మగవారు

1
2

[మాయా ఏంజిలో రచించిన ‘Men’ అనే కవితని అనువదించి సంచిక పాఠకులకు అందిస్తున్నారు కవయిత్రి హిమజ గారు.]

(అతి పిన్న వయసులోనే దేహానుభవం కోసం తాపత్రయపడిన బాలిక చేదు అనుభవం, మానసిక స్థితిని వర్ణించిన కవిత ఇది!!)

~

[dropcap]నా [/dropcap]చిరుప్రాయం నుండి
పరదాల వెనకనుండి వాళ్ళని
చూడడం నాకో అలవాటుగా ఉండేది
మగవాళ్ళు పైకి వెళ్ళడం
కిందకి రావడం
ఆ వీధిలో
మధ్యవయస్కులు, ముసలివారు
యవ్వనం లో ఉన్న మగవారు
ఎంతో తెలుసుకోదగ్గ వాళ్ళుగా నాక్కనిపిస్తారు
చూడండి..
కుతుహలంతోను ఉద్రేకంతోను
మగవాళ్ళెపుడూ
ఎక్కడికో ఒక చోటికి
వెళ్తూ వస్తూనే ఉంటారు
వాళ్ళందరికీ తెలుసు
నేను అక్కడే ఉన్నానని
పదిహేనేళ్ళ నేను వారికై
తహతహలాడుతున్నానని..

నా కిటికీ దగ్గర వారు ఆగిపోతారు
యవ్వనంలో ఉన్న బాలిక వక్షోజాల్లాగా
వాళ్ళ భుజాలు ఇంతెత్తున లేస్తాయి
దుస్తుల్లో దాక్కున్న వారి చేతులు
వెనకున్నవారిని చరుస్తాయి.. ఉత్తేజపరుస్తాయి
మగవారు..
ఒక రోజు నిన్ను వారు మృదువుగా
నువ్వొక్కదానివే ప్రపంచంలోని
ఆఖరు పసికందువన్నట్టుగా
జాగ్రత్తగా అరచేతుల్లోకి తీసుకుంటారు
నెమ్మదిగా పట్టు బిగిస్తారు
కొంతే.. కొంతే..
ఆ బిగువైన తొలి కౌగిలి
ఎంతో బాగుంటుంది
గబుక్కున నిన్ను కౌగిలించుకుంటాడు
నిన్ను నువ్వు రక్షించుకోలేని
ఆ బలహీన క్షణంలో
ఇంకొంత ఆక్రమించుకుంటాడు
ఇంకొంత.. ఇంకొంత..
అప్పుడే బాధ మొదలవుతుంది..
గాలి అదృశ్యమైపోతుంది
భయం చుట్టూ జారిపోయే చిరునవ్వు
గబుక్కున నేలకు రాలుతుంది
నీ మనసు బాధతో ఎగిరెగిరి పడుతుంది
పగిలిపోతుంది..
భీకరంగా పేలుతుంది
వంటింట్లో అగ్గిపుల్లలా భగ్గున మండుతుంది

ఏదో ద్రవం..
వారి బూట్లకి మరకలు చేస్తూ
కాళ్ళ నుండి కిందకు జారుతుంది

ఎంతోసేపటికి..
భూమి తన మీద తన హక్కును
తిరిగి పొందినట్టు
నాలుకకు మరల ఎప్పటిలా
రుచి తెలియబోతున్నట్టు …
దారుణమైన హింస తరువాత
నీ దేహం నలిపి విసిరేసిన మూటలా
నేలన కూలుతుంది..
ఎప్పటికీ.. మరెప్పటికీ..
చెప్పేందుకిక ఏమీ లేదు..
మాటలే మూగబోయాయి
…………………
గది కిటికీ పూర్తిగా తెరుచుకుంటుంది
నీ దేహం.. నీ మనసు..
ఊగిసలాడిన నీఆలోచనల్లోంచి
గాలికి ఊగే తెరల ఊపుకి ఆవల
మగవాళ్ళు నడిచి వెళ్ళిపోతారు
వాళ్ళు ఇంకేదో తెలుసుకోవాలని
మరెక్కడికో వెళ్తుంటారు
ఈసారి నువు మాత్రం
అలాగే నిలబడి
అతి మామూలుగా
చూస్తూ ఉండిపోతావు
………………..
బహుశా!!

~

మూలం: మాయా ఏంజిలో

అనువాదం: హిమజ


తన పుట్టిన రోజు వేడుకల ఏర్పాట్లలో నిమగ్నమై ఉన్న మాయాకి తన స్నేహితురాలు Dolly ద్వారా కింగ్ హతమైన వార్త తెలియగానే తన అపార్ట్‌మెంట్ లోని కొందరు ఇరుగు పొరుగు వారిని కలుపుకొని Harleem కి వెళ్ళి సంతాపం తెలిపింది.

మార్టిన్ లూథర్ కింగ్ (జూ) తన 40వ పుట్టిన రోజున హత్యకు గురవ్వడంతో మాయా బాగా కుంగిపోయింది. కింగ్ అడిగిన వెంటనే మార్చ్ నిర్వహించినట్టయితే ఎంతో బాగుండేదని, ఆ విషయంలో తాను అలసత్వం చూపానని ఎంతో బాధపడింది.

‘కొంతకాలం నా జీవితం ఆగిపోయినట్లయింది. గొప్ప శాంతిస్వాప్నికుడు. మరెంతో ఉన్నతమైన కలలు. ప్రతి ఒక్కరిని ప్రేమించే శాంతికాముకుడు. తన శాంతిస్వప్నాలు నెరవేరకముందే చంపబడ్డాడు’ అని పలు సందర్భాల్లో చెప్పుకునేది మాయా.

కింగ్ బాధాకరమైన హత్యకి నివాళిగా ఆ రోజు నుంచి 2014లో తాను చనిపోయేంతవరకు తన పుట్టినరోజు వేడుకలను జరుపుకోవడం మానేసింది మాయా. కానీ ప్రతి April 4వ తేదీన కింగ్ భార్య Coretta Scott, మాయా ఇద్దరూ కలుసుకునే వారు. వీలు కాకుంటే ఫోనుల్లో మాట్లాడుకునేవారు. పరస్పరం పువ్వులను పంపించుకునేవారు.

మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ భార్యతో మాయా

మాయా MLK Jr. ని prince of peace గా అభివర్ణించేది. అక్షరాలా మనసా వాచా శాంతిని వాంఛించినవాడు అని చెబుతుండేది.

‘The Black Revolution’ పౌర హక్కుల ఉద్యమం కన్నా మించినదని కింగ్ చెప్పిన మాటల్ని ప్రగాఢంగా నమ్మింది మాయా.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here