Site icon Sanchika

మాటంటే..!

[డా. కోగంటి విజయ్ రచించిన ‘మాటంటే..!’ అనే కవితని అందిస్తున్నాము.]


~
[dropcap]మా[/dropcap]టంటే గాలిలో కలిసిపోయేదో
నీటిమీద రాతో కాదు
వేలు పట్టుకు మనసును ఊరట పరిచే
వూ కొట్టే చంటి పిల్లల మెత్తటి అరిచేయి
దారమై గుండె గుండెనూ కుట్టే
పోగుల పత్తి పువ్వు

అనేస్తే పోయేది కాదు కదా మాటంటే
అది సూటిగా గుండె మట్టిలోకి దూరి
మొక్కయి మొలకెత్తే విత్తనం

మాట సూదో సుత్తో మారణాయుధమో కారాదు
ఆనందపు మత్తెక్కించే మధువవ్వాలి
మనసు దిగులును తీర్చే మందవ్వాలి
ఒక నేస్తపు వెచ్చని కౌగిలి కావాలి
లాలించి అక్కున చేర్చుకునే అమ్మా కావాలి!

Exit mobile version