[dropcap]ని[/dropcap]ద్రలో,
నీరసం లో,
నిస్సహాయతతో ,
నిర్లక్షంగా,
మళ్ళీ,
ఈ ఉదయం వృధా చేయకు .
లే నిద్రనుండి మేల్కొ .
కూసే కోడి
విరిసిన పుష్పం
సడలిన చీకటి
ఏం చెబుతున్నాయ్ ?
నిను మేల్కొలుపు తున్నాయ్.
జ్ఞాణ జ్యోతిని వెలిగిస్తున్నాయ్
కర్తవ్యాన్ని ప్రభోదిస్తున్నాయ్
లే నిద్రనుండి మేల్కో
ఇది సమయం
ఇదే సమయం
విద్యార్ధివి నీవు
విద్యార్జన నీ కర్తవ్యం
ఎగిరే పక్షులు చూడు
ఉరికే సెలయేరును చూడు
ఎగసే ఆ అలలను చూడు
ఏం చెబుతున్నాయ్
తమలా పరిగెత్తమంతున్నాయ్ .
ఆగదు సమయం
నీకై
నిమిషం.
గడిచిన నిన్నను
తడిమి చూసుకో.
లక్ష్య సాధనకు
బాటను వేస్కో
నువు కాంచిన స్వప్నా లెన్నో
నెరవేరిన కోరికలెన్నో
లాభ నష్టాలు బేరేజు వేస్కో
వైఫల్యం ఎక్కడ వుందో
లేదా
వైఖరి లో తేడా వుందో
తేల్చుకో.
సౌధానికి పునాది వెయ్యు
భావితరాలకు బాటను వెయ్యు
భారతావనికి భావం నువ్వు
భారతమాతకు బిడ్డవు నువ్వు .
కోట్లల్లో ఒకడివి కాకు
కోటికి నువ్వొక్కడివే .
లే
ఇంకా ఆలస్యం దేనికి?
ఆర్జించు జ్ఞానాన్ని
అర్పించు భారతావనికి
లే ఇంకా ఆలస్యం దేనికి?
అస్తిత్వం నిరూపించుకో
లే
ఇంకా ఆలస్యం దేనికి?