Site icon Sanchika

మంచు తెమ్మెర తెర

[డా.టి.రాధాకృష్ణమాచార్యులు రచించిన ‘మంచు తెమ్మెర తెర’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]

ఆశల పల్లకిలో ఊరేగించిన
మాయాదర్పణ దృశ్య దర్పం జారే
హృదయ సీమల నుండి మెల్లగా

మనసు మాట నీటి బుడగ
నడక పడిలేచి పడే గాలి కెరటం
భరోసాల బతుకే గజిబిజి ఆగమాగం

అబధ్ధపు అందాలన్నీ రంగుల కల
ఎగిరిన చీకటి ఊహల బండలు
వాడిన పూలు రాలిన వోటుకుండలు

బతికిన మనిషి ఓ ప్రవాహం
కలలు తీపిబాధలు కలిసిన నదిలో
గుండె చప్పుడు రాస్తున్న కనులు

మెల్లమెల్లగా మటుమాయం
నిన్నటి మౌత్‌పీసుల అసత్య డైలాగ్స్
వేడి శ్వాస తాకగానే కరిగే
మంచు తెమ్మెర తెర నిశ్శబ్దంలో

Exit mobile version