Site icon Sanchika

మహిళా మూర్తి

[అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శ్రీమతి తోడేటి దేవి రచించిన ‘మహిళా మూర్తి’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]

[dropcap]కా[/dropcap]టుక దిద్దిన..
అందమైన నీ కనురెప్పల క్రింద దాచుకున్న భావమేమో..

సంపెంగ పువ్వు లాంటి..
కొనదేరిన నీ నాసిక..
తుమ్మెదలకు ఆటవిడుపు ఏమో..

చిరునవ్వులు చిందించే..
నీ పెదవి విరుపులు..
సుగంధాల విరజాజులు ఏమో..

సిగ్గు పడే నీ బుగ్గలు..
కాశ్మీర కుంకుమ అద్దిన..
జిలిబిలి సొగసులేమో..

కారుమబ్బు లాంటి..
నీ కురులు చూసి..
కటిక చీకటి కుళ్లుకుంటుందేమో…

చందన లేపనాన్ని..
స్మరించే లాంటి చుబుకం..
నెలవంక లాంటి చంద్రమేమో

తామరతూళ్లు లాంటి..
నీ లేత కరములు
అభినందన మందారమాలలేమో.

మందగమనంగా సాగే
నీ నడక హొయలు..
మయురాలకు.. పోటీనేమో..

ఎన్నెన్నో సుగందభరిత..
ప్రేమపూరిత.. సుకుమారి వైన
నీవు..
ఆపత్కాలంలో.. అపరచండివి
దుర్మార్గులతో.. దుర్గా దేవివి
విజ్ఞానంలో.. సరస్వతివి
కరుణ చూపించే.. సహోదరివి
బాధ్యత భరించే.. భార్యవి
ప్రేమని పంచే.. ప్రాణాన్ని ఇచ్చే
అమృత మూర్తివి.

🌹అమ్మలగన్న అమ్మవి🌹
మాతృమూర్తి నీకు వందనం 🙏

Exit mobile version