[dropcap]మ[/dropcap]డికి నీరు పెట్టి
చేత ఏరు పట్టి
చలాకిగా దున్నే ఓ రైతన్నా
నీ శ్రమ శక్తే దేశానికి ప్రాణమన్నా ॥మడికి॥
నీవు నమ్ముకున్న పొలమే
నీవు నమ్ముకున్న నాగలే
నీవు నమ్ముకున్న కాడెడ్లే
నీ స్వర్గలోకము రా ॥మడికి॥
నీ చెమట బిందువె నీరై
నీ జెబ్బ సత్తువే ఎరువై
నీ మంచి మనసే పంటై
నీ ప్రజల కడుపు నింపునురా ॥మడికి॥
నీ ఉన్నతాశయాన్ని
నీ ఉత్తమాదర్మాన్ని
ఆదరించి, ఆచరిస్తే
లోక కళ్యాణమురా ॥మడికి॥