మనుషుల్లో యాంత్రికత – యంత్రాలలో మానవ స్పందనలు

0
2

[box type=’note’ fontsize=’16’] వివిధ దేశాలలో వడివడిగా సాగుతున్న రోబోటైజేషన్ గురించి ఈ వ్యాసంలో వివరిస్తున్నారు ఆర్. లక్ష్మి. [/box]    

హాంకాంగ్‍లో రూపు దిద్దుకున్న హ్యుమనాయిడ్ రోబో ‘సోఫియా’ 50 రకాల భావాలను వ్యక్తీకరించగలదు. ముఖాలను, మనుష్యులను గుర్తించగలదు. 2015 నాటి చైనా తయారు చేసిన రోబో ‘జియా’ భావాలకు అనుగుణంగా కళ్ళను, మాటలకు అనుగుణంగా పెదవులను కదపగలదు.

2015 నాటి వాక్‍మన్‌కు అదనపు హంగులు కూర్చడం ద్వారా రూపొందించిన రోబో గ్యాస్ లీకేజీ లప్పుడు వాల్వులు కట్టడం, శిథిలాలను తొలగించడం వంటి పనులను చేయగలదు. ప్రోగ్రామింగ్ ద్వారా నిర్దేశించిన పనులన్నింటినీ ఈ రోబో చేయగలదు. ఇవే పనులను మనుషులు చేపట్టినపుడు వారికి అపాయం వాటిల్లే అవకాశం ఉంటుంది.

‘బెర్గ్ ఇన్‌సైట్’ నివేదిక ప్రకారం 2018లో 3,801 కోట్ల డాలర్లుగా ఉన్న రోబో పరిశ్రమ, 2023 నాటికి 6400 కోట్ల డాలర్లకు చేరుతుందని అంచనా.

2016లో 2.96 కోట్ల యూనిట్లుగా ఉన్న హ్యుమనాయిడ్స్ వాడకం 2026 నాటికి 26.43 కోట్ల యూనిట్లు కావచ్చని అంచనా.

జర్మనీలో పరిశ్రమలో ఇప్పటికే పదివేలమంది కార్మికులకు 310 వరకూ రోబోలు ఉన్నాయి.

2018లో చైనా కృత్రిమ మేధతో పని చేసే రోబో న్యూస్ ఏంకర్‍ను ప్రపంచానికి పరిచయం చేసింది. తరువాత ఆ న్యూస్ ఏంకర్‍కు మరిన్ని హంగులనూ జత చేసింది. ఇప్పుడు ఆ పురుష రూప న్యూస్ ఏంకర్ చేతుల కదలికల ద్వారా, ముఖంలో మరిన్ని భావాలను వ్యక్తీకరించడం ద్వారా వార్తలను చదవడంలో తన పాత్రను మరింత సమర్థవంతంగా నిర్వహించగలడు. అంతేకాకుండా 2019లో చైనా ఒక స్త్రీ రూప రోబో న్యూస్ ఏంకర్‍ను సైతం పరిచయం చేసింది. ఈ వార్తా చదువరి మనిషి ముఖంలోని భావ వ్యక్తీకరణలను, ప్రత్యేకమైన కదలికలను (మేనరిజమ్స్) నూరు శాతం ఖచ్చితత్వంతో అనుకరించగలదు.

ఈ రోబో న్యూస్ చదువరి – పొట్టిగా కత్తిరించి ఉన్న జుట్టుతో, చెవి రింగులతో, గులాబీ రంగు టాప్‌తో వీడియో తెరపై కనిపించింది. ‘గ్జిన్‍హువా’ వార్తా కథనాల చదువరి ‘క్యుమెంగ్’ ఆధారంగా ఈ స్త్రీ రూప రోబో రూపొందించబడింది.

చైనా కంపెనీ రూపొందించిన ఈ రెండు రోబోలు (ఇద్దరు?) సైదోడుగా చక్కటి హావభావాలతో బాడీ లాంగ్వేజ్‍తో, వార్తా కథనాలను వినిపించగలరు. రోబోల రూపకల్పనలో చైనా దూకుడు ఈ విధంగా ఉండగా, తానెంత మాత్రం తీసిపోననట్లు ‘శామ్‌సంగ్’ లాబొరేటరీస్ 2020 జనవరి 7వ తారీఖున ‘నియోన్’ నామాంకిత రోబోను ఆవిష్కరించింది. ఈ హ్యుమనాయిడ్ మనిషిలా ఆలోచించగలదు. మనిషిలా ప్రవర్తించగలదు. భావోద్వేగాలను మనిషి వలె వెలువరించగలదు. వీటన్నింటినీ మించి హిందీ మాట్లాడగలదు కూడా.

ఇలా రకరకాలుగా వివిధ దేశాలు రోబోటైజేషన్ దిశగా వడివడిగా సాగిపోతున్నాయి. మన దేశంలోనూ ఆ స్థాయిలో కాకపోయినా, చురుకుగానే అడుగులు పడుతున్నాయి. మేధ కృత్రిమమే కావచ్చు. కానీ AI ఆధారితంగా హ్యుమనాయిడ్ రోబోల రూపకల్పనలో ఇప్పుడు ఉన్న వడి, వేగాన్ని చూస్తే రానున్న కాలంలో మన వెనుక సీట్లోనో, పక్క సీట్లోనో తన పని తాను చేసుకుపోతూ, మనని చూడగానే విష్ చేసే సహోద్యోగి హ్యుమనాయిడ్ రోబో అయితే ఏ మాత్రం ఆశ్చర్యపోనక్కర లేదు. మనుషులు యంత్రాలతో పని చేయించడం దశ నుంచి యంత్రాలతో సహోద్యోగులుగా పనిచేసే రోజులు ఎంతో దూరం లేవు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here