Site icon Sanchika

మంచి చెడుల నిర్ణయం

సంగమయ్యకు ఒక కోడి, పిల్లి పెంపుడు జంతువులున్నాయి. కోడికి పిల్లికి ఎప్పుడూ పడదు కదా! అస్తమానం కొట్లాడుకుంటూ ఉండేవి. ఒకరోజు పిల్లి కోడి మెడను గట్టిగా పట్టుకుంది. అది చూసిన సంగమయ్య కోడి మెడను పిల్లి వదిలి పెట్టాలనే ఉద్దేశ్యంతో తన చేతిలో ఉన్న చిన్నపాటి కర్రను పిల్లిపై విసిరాడు. ఆ కర్ర విసురుగా వచ్చి పిల్లికి దెబ్బ తగలడంతో అది వదిలి పెట్టేసింది. ఇక అప్పట్నుంచి పిల్లి కోడి జోలికి పోకుండా తన పనేదో తాను చేసుకోసాగింది.

కొన్ని రోజుల తరువాత సంగమయ్యకు పంటలు బాగా పండటంతో ధాన్యం బస్తాలు తెచ్చి ఇంట్లో ఒక గది నిండా భద్ర పరిచాడు. ధాన్యం ఉంటే ఎలుకలు చేరి కొట్టేయడం సహజమే కదా. అలా బస్తాల్లో ఉన్న ధ్యాన్యానంతా ఎలుకలు తినేయడం మొదలు పెట్టాయి. అది చూసి పిల్లి రాత్రిళ్ళు మేలుకొని ఎలుకలను పట్టేయడం యజమాని సంగమయ్య గమనించి పిల్లిని ఒడిలోకి తీసుకుని తనకు మేలు చేస్తున్నందుకు ప్రేమగా దాని తల నిమిరి పాలు తాగించాడు.

ఇక్కడ ఒక విషయం గమనించాలి ఆ పిల్లి, కోడి మెడ పట్టుకున్నప్పుడు యజమాని చేతిలో దెబ్బలు తిన్నది. ఎలుకలను పట్టుకున్నప్పుడు ప్రేమించబడింది. దీనికి కారణం సంగమయ్య కు కోడి వల్ల లాభం, ఎలుకలు వల్ల నష్టం కాబట్టి. అట్లానే ఫలితాలను బట్టి మంచి చెడులు నిర్ణయించబడతాయని గ్రహించాలి.

Exit mobile version