మనవడి పెళ్ళి-4

0
2

[శ్రీమతి నారుమంచి వాణీ ప్రభాకరి రచించిన ‘మనవడి పెళ్ళి’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము.]

[కోమలి స్నేహితురాలు రూప విశాఖలో ఉంటుంది. ఆమె యోగా టీచర్. కోమలి అత్తగారి ఆంక్షల వల్ల రూప దగ్గరకి వెళ్ళి యోగా నేర్చుకోడానికి వీలవదు. కొడుకుకి యోగా వీడియోలు చూపిస్తూంటుంది కోమలి. రూప భర్త డాక్టర్. తను హాస్పిటల్‍కి వెళ్ళేటప్పుడు రూపని యోగా సెంటర్‍లో దింపుతాడు. క్లాసులు పూర్తయ్యే సమయానికి వచ్చి ఇంటికి తీసుకువెళ్తాడాయన.  పెద్ద ఆదాయం రాకపోయినా, తన వ్యక్తిత్వం కోసం ఈ యోగా సెంటర్ నడుపుతుంది రూప. యూట్యూబ్‍లో, సోషల్ మీడియాలో యోగా వీడియోలు పోస్టు చేస్తూ మంచి పేరు తెచ్చుకుంది రూప. ఇలా కోమలి రూప గురించి తల్చుకుంటున్న సమయంలో కాంతమ్మ వచ్చి, వంట ఏం చేస్తున్నావని కోమలి అడుగుతుంది. కోమలి చేయదల్చుకున్న వంటలు కాకుండా – వేరేవి చెయ్యమని పురమాయిస్తుంది. ఇలాంటి ఆరోగ్యానికి హితవు కాని వంటలతో కొడుకుని పాడుచేస్తోందని భర్తతో మొరపెట్టుకుంటుంది కోమలి. రూప కొడుకు నార్మల్‍గా ఉంటాడు. ఇంజనీరింగ్ చదువుకుని బిజినెస్ చేస్తుంటాడు. రూప మేనకోడలు దుబాయ్‍లో ఉంటుంది. తెలుగు సంగీతం నేర్చుకోవడం వచ్చి కొన్నాళ్లు రూప దగ్గర ఉంది. ఆ అమ్మాయికి బావని చేసుకోవాలని కోరిక, కానీ కాస్త లావుగా ఉండేసరికి, తాను చేసుకోనంటాడు. ఆ అమ్మాయి రూప దగ్గర యోగాసనాలు నేర్చుకుని స్లిమ్ అవుతుంది. త్వరలో వాళ్ళ బావని చేసుకోబోతోంది. ఆ అబ్బాయితో తన కొడుకు కిరణ్‌ని పోల్చుకుంటుంది కోమలి. ఎగ్జిబిషన్‍లో పరిచయమైన కృత్తికని వివరాలు అడుగుతుంది. తనకి మిలట్రీలో పనిచేసే బావ ఉన్నాడనీ చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. కిరణ్‍కి పెళ్ళిళ్ళ పేరయ్య ఓ సంబంధం తెస్తాడు. ఆడపెళ్ళివారు ఎన్ని షరతులు పెట్టినా కోమలి ఒప్పుకుంటుంది. అయినా ఆ సంబంధం కుదరదు. కోమలి నానా తిప్పలు పడి కొడుకు స్థూలకాయాన్ని తగ్గించి, పెళ్ళికి సిద్ధం చేస్తుంది. – ఇక చదవండి.]

అధ్యాయం-8

[dropcap]కో[/dropcap]మలి స్నేహితురాలు మైత్రేయి కుటుంబంలో అంతా లావుగా ఉండేవారు. వాళ్ళ అమ్మకి మీటరన్నర ఉంటే కాని జాకెట్ అవదు. ఏవైన పెట్టుబడి ముక్కలు మూడు ఒక రంగు అయితే జాకెట్ కుట్టుకునేది. ఇంట్లో మిషన్ ఉన్నది. వీళ్ళు ముగ్గురు ఆడపిల్లలు ఒక చీర చింపి గౌన్లు కుట్టుకునేవారు.

టైలర్‌కి ఇస్తే దిష్టి అని చెప్పి అంత లావుగా ఉన్నారనే బట్టలు కుట్టేది. అందరికి కంచాలు పెట్టకుండా ఒక పెద్ద బేసిన్‍లో అన్నం పెట్టి పళ్ళాల్లో పెట్టి తినమనేది. కలిపి తినకుండా పారేస్తారు అనేది. ముగ్గురు తరువాత నాలుగవ వాడు పిల్లాడు పుట్టాడు.

వాడిని అక్కలంతా అబ్బరంగా పెంచారు. చదువులు ఇంటర్‍లో ఆపేసి పెద్ద పిల్లకి పెళ్ళి చేసారు.

మూడవది మైత్రేయి. ఇది కొంచెం బ్రతిమాలి డాక్టర్ చదువుతాను అని సైన్స్ గ్రూపు పుచ్చుకొని చదివింది.

కాని ఎంసెట్‍లో మంచి ర్యాంక్ రాలేదు. వేరే రాష్ట్రంలో సీటు వచ్చింది. వాళ్ళ అమ్మ ఒప్పుకోలేదు.

“ఇంత చదువు చదివాక పెళ్ళి తప్పదు. పెళ్ళి అయ్యాక హాస్పిటల్ కట్టించి ఇవ్వాలి. అవసరం లేదు, డాక్టర్‍కిచ్చి చేద్దాము, ఆ డబ్బు ఖర్చుకూడా పెళ్ళికి ఖర్చు పెట్టి మంచి సంబంధం చేద్దాము” అన్నది.

“అబ్బే అలా ఎందుకు? డాక్టర్ అంటే చాలా కట్నం ఇవ్వాలి. ఇచ్చాక వాళ్ళు ఇది డాక్టర్ కాకపోతే వాళ్ళు చిన్నచూపు చూస్తారు. అప్పుడు ఆ ఇంట్లో వంటమనిషి, పనిమనిషి అవుతుంది. అప్పుడు బాధపడేది మన పిల్లే కదా! మిగిలిన వాళ్ళు చదువుకుని ఉద్యోగాలు చేస్తారు. దీన్ని ఇంటిపనిలో కుక్కుతారు” అంటూ ఇంట్లో పెద్దలు ఆలోచించి ఒక పెద్ద కంపెనీలో మెడికల్ ఆఫీసర్‌కి ఇచ్చి పెళ్ళి చేసారు.

అందరూ ఇంట్లో సంతోషపడ్డారు. కారణం మంచి కుటుంబంలోకి పిల్ల వెళ్ళింది. పెళ్ళికి వచ్చిన అందరూ కూడా మెచ్చుకున్నారు.

ఎంత చదివినా పెళ్ళి, పిల్లలు అన్నది ఏదీ కూడా తప్పదు. ఆడది అంటేనే మాతృమూర్తి. పెళ్ళి అయి ఏడాది అయ్యింది. కాని ఇంకా పిల్లలు లేరు అంటూ ఆ ఇంటి ముసలమ్మ పోరు పెట్టింది.

మొత్తానికి మందులు మింగించి పిల్లని కనిపించారు. ఇందులో ఆడపిల్ల అసంతృప్తి. ఓ ఏడాది గడిచాక మళ్ళీ ఆడపిల్ల పుట్టింది. ఇంట్లో వాళ్ళకి మళ్ళీ అసంతృప్తి “ఆరోగ్యం సరిగా లేదు. ఇంకా చాలు” అంటూ భర్త సహకారం సహాయంతో పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించారు.

కానీ అత్త వారింట్లో అసహనం, కోపం రగులుతూనే ఉన్నవి. ఆ ఇంట్లో ముసలామె వల్ల మైత్రేయి భర్త రావు కూడా సఫర్ అయ్యాడు.

“నీకు ఆస్తి ఇవ్వను, నాకు మొగపిల్లలు లేక నిన్ను తెచ్చుకుని పెంచుకున్నాను. కనుక మీ పిన్ని, మీ అమ్మ కూడా నాతో పోట్లాడారు. వాడు మాత్రమే కొడుకా! మిగిలిన వాళ్ళు పిల్లలు కాదా! అంతా సమంగా ఆస్తి తింటారు” అంటూ ఆమె ధ్వజం ఎత్తి అల్లరి చేసింది.

ఈలోపు రెండవ పిల్లకి నాలుగు ఏళ్ళు వచ్చాయి.

“ఇప్పుడు శరీరంలో బలం వస్తుంది. మళ్ళీ తిరిగి పిల్లలు పుట్టడానికి ఆపరేషన్ చేయించండి. లేకపోతే మీ పిల్లని మీ ఇంటికి తీసుకెళ్ళిపోవాలి” అని ముసలమ్మ పట్టుబట్టింది.

ఇంకా చేసేది ఏమటి?

రావు మెడికల్ ఆఫీసర్ కనుక నలుగురు డాక్టర్స్‌ని సంప్రదించి మళ్ళీ ఆపరేషన్ చేయించాడు.

అదృష్టం కొద్దీ మగపిల్లాడు పుట్టాడు. కానీ వాడు రెండు కాళ్ళు ముందుకు పెట్టి మడత పెట్టినట్టు పుట్టాడు. మళ్ళీ పిల్లాడికి కాళ్ళు సరిచేసి సర్ది మందులు వేశారు.

వాడి గురించి రావు బెంగ పెట్టుకున్నాడు.

“పర్వాలేదు. మీకు భయం వద్దు. పిల్లాడికి ఏడాది వచ్చేటప్పటికి అన్ని సెట్ అవుతాయి. పిల్లాడు చేత డాన్స్ చేయించే పూచి నాది” అన్నాడు డాక్టర్ గారు. సరే అని సంతృప్తి చెందారు.

ముసలమ్మ శాంతించింది. ఆస్తి మళ్ళీ వెనక్కి ఇవ్వడానికి అంగీకరించింది.

అధ్యాయం 9

ఇది ఆస్తి పెళ్ళా అంతస్తుల పెళ్ళా? ఇలా మగపిల్లాడు పుట్టుక కోసం ఇన్ని ఆరాటాలు పడి పిల్లాడిని పెంచింది.

వాడు పెద్ద ఆరోగ్యంగా ఉండేవాడు కాదు. చిన్నప్పుడు అక్కలు ఇద్దరు అతి ప్రేమగా జాగ్రత్తగా పిల్లాడిని పెంచారు.

ఆడపిల్లలు ఇద్దరు కూడా బాగానే చదివారు. పెద్దది ఎం.టెక్‍లో చేరింది.

మైత్రేయి తను చదువుకోవాలన్న కోరిక తీరక, పెద్దలు పెళ్ళి అనడంతోనే తన చదువు ఆగిపోవడం వల్ల, తన పిల్లలు ఎంతో ఉన్నతంగా వారు చదవాలి, వారు అనుకున్నదంతా చదివించాలని తన భర్త దగ్గర పట్టుబట్టింది.

రావు “అలాగే వాళ్ళ ఇష్టం. వాళ్ళ చదువు ఎలా కావాలంటే అలా చదువుకోమను” అన్నాడు.

రెండవది పాలిటెక్నిక్‍లో చదువుకుంది. కళల్లో ఇంట్రస్ట్‌ ఉండడంతో మళ్ళీ నిఫ్ట్‌లో చేర్పించి చదివించారు.

ఆడపిల్లల్ని మంచి సంబంధాలు అనుకున్నవి చూసి పెళ్ళి చేశారు. రెండో పిల్ల ఇంటిపట్టున ఒక బట్టల వ్యాపారం మొదలు పెట్టింది. భర్త కాలేజ్‍లో పని చేస్తాడు. షేర్ మార్కెట్‍లో ఇన్వెస్ట్ చేస్తాడు. అందులో డబ్బు బాగానే వస్తోంది.

నెలకి ఖర్చులు పోను యాభైవేలు బిజినెస్ లో మిగులుతోంది. భర్త సంపాదన లక్ష మిగులుతుంది చాలు అనుకున్నారు.

***

పెద్ద పిల్ల జీవితంలో ఎన్నో బాధలు వచ్చాయి. అందుకు ఫీల్డ్ వర్క్‌లో బిజి, ఆమెకి ఇంట్లో సమయం ఎలాగా కూడా గడవదు. అందుకు మళ్ళీ పరిశోధనలో చేరింది.

భర్త సరే అన్నాడు. కానీ ఇంట్లో వాళ్ళు ఊరుకుంటారా!

ఊరుకోరు, గొడవ పెడతారు.

ఇంకా పరిశోధన పూర్తి చెయ్యాలని దృఢ సంకల్పంతో పరిశోధన పూర్తి చేసింది.

భర్త గల్ఫ్ వెళ్ళిపోయాడు.

డబ్బు సంపాదనకు అలవాటు పడి మనిషి జీవితాన్ని మరచిపోతున్నాడు. భార్యపిల్లలు అన్ని కూడా డబ్బు ముందు ఏమీ కనబడటం లేదు.

ఆ పిల్ల ఉద్యోగానికి వెళ్ళి సెటిల్ అయ్యింది.

కాలమే అన్నీ సజావుగా పూర్తి చేస్తోంది.

కాలం ముందు అంతా సమానమే! వినమ్రంగా ఉండాలి. కంగారు పడకూడదు.

మనం ఓర్పు నేర్పుతో వేచి ఉండాలి. కంగారు పడి ఏమి చెయ్యలేము.

పెళ్ళి విషయంలో ఆడపిల్ల వాళ్ళు ఎంత ఒదిగి ఉన్నా మగ పెళ్ళి వారు అహంతో ఉంటే ఏమీ చెయ్యలేము.

వాళ్ళు కావాలని కాళ్ళు దువ్వి మాటలు అంటే ఏమి జరుగుతుందో ఎవరికి తెలియదు. చెప్పే సామరస్యం చెయ్యాలి. అంటే వారు ప్రతి దానికి అడ్డంవస్తూ అవేశంగా మాట్లాడుతూ పరుషంగా మాట్లాడితే ఏమి చెయ్యగలరు. అని బాధపడేవారు.

ఆస్తి ఉన్నా సరైన సంబంధాలు రాక వచ్చిన సమస్యలు వచ్చినపుడు ఎవరి మాట వినరు. మధ్యలో కలుగ చేసుకుని తంటాలు తెచ్చి పెట్టుకోవడమే అని అర్థమవుతుంది.

కాలానికి జీవితం వదిలి పెట్టారు. అతి గారం అనర్ధదాయకంగా ఉంటుంది. ఇది ఏం తెల్సు అయిన ఎవరూ పాటించరు కదా! అయినా రావుకు పిల్ల గురించి బెంగ, పిల్లాడు లేకలేక పుట్టాడు. వాడి పెళ్ళి గురించి బెంగ పెట్టుకున్నాడు.

రావు కొడుకు కూతుళ్ళు కూడా మంచి పుష్టి కలిగి పర్సనాలిటీగా ఉంటారు. వాళ్ళకి తగిన భర్త లేక భార్య దొరకడం కష్టమే.

మైత్రేయి పెళ్ళి అయ్యాక రావు చాలా రకాల బిళ్ళలు స్లిమ్ అవడానికి వాడేవాడు. అలాగే ఆహారం కూడా పద్దతిగా వండించి తినేవాడు. స్థూలకాయం వాళ్ళకి పుట్టుకతో వచ్చేదే, అనువంశికము. అందుకని ఏ మందులు వాడినా కూడా పనిచెయ్యలేదు. అలాగే లావుగానే ఉండేవారు. జీవితంలో అల్లుళ్ళు కూడా వచ్చేశారు. ఎన్నో ఆనందాలు ఎదురు దెబ్బలు మనిషి జీవితంలో తప్పవు.

కొందరికి అన్ని బావుంటాయి. అది వారి తెలివి అనాలా! అదృష్టం అనుకోవాలా!

మీరే చెప్పండి. వేసిన అడుగు అందంగా పడుతుంది. అందరూ ఒకే బాటలో ఉన్నా కొందరికి పూలు వాసన, కొందరికి రాళ్ళు తగులుతూ ఉంటాయి. ఎవరి అదృష్టం వారిది.

అందరూ సజావుగా ఉండాలనే అనుకుంటారు. కానీ విధి నిర్ణయం పరిస్థితులు మనిషిని మార్చేస్తాయి. కనుక ఇందులో అసలు అప్పు ఎవరిది? కాదు అని చెప్పాలి. అందరూ మంచి వాళ్ళే కదా మరి! జీవితం ఎప్పుడు పథంలో ముందు వచ్చే ఆనందము.

అధ్యాయం 10

మనిషి జీవితం కూడా మర్రి వృక్షం లాంటిదే!

వేళ్ళు అడుగుకు వెళ్ళి అతుక్కుని చెట్టుని పటిష్టం చేస్తాయి. అయితే ఊడలు వేళ్ళు ప్రక్కల నుంచి కొమ్మలకు పుట్టి మరింత బలాన్ని ఇస్తాయి.

లోపలి వేళ్ళు కనిపిచవు. బయటివేళ్ళు కనిపిస్తాయి. వాటిని అందరూ గొప్పగా చూస్తారు.

అలాగే మంచితనం ఉన్న మనిషి లోపలి వేళ్ళల్లా అణుకువగా వుంటారు. కాని పై వేళ్ళు మెప్పువాటికి అతగా ఉండక పోయినా పర్వాలేదు. అలాగే స్త్రీ జీవితం కుటుంబం కోసం ఎంతో కష్టపడి ఉన్నతికి తెచ్చినా పేరు మాత్రం భర్తదే. భార్య ఒక అజ్ఞాత వ్యక్తిగా కుటుంబాన్ని సరైన పద్ధతిలో నడిపి రైలు గార్డులాంటిది. ఆమె ఒక కంట్రోలర్ అని చెప్పాలి.

ఆమెను బట్టి కుటుంబం ఉంటుంది. అయితే కుటుంబంలో అంతా సహకరించాలి. అత్త మాట, భర్త, ఆడపడుచు మాట అందరూ వింటేనే పచ్చ జెండా విలువ.

అది తెలుసుకుంటే కుటుంబాలు ప్రగతి ప్రతిభగా ఉంటాయి. కాదా మరి మీరు కూడా సదా ఆలోచించి, చెప్పాలి. అందరికీ ఓకేనా.

పిల్లల పెంపకాన్ని బట్టి జీవితాలు ఉంటాయి అంటారు. అది కూడా నిజమే పద్ధతిగా పెరగడం మంచిది. ముఖ్యంగా మగపిల్లల్ని ఎక్కువ జాగ్రత్తగా పెంచుకోవాలి.

వాళ్ళకి స్థిర చిత్తం తక్కువ. ఎదుటి వారిని చూసి అనుకరణం ఎక్కువ. నా ఫ్రెండు అలా ఉన్నాడు, ఇలా ఉన్నాడు అంటారు.

అప్పుడు తల్లి చెప్పినా కూడా, తండ్రి బాగా అన్ని విషయాల కోసం శ్రద్ధ వహించి చెప్పాలి.

స్కూలుకి వెళ్ళడం మొదలు వీరికి చాలా మార్పు వస్తూ ఉంటుంది. తన జీవితాన్ని ఎదురు వారుతో పోల్చుకుని అన్నీకూడా వాళ్ళలా చెయ్యాలని అనుకుంటారు.

ఆనందం, భయం, కోసం, సంతృప్తి, అసంతృప్తి కూడా వ్యక్తపరుస్తారు. కొంత వరకు వారికి నచ్చినట్లు మాట్లాడుతారు. వారిని సంతృప్తిపరచి మన ఇంటికి, వారి ఇంటికి తేడా నచ్చచెప్పాలి. అప్పుడే వారు వారి అమ్మనాన్నతో తృప్తి పడతారు. ఆ సర్దుబాటు చెయ్యడానికి తల్లిదండ్రి ఇద్దరు ముఖ్య పాత్ర వహించాలి.

మనకున్న జీవితాన్ని మనం ప్రేమించాలి, గౌరవించాలి. అది లేదు, ఇది లేదు. అధి తక్కువ. ఇది ఏమిటి? అనుకోకూడదు. ఇదే జీవితము కదా!

సూర్యోదయము మొదలు మనిషి జీవితంలో ఎన్నో పరుగులు.

మనీ కోసం మంచితనంతో పరుగులు. ప్రపంచం అంతా కలిసి ఆర్థిక స్థితిగతుల వైపు ఆకాశ వీక్షణం. ప్రతిక్షణం ఎంతో ఆలోచన. ఎన్ని మంచి స్నేహాల అనుభవాలు అనుభూతులు. జీవితమంతా చందన సుగంధ పరిమళ భరితమైన ఆశలు ఆశయాలు ఆదాయాలు.

ఒకదాని వెంట మరొకటి మెరుపు తీగల్లా, మరపురాని అనుభూతులు, అనుభవాలు పరంపరలో ఎన్నో ఆధారంగా ఆరు పదుల జీవితము మనకు భగవంతుడు ప్రసాదించిన వరము.

***

మైత్రేయికి సాహిత్యమంటే ఆసక్తి. ఎక్కడ పేపర్ కనిపించినా చదువుతూనే ఉంటుంది.

సూర్యోదయం మొదలు
మానవునికి ఆర్థిక వికాసం
ఎన్నో ఎన్నెన్నో మార్గాలు
అపురూప సంపాదనకు
అద్భుత ఆవిష్కరణలు
విభిన్న ఉద్యోగాలు వినూత్న
ఉపాధి పథకాలు అమలు!
అదే మానవ గతి, ప్రగతి
ఎంత చెట్టుకు అంతే గాలి
ఎన్నో పూలు అంతే ఫలాలు
కాదేది అనర్హం ఆర్థిక అంశాలు
ఉపాధి మార్గంలో ఎన్నో జయ విజయాలు
సాధించిన స్పూర్తి!
ఎందరో మహానుభావులు
ప్రతి వ్యక్తి నుంచి విజ్ఞాన సుజ్ఞాన ప్రజ్ఞానాలు
మహా జ్ఞానాలు కాక కేవలం ఆర్థిక జ్ఞానమే
మానవ అవసరాలు ఆర్థిక వికాసం కోసం ఎన్నో మార్గాలు
వెతుకులాట, కానీ మానవ ప్రగతికి మనోవికాసం
ఉత్తమ మార్గం ఎదుటి వ్యక్తిలో
విశ్లేషణలు విమర్శలు కాక
మంచి భావాలు ఉన్నత వ్యక్తిత్వం ఆదర్శంగా
ఎంచుకుని సూచికలు సూచనలు అందిస్తూ
స్నేహ పరిమళాలు పెంపొందిస్తే
చందన వృక్ష పరిమళ స్నేహం
మానవ విజ్ఞానానికి శ్రీకారం
మానవ విజ్ఞానికి శ్రీకారం
శుభకరము, మనోవికాసానికి
భావితరాల ఉన్నతికి మార్గం
అదే మహోదయం! ఉదయం
మానవ విజయ స్ఫూర్తి కీర్తి!

~

ఓ పేపర్‍లో రాసినది చదివి నిట్టూర్చింది.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here