మానస హిందోళం!

0
2

[dropcap]ఎ[/dropcap]న్నెన్ని కలలో ఊయలలో, ఖేలా పరవశ హ్రృదయంలో!
ఎన్నెన్ని ఎత్తులో ఊహలలో ,గగనాభిముఖ నయనంలో!!

తనువుకు ఆవధులు, అలుపులు,నిజమే!ఉన్నవనంతం
మనసుకు?అదమూర్తం అగాథం అమేయం,నవాతినవమ్

విరబూసే వాసంత విలాస మచిరమని తెలియకున్న
శరదంబర మృదు కౌముది కరుగునని ఎరుగకున్న!

విరమణల శిశిరాగమనము, గుప్త వసంతాంకురమే!
పర,తన, లేని ఈ ప్రక్రృతి మౌనప్రస్తారం,ఆశారాగమే!

ఇది ఒక వలయం,పోకడ లోనే రాక నింపుకున్నమర్మం
ఎదిగినది,పండి, లఘువై రాలటం బీజం లోనే ఉన్నది!

అదరక బెదరక ఎదుర్కోవటం, నైజంలోనే ఉన్నది
ఆ దినుసే,నీమనసు!కొంగొత్త చిగుళ్ళ నిత్యనూతనమ్!

ఫలితం,అనుకున్నది రానపు డేమున్నది శోక కారణం
లోలాభ్రపుటురుములతోటేచూశావాప్రృథువర్షంసతతం?!

ఆగక మళ్ళీ మళ్ళీ యత్నించటమే మనిషిగ నీ కర్తవ్యం,
మనసు
కళగ ఉంటే జగమె నీది! శూన్యమైతే,నీవె జగన్మూలం !

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here