కొవ్వలి, భయంకర్ పేరుతో రచించిన జగజ్జాణ ఆ కాలం పాఠకులను సమ్మోహితులను చేసింది. ఆనాటి జగజ్జాణను ఈనాటి పాఠకుల కోసం సరళంగా, సంక్షిప్తంగా అందిస్తున్నారు డా. సి.హెచ్. సుశీల.
కొవ్వలి లక్ష్మీ నరసింహారావు గారి నవలలు:
రచయిత్రి: వెయ్యిన్నొక్క నవల పేరేమిటండీ ?
కొ.ల.నా.: నాన్నగారి చివరి నవల వెయ్యిన్నొకటి ‘కవి భీమన్న’ అండీ. మా అమ్మగారికి అంకితమిచ్చారు. అది రాసిన తర్వాత ద్రాక్షారామం వెళ్ళాము. అక్కడే ఆయన శివైక్యం చెందారు. ఇప్పుడు వారి నవలలు చాలావరకు అందుబాటులో లేవు. కొన్నింటిని మేము వివిధ ప్రచురణ కర్తల ద్వారా వంద వరకు పునర్ముద్రించగలిగాము.
రచయిత్రి: నాన్నగారి గురించి, వారి రచనలు గురించి మీరేం చెప్పదలుచుకున్నారు? సంచిక వెబ్ మ్యాగజైన్ లో నేను రాస్తున్న విషయాలు చాలవరకు మీ అన్నదమ్ములు నాకు చెప్పినవే. వేరే ఏమైనా జ్ఞాపకాలు చెప్పండి.
(కొవ్వలి లక్ష్మీనారాయణ గారి జ్ఞాపకాలు… తరువాయి భాగంలో..)