[dropcap]ఇ[/dropcap]ష్టానికి కష్టమోస్తే?
పగటి పగుళ్లుకు
కుప్పకూలిన రాత్రిలో
మౌనసంకెళ్ళతో
తీపి కలలన్నీ
కంటిలోనే బందీ..
మనసు మడుగులో
ఈత కొట్టే వ్యాపకాలన్నీ
వ్యసనాలై
ఆకారంలేని ఆచరణలో
నిరాకార మాటల
నిరంతర ముఖాముఖికి
సెగలు సెగలుగా
మరిగే ఇష్టం
కరిగే ముసురే జీవితం..