[dropcap]మ[/dropcap]రణాన్ని ఆహ్వానించలేని మనిషి
ఏనాడైన తప్పదు నీకు చివరి అంకం
నీవారందరూ తోడు ఉంటారని,
పెంచుకుంటావు ఏనలేని అప్యాయతలను,
అందంలం ఎక్కిస్తాయని ఆస్తిపాస్తులను
కానీ ఏవి రావు చివరికి నీ తోడు….
నీ శరీరం చితి మంటల్లో కాలడం తప్ప
అన్ని తెలిసినా ఆరాటం తప్పదు నీది
నాది అంటూ…
నీ చుట్టూ ఉన్నవారిని కసిరి కసిరి కొట్టకు
నీవు ఉన్నంత సేపు ఆఖరికి అందరి మజిలీ
ఒక్క చోటికే అని తెలుసుకో…..
చివరి మజిలీ కై నలుగురిని
సంపాదించుకో , మరణశయ్య పై నున్నా
గాని నలుగురి నోళ్ళల్లో నాను….
ఇది తెలిసిన మనిషికి జీవితంలో
సుఖం, సంతోషం, ఆంనందం నీ వెంటే
అప్పుడు మరణాన్ని కూడ ఆహ్వానిస్తావు
నీవు….
ఇదే ఇదే జీవితపు ఆఖరి మజిలీ