[dropcap]ప్ర[/dropcap]సిద్ధ సినీ కవి, రచయిత శ్రీ భువనచంద్ర గారి కలం నుంచి జాలువారిన ‘మహతి’ అనే నవలని సరికొత్త ధారవాహికగా పాఠకులకు అందిస్తున్నాము.
***
కాలేజీ వాతావరణం చాలా ఊపులో వుంది. ఫుల్‍గా విద్యార్థులు, లెక్చరర్లు కల్చరల్ ప్రోగ్రామ్స్ మీద కాన్‍సన్‌ట్రేట్ చేస్తున్నారు. కారణం ఇంటర్ కాలేజ్ కాంపిటీషన్స్. మా కాలేజీకి స్పోర్ట్స్‌లో పెద్ద పేరు లేదు; అంటే వాలీబాల్, ఫుట్‍బాల్ వంటి వాటిల్లో.
కేరమ్స్, రింగ్, టెన్నిస్ లకి మంచి బేచ్ వుంది. పరుగు పోటీల సంగతి చూడాల్సిందే మరి. ఎందుకంటే నేనెప్పుడూ ఆటల సంగతి పెద్దగా పట్టించుకోలేదు.
పాటల పోటీలకి మాత్రం హరగోపాల్ నేనూ, మరో నలుగురం సెలెక్టయ్యాం. (నా మోహం.. సెలక్షనేం జరగలేదు. మా ఇద్దరి పేర్లూ మొదట రాసి, ‘ఎనీ బడీ ఎల్స్’ అనగానే మరో నలుగురు వాళ్ళ పేర్లిచ్చారు. అంతే!)
బూరుగుచెట్టు కింద ఆరుగురం సమావేశమయ్యాం. ఏ పాటలు పాడాలి? ఎలాంటివి సెలెక్ట్ చేసుకోవాలి అని. గంటన్నర అయినా సమస్య ఓ కొలిక్కి రాలేదు.
***
వచ్చే వారం నుంచి
తప్పక చదవండి భువనచంద్ర గారి నవల
‘మహతి’