మనవడి పెళ్ళి-3

0
3

[శ్రీమతి నారుమంచి వాణీ ప్రభాకరి రచించిన ‘మనవడి పెళ్ళి’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము.]

[కొడుకు మీద నానమ్మ ప్రభావం తగ్గించి తన దారిలోకి తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తుంది కోమలి. కొడుకుని జిమ్‍కి తీసుకువెళ్తుంది. అక్కడ వ్యాయామాలు చేస్తున్న యువతులను చూసి ముచ్చట పడుతుంది. అప్లికేషన్ ఫిల్ చేసాకా, . వేసుకోవలసిన డ్రెస్లు, ఇతర రూల్స్ అన్నీ జిమ్ వాళ్ళు. ఫీజు చెల్లించి కిరణ్‍ని అక్కడ చేర్పిస్తుంది. భోజనం తగ్గించి, వ్యాయామం చేసి బరువు తగ్గిన తన స్నేహితురాలి కొడుకుని గుర్తు చేసుకుని – తన కొడుకు విషయంలో బాధపడుతుంది. ఇంటికి వచ్చాకా అత్తగారు ఆరా తీస్తే, జరిగినది చెప్తుంది. అత్తాకోడళ్ళ మధ్య వాదన జరుగుతుంది. కిరణ్ జిమ్‍కి వెళ్ళడం మొదలుపెట్టి రెండు నెలలు దాటుతుంది. కొంచెం బరువు తగ్గుతాడు. కానీ ఇంకా కృషి చేయాల్సి ఉందని అంటారు జిమ్ వాళ్ళు. కోమలి పక్కింటి ఆమె వాళ్ళ అక్క – వీళ్ళ దగ్గర సంబంధాల లిస్ట్ ఉందని తెలిసి వస్తుంది. వాళ్ళ మాటల్లో నేటి తరం పిల్లల పెళ్ళిళ్ళు, ఆలోచనా విధానం, బరువుబాధ్యతల ప్రస్తావన వస్తుంది. డ్రెస్ డిజైన్ంగ్‍లో డిప్లొమా చేసి అందంగా చలాకీగా ఉండే కృత్తికకి ఓ పెద్ద మాల్‍లోని ఓ షాప్‍లో మేనేజర్ ఉద్యోగం వస్తుంది. ఉద్యోగ బాధ్యతలలో భాగంగా కొత్త డిజైన్ల దుస్తుల ప్రదర్శనని ఏర్పాటు చేస్తుంది కృత్తిక. కోమలి ఆ ఎగ్జిబిషన్‍లో రెండు నైటీలు మూడు పంజాబీ డ్రెస్లు కొనుక్కుంటుంది. అత్తగారికి వెంకటగిరి చీర కొంటుందిది. కొడుకుకి నిక్కరు మాదిరి ఖరీదైన డ్రెస్ కొన్నది. ఇంటికొచ్చాకా కాంతమ్మకి వాటిని చూపిస్తే, ఆ డ్రెస్లు తొడుక్కుని ఇంట్లో తిరగవద్దని కోడల్ని శాసిస్తుంది. వాకింగ్‌కి వెళ్ళే వారు తప్పక ఈ డ్రెస్ వేసుకోవాలి, లేదంటే జాగింగ్ సూట్ వేసుకోవాలి, అదెలాగు వద్దంటారని పంజాబీ డ్రెస్‍లు తెచ్చుకున్నానని చెబుతుంది కోమలి. – ఇక చదవండి.]

అధ్యాయం-6

[dropcap]కో[/dropcap]మలి స్నేహితురాలు రూప విశాఖలో ఉన్నది, ఆమె మంచి యోగా టీచర్. కొన్నాళ్ళు వెళ్ళి నేర్చుకుందాం అంటే అత్తగారు ఊరుకోరు. కొడుకుకి మాత్రం అప్పుడప్పుడు వీడియో క్లాసెస్ పెట్టి చూపుతూ ఉంటుంది. రూప భర్త డాక్టర్. బాగా సంపాదిస్తాడు, అయినా రూప యోగ ఆర్ట్ విడువలేదు. సాయంత్రం భర్త రూప రావ్ హాస్పిటల్‌కి వెడుతూ రూపని యోగ సెంటర్లో దింపుతారు. అక్కడ క్లాసులు చెపుతుంది. మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్ళే వేళలో తీసుకు వెడాతాడు.

పెద్ద ఆదాయం ఏమీ ఉండదు, అయినా సరే తన వ్యక్తిత్వాన్ని గుర్తించి స్వతంత్రత కోసం ఈ యోగ సెంటర్ నడుపుతోంది. ఎక్కువ భాగం వీడియోలు, సి.డిలు చేసి ఇస్తుంది. అవగాహనపై యూట్యూబ్ క్లాసులు పెడుతుంది. సోషల్ మీడియాలో మంచి పేరు సంపాదించుకున్నది.

వ్యాపకాలు మనిషికి ఒత్తిడి లేకుండా తగ్గించి మంచి మార్గాన్ని అందిస్తాయి. మంచి ఆలోచన వస్తే అన్ని పనులు సక్రమంగా జరుగుతాయి.

కోమలి ఆలోచనకి అడ్డుకట్టు వేస్తూ “వంట ఏమి చేస్తున్నావు?” అడిగింది కాంతమ్మ.

“అదేంటి అత్తయ్యా, పొద్దున్న వండిన వంకాయ అల్లం కూర ఉన్నది, చపాతీలు చేస్తాను.”

“మాకు అవి చాలవని తెలుసు! వాడికి కూరతో పాటు మునగ కాడ తోటకూర పులుసు, టమాటా, కొత్తిమీర వేసి పులుసు ఉండాలి. మాకు సరిపడా పెట్టు. నువ్వు నీ ఇష్టం” అన్నది.

ఈరోజు అత్తగారు కడుపునిండా తిననివ్వదు. దానివల్ల కూడా తను చాలా నాజూకుగా ఉంటుంది. కారణం మినిమం ఆహారం తినడమే మంచిది. అని ఆలోచన చేసింది.

కొడుకు తిండి వేరు, వాళ్ళు వాళ్ళకి కావల్సింది తినగా మిగిలింది తినాలి. ఒక్కోసారి మొగుడు రాత్రి ఇంటికి వచ్చేన కూర, పులుసు ఆవిడ తినేసి నా కొడుక్కి గోంగూర, చింతకాయ పచ్చడి, ఆవకాయ, కందిపొడెం చాలు అంటుంది.

“మీరు భోజనానికి వస్తాను అని మెసేజ్ పెట్టండి చాలు, నేను కుక్కర్లో బియ్యం పెడతాను. లేదా నాలుగు పుల్కాలు చేస్తాను, వేడిగా తినవచ్చును.

మీకు ఇలాంటి తిండి పెట్టి కడుపు గుల్ల చేసి బొజ్జ పెరిగేలా చేసింది.

నా కొడుకు పరిస్థితి ఇదేనా!

నేను ఉన్నాను కాబట్టి మీకు పెళ్ళి అయ్యింది, ఈ ఆధునిక యుగంలో ఎవరు ఆడుతారు చెప్పండి” అంది కోమలి భర్తతో.

పెళ్ళీడు కొడుకు ఉన్నా సరే భార్యతో సంప్రదింపు కుదరదు. అందుకే అటు తల్లికి చెప్పలేక పెళ్ళాన్ని బాధపెట్టడం ఇష్టం లేక క్యాంపులు, బిజినెస్ అంటూ వెడతాడు తల్లి వల్ల ఇంటి సుఖం లేదు, అయిన ఈ రోజుల్లో అతను ధర్మాత్ముడు కనుక తల్లిని భరిస్తున్నాడు. భార్యను బిడ్డను తల్లి ఇష్టానికి పెట్టి ఉంచాడు.

రూప మేనకోడలు దుబాయ్‌లో ఉన్నది. పిల్లని కొన్నాళ్ళు తెలుగు సంగీతం నేర్పించడం కోసం రూప దగ్గర పెట్టారు. ఆ పిల్ల కూడా చాలా బొద్దుగా ఉంటుంది. రూప కొడుకు నార్మల్‌గా ఉంటాడు. ఇంజనీర్ చదివాడు. కాని బిజినెస్‌లో ఉన్నాడు. మంచి ఆర్కిటెక్ట్ అవడం వల్ల సొత ప్లాన్ వేస్తూ ఉన్నదాన్ని సరిపెట్టుకుంటే చాలు అంటాడు.

రూప మేనకోడలుకి బావను చేసుకోవడం ఇష్టమే కాని ఉద్యోగం చెయ్యండి అంటే వినడు. ఈ రోజుల్లో ఉద్యోగం మానవ లక్షణం అంటుంది.

“అంతా ఏదో ఒక ఉద్యోగం చేస్తున్నారు. వద్దు అంటే కోపమే కదా! టాక్స్ కట్టాలి మీ నాన్న సంపాదన నీకేగా నాకు ఉన్న డబ్బు చాలు ఇరవై నాలుగు గంటలు సంపాదన అంటే ఎలా? జీవితంలో ఎంజాయిమెంట్ ఉండాలి. అయినా నువ్వు చాలా లావుగా ఉన్నావు. నేను చేసుకోను పో” అన్నాడు.

ఇంకా ఆరోజు అత్తమామ దగ్గర గొడవ తండ్రికి వీడియో కాల్ చేసి అల్లరి చేసింది. “నీకెందుకు అంత బెంగ పెళ్ళి చేసేది మేము, వాడిని ఎలా ఒప్పించాలో నాకు తెలుసు” అన్నది రూప.

ఇలా గొడవ అయ్యాక అత్త రూప దగ్గర యోగ ఆసనాలు అన్ని నేర్చుకుని స్లిమ్ అయ్యింది. ఇప్పుడు బావను నేను పెళ్ళాడను అని వుడికిస్తూ ఉంటుంది.

బాబా మరదళ్ళ సరసం ఇంతేగా ఇంతేనా అంటూ గారం చేస్తూ మేనకోడల్ని ప్రేమగా స్నేహితుల మాదిరిగా రోజులు గడుపుతారు.

***

కోడలు అత్తా ఇరవైనాలుగు గంటలు కొట్టుకోవడం కాదు, ఆనందంగా గడపాలి. పిల్లల్ని ప్రేమగా పెంచాలి. అప్పుడే మంచి భావాలు పిల్లలకి వస్తాయి. ఈర్ష్య, ద్వేషము, దర్పము, అహంకారము అన్ని తగ్గితే పిల్లల్లో సాత్వికమైన తత్వం వస్తుంది.

అత్తగారు తల్లిమీద నేరాలు చెపుతూ కిరణ్‌ని పెంచింది. వాడు బామ్మ కూచి.

అమ్మ అంటే భయం. అన్ని స్ట్రిక్ట్ రూల్స్ చెపుతుంది. తిండీ దగ్గర నుంచి కూడా ఎంతో పద్ధతిగా ఉంటుంది. బస్తాడు బియ్యం ఉన్నాయి, కాదా అని ఒకరోజు వండి వార్చి పెట్టుకుని తినగలమా? అవతల పారెయ్యాలి. ఇంట్లో సరుకు కనిపిస్తే చాలు! అన్నీ వండేయ్యాలి, మనుమడు తినాలి, స్వా‍ర్థం. కొడుకు కూడా ఏ ఒక్క రోజు తల్లికి పెట్టాలి అని అనడు. అంటే గొడవే ఇక ఆరోజు.

కోమలి దృష్టి అంతా కృత్తిక మీద ఉంది. చాలా చలాకీగా ఉన్నది. తనకి ఆమె కోడలు అయితే సరిపోతుంది.

కొడుకు పెళ్ళి కోసం తను ధైర్యంగా అత్తగారిని ఎదురించి వేరేగా కాపురం పెట్టాలి. వీడిని మార్చాలి. కృత్తిక ఫోన్ నెంబర్ తీసుకున్నది. వివరాలు అడిగింది.

“నేను ఇప్పుడప్పుడే పెళ్ళి చేసుకోను. అయిన మా బావ మిలట్రీలో చేస్తున్నాడు. నేను పెళ్ళి చేసుకుని జీవితంలో ఎదగాలి, లండన్‌లో నా మోడల్స్ అమ్మకానికి పంపాను, మా అత్త, బావ కూడా వాళ్ళ అక్క పెళ్ళికోసం వెతుకుతున్నారు. ఎంత దగ్గర పిల్ల అయినా మా ఇంట్లో ఆడపిల్ల పెళ్ళి తరువాత మగపిల్లాడు పెళ్ళి లేకపోతే గొడవలు వస్తాయని భయము.” అంది కృత్తిక.

“అందేంటి దగ్గర వాళ్ళేగా” అడిగింది కోమలి.

“అయినా సరే మా ఇంట అంతే మేడమ్” అని ఫోన్ పెట్టేసి నట్లు చప్పుడు అయ్యింది.

మళ్ళీ పెళ్ళికూతురు వేట.. అయినా అనుకున్నది.. తను దురాశ పడింది.

కోమలి మేనత్త కూతురు ఆర్థిక పరిస్థితి బాగాలేక రెండు కాన్పుల్లో మగపిల్లాడు పుట్టాడు. మూడో కాన్పు ఆడపిల్ల ఉండాలని అత్తగారు పట్టుబట్టింది. చేసేది లేక ఊరుకున్నది. మొగుడు వైజాగ్ ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం నెమ్మదిగా పరీక్షలు రాసి ప్రభుత్వ ఉద్యోగంలోకి వెళ్ళాడు.

పెళ్ళానికి అటు పుట్టింటి పోషణ ఉన్నది. పెళ్ళికాని చెల్లెలు వున్నది. తండ్రి అంతంత మాత్రం సంపాదన ఏదో రెండు ఎకరాల పండిస్తున్నారు. బావమరుదులు పట్టించుకోరు, అందుకని పిల్లల్ని పెంచడానికి చెల్లెలు పెళ్ళి ఆపి, ఆ పిల్లకి తను పెళ్ళి చేస్తాను అని తల్లిని తండ్రిని వదిలెయ్యండి, చెల్లి పెళ్ళి తన పిల్లలు ఎదిగే వరకు వాయిదా వేసింది.

ఎవరూ రాసి ఉంటే వాళ్ళే అవుతారు. పిల్లలు ఇద్దరు టెన్త్ క్లాసికి వచ్చాక చెల్లెలి పెళ్ళి చేసింది. ఏదో ప్రైవేట్ కంపెనీలో పని, అరెకరం మాగాణి ఉన్నది. దాని బ్రతుకు అది బ్రతుకుతోంది.

అయితే ఇక్కడ తిరకాసు ఏమిటంటే సమయానికి తిండి వండేది కాదు. అన్నము పిండి కూరలు తెప్పించేది. మగపిల్లలు ఆకలి అంటే యాభై రూపాయలు ఇచ్చి నచ్చింది తెచ్చుకుని తినమనేది. దానివల్ల వాళ్ళకి ఊబకాయం రావడం జరిగింది. అప్పుడు వాళ్ళని ప్రకృతి ఆశ్రమంలో చేర్చితే గానీ తగ్గలేదు.

ఎందుకు తల్లిదండ్రులు పిల్లల్ని కంటారు? కని వారిని సవ్యంగా ఎందుకు పెంచరు? అని భాధపడేవారు.

ఇప్పుడు నిజానికి కోమలి వాళ్ళ చుట్టాలలో 11 మంది మగపిల్లలు ఉన్నారు. అందరూ ఇంజనీర్స్, బ్యాంక్ ఆఫీసర్స్, ఎవరికీ పెళ్ళి కుదరడం లేదు. బామ్మలు చేసిన పాపం – ఆడపిల్లలు లేరు.

అధ్యాయం 7

కిరణకు ఒక సబంధం తెచ్చాడు పెళ్ళిళ్ళ పేరయ్య.

అయితే ఇంట్లో బామ్మ, తాత కూడా ఉంటారు అనేటప్పటికి వాళ్ళు వద్దు అన్నారు, అంతే కాదు ఇల్లు రీమోడలింగ్ చేయించాలి. పాతకాలం ఇంట్లో మా పిల్ల ఉండలేదు అన్నారు.

పిల్లాడి గుణం ముఖ్యమా! లేక మా ఇల్లు ముఖ్యమా! అంటే అదీ కావాలి, ఇదీ కావాలి జీవితమంతా పాత పురాణంలో జీవితం వెళ్ళదియ్యాలా?

మా పిల్లలకి పెళ్ళి చెయ్యాలంటే మాకు భయం. అత్తింటి బాధలు పడలేరు. వాళ్ళు పెద్ద పిల్ల కూడా అవసరం అయితే అల్లుడు కూడా మమ్మల్ని చూడాలి – అని షరతులు పెట్టారు.

పిల్లాడి పెళ్ళి చెయ్యాలి అంటే షరతులు ఒప్పుకోవాలి.

సరే అంటూ ఇంటికి దగ్గరలో ఉన్న కొత్త అపార్ట్‌మెంట్‌లో కావలసిన సరుకులు పెట్టి, వారు ఇచ్చే సామాను సర్ది పిల్లాడికి పిల్లకి అక్కడ ఉండేలా కోమలి ఏర్పాటు చేసింది. అప్పుడే పెళ్ళికి ఒప్పుకున్నారు.

ఈ రోజుల్లో ముసలి వాళ్ళను చూడటం వారి పెత్తనంలో జీవించడం మహాకష్టం. అందుకే కిరణ్ లాంటి ఎందరో అబ్బాయిలకి పెళ్ళి అవడం లేదు.

కోమలి వంటి తల్లి వుండి జీవితం సవ్యంగా చేస్తే గాని జరుగదు. మా అబ్బాయి చాలా నెమ్మది, వాడికి భయం, ఏమీ చెయ్యలేడు, అంటూ సన్నాయి నొక్కులు నొక్కితే ఎలా? అంటూ పెళ్ళి పెద్ద రెండు వైపులా నచ్చచెప్పి పెళ్ళి చేసాడు.

మొదట పెళ్ళి కూతురు దొరికినందుకు సంతోషము అన్నారు. కానీ పిల్ల పిల్లాడి కన్నా పెద్దదిగా ఉంది, అని పెళ్ళికి వచ్చిన వాళు వాళ్ళ సందేహం చెప్పారు.

వాడికి అది రాసి ఉంది, అని సరిపెట్టుకున్న వాళ్ళు ఉత్తములు.

కిరణ్ అత్త, మామ, అల్లుడు దగ్గరకి వచ్చి పిల్లని ఎలా చూస్తున్నావు అంటూ చెక్ చేసేవారు.

కోమలి మాత్రం కోడలు ఎలా అంటే అలా ఉన్నది. జీవితాలు తిరుగబడ్డాయి.

నానాటి బ్రతుకు నాటకము అన్న కీర్తనలో శ్రీ అన్నమయ్య శ్రీ వేంకటేశ్వరస్వామి కీర్తన సారం అర్థం చేసుకుంటే జీవితము సుగంధ పరిమళం అవుతుంది.

ఈ రోజుల్లో మగపిల్లాడి పెళ్ళికి కూడా తల్లితండ్రులు ఆవేదన పడుతున్నారు.

ఆనాడు ఆడపిల్ల అయితే అడిగి చేసుకునేవారు. ఈనాడు మగపిల్లాడిని అడిగి చేసుకునే పరిస్థితి వచ్చింది. అలా అడిగితే లోకువ అవుతాడు పిల్లాడు, ఆడపెత్తనం అవుతుంది. అందుకని తల్లితండ్రి బాధపడుతున్నారు.

నీతో చదివిన నీ క్లాస్‌మేట్‌ని, కొలీగ్‍ని ఏరుకోరా అంటే అంతా అలా చేసుకోలేరు కదా! ఓ మంచి కోసం ఆలోచిస్తే అది నేడు వెర్రి విధానంలోకి వచ్చింది. పిల్లల్ని కనగానే సరికాదు.

వాళ్ళని అందంగా జాగ్రత్తగా పెంచి, మంచి పద్దతులు నేర్పి, మంచి అలవాట్లకు దగ్గర చేస్తూ, కాలానుగుణంగా వాళ్ళని మలచుకుంటూ ఉండాలి. అప్పుడు జీవితము బాగుంటుంది.

ఆ తరంలో పెళ్ళి అంటే అటు ఏడు వంశాలు, ఇటు ఏడు వంశాలు చూసేవారు.

ఇప్పుడు వారం రోజుల్లో పెళ్ళి చూపులు, పిలుపులు మెయిల్ మెసేజ్‌తో అయిపోతోంది. వెడ్డింగ్ కార్డు ఏమీ ఉండదు. అతి తొందరగా పెళ్ళి! పిల్ల నచ్చింది, అంతే పిల్లల్ని చెప్పారు చాలు అందులో ఏరుకుని పెళ్ళి చేసుకోవడమే పెద్దవాళ్ళ సంప్రదింపులు అంతా చాదస్తంగా వుంటాయి.

అయినా ఆ పద్ధతి చాదస్తం మాటలు ఏమిటి?

***

కోమలి తన స్నేహితురాలి మాటల్ని గుర్తు చేసుకుంది.

మొన్న మాకు తెలిసిన అమ్మాయి పెళ్ళయింది. తండ్రి లేడు. తల్లి ధనవంతురాలు. గొప్ప కబుర్లు చెప్పి కుదిర్చింది. పెళ్ళి కూతురు అన్న వదిన అక్క, బావ, కెనడా నుండి వచ్చారు.

ఆడపెళ్ళివారు ఎవరిని పిలవలేదు. మగపెళ్ళివారు ఓ పాతిక మంది వచ్చారు. అన్నంలో బంగారు రేకులు వెండికంచంలో భోజనం అన్ని హోటల్ వారే పురమాయించి ఇచ్చారు. ఇప్పుడు ఆకులు, పేపర్ ప్లేట్లు కాదు హోటల్స్ వెండి కంచం భోజనం వచ్చింది.

ఆధునిక యుగంలో ఆవిర్భవించిన అతి గొప్ప భోజనాలు వచ్చాయి. పిండి కొద్ది రొట్టె ఇప్పటి ఫ్యాషన్. అంతే కాదండీ పెద్దలు ఉంటే వాళ్ళు ఇంటి కాపలా ఉండాలి. ఆధునిక పెళ్ళిలో పెళ్ళికొడుకు వారి తల్లిదండ్రులు ఇప్పటి పెళ్ళి ఫ్యాషన్ ఇంట్లో ఏమీ ఉండదు. అన్ని హోటల్లోనే, హైటెక్ పెళ్ళి, హనీమూన్ విదేశాలలో, చలో విదేశం.

బంధువులు కూడా ఎవరూ రారు. అందరూ జూమ్ లోనో, వెబ్‍లోనో చూడటమే. పెళ్ళి ఇదే ప్రపంచము. క్రెడిట్ కార్డ్స్, వీసా, పాస్‌పోర్ట్ అనే జీవితము. పెళ్ళి అవడానికి ఇప్పుడు ఎక్కడా పెద్దల మాటలు, పెత్తనాలు లేవు.

వాళ్ళకి నచ్చితే ఇష్టం ఉంటే మూడు మీటింగ్‍లు, ఆరు కాఫీ హౌస్‍లు అంటూ నిర్ణయం చేసుకుని అప్పుడు పెద్దవారితో సంప్రదించి తీసుకుంటున్నారు. చక్కగా పెళ్ళికి ముందే పెళ్ళి కూతురు పెళ్ళి కొడుకు చక్కగా వాళ్ళకి కావల్సినవి వారే కొనుక్నుని సెటిల్ అయ్యాక అప్పుడు పెళ్ళి చేసుకుంటున్నారు.

ఇది ఎంతో మంచి పద్దతి. పెద్దవాళ్ళ వస్తువులు వేరు, చిన్న వయసు వారీ రకంగా జీవితాలు చక్కగా సరిదిద్దుకుంటున్నారు.

దూరం సంబంధాలు అయినా ఎంతో అన్యోన్యతగా జీవిస్తున్నారు. కానీ కొందరు పెద్ద వయస్సులో పెళ్ళి అయినా అమ్మనాన్న ఇష్టం అని, అక్క చెప్పినట్లు వినాలి – అంటూ పెద్దలకు పెత్తనం అంటూ ఇంట్లో వాళ్లకు భయపడుతూ కట్టుకున్న భార్యను విమర్శిస్తూ ఉంటారు. దానివల్ల యువత జీవిత సమస్యల పాలవడమూ, పెద్దవాళ్ళు వాళ్ళ జీవితాలు గడుపుకునే పరిస్థితి వున్నది.

పెళ్లి అనేది రెండు కుటుంబాల మధ్య ఆప్యాయత తేవాలి. కానీ ఈర్ష్య, ద్వేషం పెంచుకోకూడదు. ఎంత ప్రేమగానో ఉండాలి, అంతేకాని జీతం, బత్తెం లేని పని మనిషిలా చూడకూడదు.

కోడలు అనే పదానికి అర్థం లేని చోట ఎంత సేపు పరాయి పిల్లగానే చూస్తారు. వంట చెయ్యడం కోసం పెళ్ళిలా ఉంది. ఘనంగా కట్నం తెచ్చిన, జీతం బత్తెంలేని పనిమనిషి, వంటమనిషి, అన్నీ వండి వార్చాక ఎదురింటి ప్రక్కఇంటి, కింద ఇంటి వెనుక ఇంటి వాళ్ళు వచ్చి డబ్బాలు సర్దుకు వెడతారు. కోడలికి రాత్రికి కూరగాని పులుసుగాని ఉ౦డదు. కూతురుకి పులుసు, మనుమడుకి ముద్ద కూర కొడుక్కి కందిపొడి, చింతకాయ పచ్చడి, గోంగూర, మాగాయ పచ్చడి చాలూ అంటూ రాగాలు తీస్తూ మాట్లాడుతుంది అత్తగారు.

ఆనాటి పెళ్ళిళ్ళల్లో పెద్దల పెత్తనం, మధ్యవర్తుల సమర్థింపు వుండేవి. ఒకరికొకరు ఆప్యాయత పంచేవారు.

అబ్బే ఇప్పుడు మధ్యవర్తులు లేరు, పెద్దల పెత్తనం లేదు. వాళ్ళ ఆలోచన ప్రకారం జీవితము.

సుమకి ఒక కూతురు, కొడుకు. భర్త పెద్ద ఆఫీసర్ మంచి పేరు ఉన్నది. కొడుక్కి ముందు పెళ్ళి చేశారు.

నాకు చాలా ఆస్తి ఉన్నది. నా భర్త బిజినెస్ చేసి ఎదగాలి, అని అమ్మాయి భర్తను ఒక పెద్ద కాంట్రాక్ట్ చెయ్యమని ప్రోత్సాహిస్తూ మంచి ఖరీదయిన ఇల్లు అన్ని ఏర్పాటు చేసుకున్నారు.

అయితే ఆమెకు జీవితంలో గొప్పగా ఘనంగా ఉండాలి, అని ఖరీదయిన నగలు, బట్టలు గృహ అలంకరణలు అన్నీ పెట్టింది.

అత్తగారికి ఇది నచ్చలేదు. కోడలిపై పెత్తనం చేస్తే కొడుకు ఒప్పుకోడు.

“నువ్వు పిసినారి దానివి. ఇలా అయితే మాకు కుదరదు. దానికి నచ్చినట్లు దాన్ని ఉండమని చెప్పాను” అన్నాడు.

“ఇంకా పెళ్ళికావాల్సిన పిల్ల ఉన్నది. దాని సంగతి చూడాలి” అని చెప్పింది సుమ.

“అయినా నా వంతు వాటా మాత్రమే నేను ఖర్చు పెడుతున్నాను. దానికి తొందరగా పెళ్ళి చెయ్యండి” అని చెప్పేవాడు. ఆ పిల్ల ఇంట్లో గొడవలకి ఉండలేక వేరే హాస్టల్లో ఉండి పి.జి. చేసి ఆస్ట్రేలియా వెళ్ళిపోయింది.

పెళ్ళి చేస్తాం రమ్మంటే రాదు.

చివరికి తల్లి అమ్మమ్మ తాత వెళ్ళి అక్కడ కూర్చుని సంబంధం కుదుర్చి పెళ్ళి చేశారు. రెండేళ్ళు అక్కడ ఉండి ఎంజాయ్ చేసి ఇండియా వచ్చేశారు. డబ్బున్న వాళ్ళు ఎక్కడ ఉన్నా సుఖపడతారు.

వాళ్లకి కావాల్సిన విధంగా ఉంటారు. ఇంకా గొడవలు ఎలా వస్తాయి రావు ఎవరో ఒకరు జీవితానికి మంచి పునాది వేసుకుని కుటుంబాన్ని సమమార్గంలో సవ్యంగా అన్ని చూసుకుంటూ నడపాలి.

***

ఇలా కోమలి రకరకాల అనుభవాలతో తన కొడుకు కిరణ్ పెళ్ళికోసం నానా రకాలుగా తంటాలు పడి ఊబకాయము తగ్గించి పెళ్ళికి రెడీ చేసింది.

కొడుకు పెళ్లి విషయంలో తల్లిగా ఎంతో ఆతృత చెందింది. భర్త మాట, అత్తగారు చెల్లనివ్వదు. పూర్వకాలం మాదిరి ఎప్పుడు ఉండాలి అంటే ఇప్పటి తరం వాళ్ళు ఉండరు. వండలేకపోతే నడు హోటల్‍కి అంటారు. సరే అంటూ తీసుకెళ్ళాలి అంతే కానీ డబ్బు అయిపోతుందంటే కుదరదు. అలా అంటే వాళ్ళు ఆన్‍లైన్‍లో ఆర్డర్ చేసి తెప్పించుకుని భోజనం చేస్తారు.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here