యువభారతి వారి ‘మహతి’ – పరిచయం

0
2

మహతి

[dropcap]భా[/dropcap]రత స్వాతంత్ర్య రజతోత్సవ ప్రచురణగా వెలువడ్డ ఈ ‘మహతి’ యువభారతి ప్రచురణలలో తలమానికమైనది. పేరును తలిస్తే చాలు, యువభారతీయులందరి హృదయాలలోనూ తియ్యని, తీయని జ్ఞాపకాలను చెలరేగేలా చేసే పుస్తకం – మహతి. నూరుగురు ప్రసిద్ధాంధ్ర రచయితల రచనలతో వెలువడిన వ్యాససంహిత – మహతి. కవిత, నవల, కథానిక, నాటకం, విమర్శ, భాష వంటి వివిధ సారస్వత సాంస్కృతిక అంశాల మీద సహృదయ సమీక్షా సారం – మహతి.

మహతిలో సప్త స్వరాలు– అనే అధ్యాయ సప్తకాలున్నాయి. అవేమిటంటే –

  1. ప్రస్తావన – యువభారతీయం
  2. ప్రవేశం – స్వాతంత్ర్య యుగోదయ సందర్శనం
  3. ప్రతిభ – కవితామూర్తులు, సంప్రదాయ, విప్లవ కవిత్వాల నాయకులు విశ్వనాథ, శ్రీశ్రీ ల వ్యాసాలు
  4. ప్రయోగం – వివిధ సృజనాత్మక సాహిత్య ప్రక్రియా సమీక్ష, విశ్లేషణ
  5. పరిశీలనం – సాహిత్య విమర్శ – భాషా పరిశోధనా విశేషాల సమీక్షా వ్యాసాలు
  6. ప్రస్తారం – వివిధ సారస్వత ప్రక్రియల విస్తార సమీక్ష
  7. ప్రభావం – సాహిత్యం – సమాజం – పరస్పర ప్రభావం

సప్తస్వర విన్యాసం వినిపించి, సమకాలీన సారస్వత సంరంభానికి ప్రతీకగా నిలిచి, సరికొత్త సాహిత్య సమారోహానికి సామగానం సారించిన ఈ మహతి శత వ్యాస తంత్రుల మంజుల నిక్వాణం  మీ మనసును ఏ కొంత రంజింపజేసినా మా ప్రయత్నం సఫలం అయినట్లే మేము భావిస్తాము.

UNO గ్రంధాలయంలో చోటుచేసుకుని యువభారతి గౌరవాన్ని ప్రపంచవ్యాప్తం చేసిన పుస్తకం – మహతి. ఈ పుస్తకంలో విశ్వనాధ వారు, శ్రీ శ్రీ గారు రాసిన వ్యాసాలు హైలైట్లు.  ఈ పుస్తకాన్ని కలెక్టర్స్ ఐటెం గా భావిస్తారు.

భారత స్వాతంత్ర్య రజతోత్సవ ప్రచురణగా వెలువడ్డ ఈ పుస్తకం, భారత స్వాతంత్ర్య అమృతోత్సవాల  సందర్భంగా —  50 ఏళ్ళ తరువాత – ఇటీవలే పునర్ముద్రించబడింది.

క్రింద ఇవ్వబడిన link ను క్లిక్ చేసి ఈ ఉద్గ్రంధాన్ని ఉచితంగానే చదువుకోండి.

https://drive.google.com/file/d/1dQUabJMqPBf9XoxBR_KxQXZVNZWF9bnP/view

లేదా క్రింద ఇవ్వబడిన QR code ను scan చేసినా మహతిని ఉచితంగానే చదువుకోవచ్చు.

అయితే, అత్యంత వ్యయ ప్రయాసలకోర్చి ఈ పుస్తకాన్ని సరికొత్త ముందుమాటతో యువభారతి పునర్ముద్రించింది. ఉచితంగా పాత పుస్తకాన్ని చదివినా క్రొత్త పుస్తకాన్ని కొని దాచుకోమని మనవి. కొత్త పుస్తకంకోసం  శ్రీ రవీంద్ర, కోశాధికారి ని సంప్రదించండి. ఫోను నంబరుః  9849909896.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here