[dropcap]పా[/dropcap]శం తాలూకు అనుభూతి సత్యమే –
‘పాశమే’ ‘మిధ్య!’ అనిపించడమూ సత్యమే
భావనా శృంఖలాలు విడివడినపుడు
మనసు ముక్త చందమౌతుంది.
***
మెదడులో – అరలు పొరలు
సమాచార సౌలభ్యం కోసం
మనసులో అరలు పొరలు అలా కాదు
మానవీయ స్పందనలకు పరమ అడ్డంకి.
***
కన్నీరు వేదనా జనితమే
కాని అది ప్రవహించక –
మనిషి మేధను ఇంకిపోతే స్కిజోఫ్రెనిక్
మనసున ఇంకిపోతే ఉన్మాది.