Site icon Sanchika

మైత్రి

[box type=’note’ fontsize=’16’] మనసులోని మాటలని మక్కువతో పంచుకోడానికి నిజమైన మిత్రులుండడం ఎంత అవసరమో “మైత్రి” అనే పద్య పంచకంలో వివరిస్తున్నారు బుసిరాజు లక్ష్మీ దేశాయి. [/box]

 చంపకమాల-

[dropcap][/dropcap]సున నున్నమాటలను క్కువతోడవినంగనెప్పుడున్
నిషికి మంచి తోడొకరు మాయలఁజేయని మిత్రమై,సుభా
లను కల్గి యున్నపుడు, పాయని శాంతియు సాంత్వనల్ మనో
మున పువ్వులై విరియు, వంతలు చింతలు దూరమౌనికన్.

నులను మున్గియుండగ నపార్థములెవ్వియు లేని యొద్దికల్
ముగ నుండగానచట గాఢతఁ బెంపుగ నుండునెప్పుడున్.
నిసిన మానసమ్ములను న్యత నొందును మైత్రిభావనల్!
నువులు హెచ్చుగా నగును, సంతసమెప్పుడు నిండుచుండగా.

ఉత్పలమాల-

బాల్యమునందు, యౌవనము, వార్ధకమందుననెప్పుడైన, చా
ల్యములుండు సాజమది ,వంచన మానసమందులేనిచో
తుల్యములేని స్నేహమున దోషములెంచుట, దూరుటేల? కై
ల్యము నిచ్చువాడెఱుగు, భావ్యమభావ్యములన్నిటిన్ గదా!

పిల్లల మధ్య, పెద్దలను, పెండ్లినిఁ గోరిన జంటలందునన్,
ల్లులు తండ్రులందు, పలు దారులఁ జేరెడు బాటసారులన్,
చెల్లును చెల్మి యెక్కుడుగ చిక్కులఁ జిక్కక నుండనోపు, శో
భిల్లును పృథ్వి, మైత్రియును ప్రేమలు నెల్లెడ నిండు నాళులన్.

కోలమైన మానసము కుందకనుండగ, నిర్మలమ్ముగా
తార పుష్పమై యడుసుఁ దాకక నిల్చిన భంగిగా నిటన్
వేరు బాధలన్ నిలిచి వెల్గును మేదిని మైత్రి దీపమై
యాము తోడ నిశ్చలత ర్మిలి నిండిన మానసమ్ములన్.

Exit mobile version