మారిన కాలమనే మాట!!

కాల గమనంలో మార్పు ఆవశ్యమైనా,
స్వలాభాపేక్షకూ కాలంపై మోపే నెపం-
మనిషి నేర్చిన కుటిల విద్యలో భాగం,
తన తప్పులకు సమాధికట్టే యత్నం!!

క్రమశిక్షణలేని విద్యకు అంకురార్పణతో
మొక్క దశలోనే నేర్చిన పాశ్చాత్యం-
మానై పెరిగి పైశాచికత్వమయ్యిందీ,
మారిన కాలం పేరుతో రక్షణ తొడిగి,
ఆరాచకత్వానికి ఆజ్యంపోస్తోంది!!

మారిన కాలంలో మంచికి ఆహ్వానం,
చెడుకు నిర్మొహమాట తిరస్కారంతో,
సంస్కారబద్ద జీవితానికి ఆస్కారం..
అదే మారే క్రొత్త జీవితానికీ సోపానం!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here