[dropcap]ఆ[/dropcap]నందంతో మైమరిచి
ఆడుతున్న నెమలిలా
ఆడాలనీ పాడాలని
రమ్మని పిలిచే
కమ్మని కోయిల
గానాలలో తేలిపోవాలని
నింగిని ఏలాలని
బుద్ధాది మునిజనుల్లా
తపములు ఆచరించాలని
వివేకానందాది విశ్వాదర్శ
పురుషుల.. అడుగుజాడల్లో
నడవాలని..
ఆశను..
అజ్ఞానాన్ని
విడనాడి
పూర్ణానందుడు
అవ్వాలని
తలచి తలచి
తల వెంట్రుకలు
తెలుపైనా
వేదనతో సాధన
చేయలేక పోయ
ఎందుకో.. అదెందుకో..