మన్యం వీరుడా

0
3

[dropcap]ప[/dropcap]ల్లవి:
మన్యం వీరుడా మహనీయుడా
తెలుగు ప్రజల గుండెలో మాననీయుడా ॥2॥
కోరస్:
అల్లూరి సీతారామరాజా ॥3॥
చరణం:
దౌష్ట్యానికి లోబడని ధైర్యం వుండాలని
అన్యాయం ఎదిరించే సాహసం కావాలని
ఆత్మశక్తి, మాతృభక్తి మనిషికి అండయని
చాటి చెప్పిన ఘన చరిత్రుడా/ధీరోదాత్తుడా ॥మన్యం వీరుడా॥
కోరస్:
అల్లూరి సీతారామరాజా ॥3॥
చరణం:
గడ్డకాని గడ్డ మీద అడుగు పెట్టి తొడగొట్టి
దోపిడీ, దౌర్జన్యాలకు ఒడిగట్టిన
గర్వాన్ని దొరతనాన్ని దగ్ధం చేసినావు
భరతమాత శృంఖలాలు తెంచగ పూనావు ॥మన్యం వీరుడా॥
కోరస్:
వందేమాతరం…. వందేమాతం… వందేమాతం….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here