[dropcap]అ[/dropcap]ర్ధశతాబ్ది కాలంలో ద్విభాష్యం రాజేశ్వరరావు వ్రాసిన బహుమతి పొందిన కథల సంపుటి “మహాత్ముని సాక్షిగా...”.
***
“ద్విభాష్యం రాజేశ్వరరావు గారు సుప్రసిద్ధులయిన కథా రచయిత. ‘మహాత్ముని సాక్షిగా….’ సంకలనంలో 16 కథలున్నాయి. అన్నీ వివిధ పత్రికలు, సంస్థలు, నడిపిన పోటీల్లో బహుమతులు పొందినవే. ఇదొక విశేషమైన సంపుటి ఇలాంటి సంపుటాలు లోగడ రాలేదనుకుంటాను. ఈ కథల్లో కొన్ని చిన్నవి, కొన్ని మరీ చిన్నవి. ఒక్కటి మాత్రం పెద్దకథ. పోటీలు పెట్టే పత్రికలవాళ్ళు కొన్ని కొన్ని రూళ్లు గీస్తారు – కథ ఇన్నిమాటల్లో, ఇన్ని అక్షరాల్లో ఉండాలి అంటూ. ఆ ప్రకారం రాయడంవల్ల కాబోలు, చిన్నా, పెద్దగా వచ్చాయి. ఏమైనా, నిబంధన విధిస్తే ఆ చట్రంలోనే కథ రాయడం ఇబ్బందే. ఆ ఇబ్బంది మనకి ఏమాత్రమూ తెలియకుండా, ప్రతి కథనీ రాజేశ్వరరావుగారు నైపుణ్యంతో రాశారు. ముఖ్యమైన విషయం శైలి. ఏ కథ చదివినా, ప్రారంభం నుంచీ ఆగకుండా చదివేయాల్సిందే. ద్విభాష్యం వారి కథని మనం చదవనక్కరలేదు. అదే చదివించేస్తుంది!
ఈ పుస్తకంలో కథలన్నీ ఒకే దారిలో నడవవు. కొన్నింటిలో ఉత్కంఠ (మహాత్ముని సాక్షిగా…) కొన్నింటిలో వ్యంగ్యం, హాస్యం (కోర్టుపక్షి, సంతానబల్లి, కంప్యూటరు, కాత్యాయని) కొన్నింటిలో సాహసం (సిసలయిన సాహసం, చుండ్రు) మరి కొన్నింటిలో సహనం (ఈదేశంలో ఓసగటు కథ) కనిపిస్తాయి. ఎంతోమంచి కథలు అనిపించిన ‘మానవత వికసించాలి’, ‘ఏ వెల్గులకీ ప్రస్థానం?’ సంకలనానికి వెలుగులు” అని వివరించారు రావి కొండలరావు “బహు’మతు’లకు చిరు’మతి’ ” అనే ముందుమాటలో.
***
మహాత్ముని సాక్షిగా…
(అర్ధశతాబ్ది బహుమతి కథలు)
రచన: ద్విభాష్యం రాజేశ్వరరావు
పేజీలు: 164. వెల: రూ.125/-
ప్రతులకు: విశాలంధ్ర, నవచేతన, ఇతర ప్రముఖ పుస్తక విక్రయ కేంద్రాలు, ప్రచురణ కర్త.
ప్రచురణకర్త:
పర్యావరణ ప్రచురణలు, 49-27-33/1, మధురానగర్, విశాఖపట్నం- 530016. ఫోన్: 0891 -2790109 సెల్: 94403 18415